42 ఏళ్లకే బిగ్‌బాస్ న‌టి మృతి.. ఇంట్లో ఫోరెన్సిక్ టీమ్.. డెత్ మిస్టరీ ఏమైనా ఉందా? పోలీసులు ఏం చెప్పారు?

Best Web Hosting Provider In India 2024

42 ఏళ్లకే బిగ్‌బాస్ న‌టి మృతి.. ఇంట్లో ఫోరెన్సిక్ టీమ్.. డెత్ మిస్టరీ ఏమైనా ఉందా? పోలీసులు ఏం చెప్పారు?

బాలీవుడ్ నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ షెఫాలి జరివాలా 42 ఏళ్ల వయసులో మరణించడం కలకలం రేపుతోంది. ఆమె గుండెపోటుతో చనిపోయారనే వార్తలు వస్తున్నప్పటికీ.. షెఫాలి ఇంట్లో ఫోరెన్సిక్ టీమ్ క్లూస్ సేకరించడం హాట్ టాపిక్ గా మారింది. ఆమె మరణంపై పోలీసులు ఏమన్నారో ఇక్కడ తెలుసుకుందాం.

షెఫాలి జరివాలా

నటి షెఫాలి జరివాలా మరణం బాలీవుడ్ సినీ పరిశ్రమను, అభిమానులను దిగ్భ్రాంతికి గురిచేసింది. 42 ఏళ్ల ఆమె శుక్రవారం రాత్రి మరణించారు. మరణానికి అధికారిక కారణం ప్రకటించనప్పటికీ, కొన్ని నివేదికలు అది గుండెపోటు అని పేర్కొన్నాయి. మరణం సహజ కారణాల వల్ల జరిగినట్లు కనిపిస్తున్నప్పటికీ, ముంబయి పోలీసులు దీనిపై దర్యాప్తు ప్రారంభించారు.

ఇంట్లో మృతి

శుక్రవారం (జూన్ 27) రాత్రి.. షెఫాలి జరివాలా తన అంధేరీ ఇంట్లో మరణించినట్లు సమాచారం. ఆమె భర్త పరాగ్ త్యాగి ఆమెను బెల్లేవ్ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె అక్కడికి చేరుకునే లోపే మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. ముంబయి పోలీసులు శుక్రవారం రాత్రి ఆమె మరణాన్ని ధృవీకరించారు కానీ ఇప్పటివరకు మరణానికి గల కారణాన్ని వెల్లడించలేదు. శనివారం ఉదయం శవపరీక్ష కోసం షెఫాలి మృతదేహాన్ని కూపర్ ఆసుపత్రికి తరలించారు.

ఫోరెన్సిక్ టీమ్

షెఫాలి జరివాలా గుండెపోటుతో మరణించారనే వార్తలు వస్తున్నాయి. అయినా దీనిపై పోలీసుల ఎంక్వైరీ మొదలెట్టారు. ఆమె ఏ కారణంతో మరణించదనే విషయాన్ని ఆరా తీస్తున్నారు. ముంబయి పోలీసుల మెడికల్, ఫోరెన్సిక్ బృందాలు దర్యాప్తు కోసం షెఫాలి ఇంటికి చేరుకున్నాయి. ప్రస్తుతానికి, వారు దీనిని సాధారణ దర్యాప్తుగా పరిగణిస్తున్నారని పోలీసు వర్గాలు హిందూస్థాన్ టైమ్స్ కి తెలిపాయి. ఎందుకంటే శవపరీక్ష నిర్వహించే వరకు మరణానికి గల కారణాన్ని ప్రకటించలేరు.

అనుమానాలు లేకపోయినా

షెఫాలి జరివాలా మరణంపై ఎవరూ అనుమానాలు వ్యక్తం చేయలేదు. కానీ పోలీసులు మాత్రం తమ విచారణ నిర్వహిస్తున్నారు. ఇది సహజ మరణమేనా? ఏమైనా మిస్టరీ దాగి ఉందా? అని కనిపెట్టేందుకు రంగంలోకి దిగారు. దీన్ని ధృవీకరించడానికి ఫోరెన్సిక్స్ బృందం షెఫాలి, పరాగ్ అంధేరీ ఇంట్లో ఆధారాలు సేకరిస్తోంది. వారు నటి ఇంటి సిబ్బందిని, ఆమె వంటమనిషిని కూడా ప్రశ్నించారు.

షెఫాలి కుటుంబం, స్నేహితులు శనివారం ఉదయం అంతా కూపర్ ఆసుపత్రిలోనే ఉన్నారు. ఆమె మరణించిన పరిస్థితులకు సంబంధించి పరాగ్ లేదా కుటుంబ సభ్యులు ఎవరూ ఎటువంటి అధికారిక ప్రకటన విడుదల చేయలేదు.

వీడియోతో ఫేమస్

షెఫాలి జరివాలా తన మ్యూజిక్ వీడియో ‘కాంటా లగా’ విజయంతో 2002లో రాత్రికి రాత్రే స్టార్ అయ్యారు. ఆమె తరువాతి రెండు దశాబ్దాలుగా సినిమాలు, టీవీ షోలలో అప్పుడప్పుడు కనిపించింది. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గానే ఉంటుంది. హిందీ రియాలిటీ షోలో బిగ్ బాస్ లోనూ పార్టిసిపేట్ చేసింది. పరాగ్, షెఫాలి 2014లో వివాహం చేసుకున్నారు. షెఫాలి మరణంతో పరాగ్ తీవ్రమైన బాధలో మునిగిపోయారు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024