థ్రిల్లర్ నుంచి ఆంథాలజీ వరకు.. ఓటీటీలో ఈ వారం ట్రెండ్ అవుతున్న లేటెస్ట్ సౌత్ సినిమాలు.. ఓ లుక్కేయండి

Best Web Hosting Provider In India 2024

థ్రిల్లర్ నుంచి ఆంథాలజీ వరకు.. ఓటీటీలో ఈ వారం ట్రెండ్ అవుతున్న లేటెస్ట్ సౌత్ సినిమాలు.. ఓ లుక్కేయండి

మలయాళ కామెడీ డ్రామా పరివార్ నుంచి తెలుగు థ్రిల్లర్ ఒక పథకం ప్రకారం వరకూ ఓటీటీలో చూడదగిన కొత్త దక్షిణాది చిత్రాలు ఇవే. థ్రిల్లర్ తో సహా డిఫరెంట్ జోనర్లలో ఉన్న ఈ సినిమాలు ఏంటో ఓ సారి చూసేయండి.

ఓటీటీలో లేటెస్ట్ సౌత్ సినిమాలు

ఓటీటీలోకి ఈ వారం కూడా కొత్త సినిమాలు దూసుకొచ్చాయి. డిఫరెంట్ జోనర్లలో ఆకట్టుకుంటున్నాయి. ఇందులో దక్షిణాది సినిమాలు కూడా ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తున్నాయి. అలాంటి వాటిల్లో ఈ వారం ట్రెండింగ్ గా మారిన సౌత్ సినిమాలు మీకోసం ఇక్కడ తీసుకొచ్చాం. విరాటపాలెం: పి.సి.మీనా రిపోర్టింగ్ అనే మహిళా ప్రధాన సిరీస్ తో పాటు ఒక పథకం ప్రకారం వరకూ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్స్ ఉన్నాయి.

ఒక పథకం ప్రకారం

తెలుగు లీగల్ థ్రిల్లర్ మూవీ ఒక పథకం ప్రకారం. లాయర్ సిద్ధార్థ్ జీవితం తన భార్య కనిపించకుండా పోవడంతో ఒక్కసారిగా మలుపు తీసుకుంటుంది. ఒక షాకింగ్ ట్విస్ట్ తో అతను కేసులో ఇరుక్కుంటాడు. కానీ అతను కోర్టులో తన పేరును క్లియర్ చేసుకుంటాడు. అయితే మళ్లీ మరో హత్యలో చిక్కుకుంటాడు. వినోద్ విజయన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో సముద్రఖనితో పాటు సాయిరామ్ శంకర్ ప్రధాన పాత్ర పోషించారు. సన్ నెక్ట్స్ ఓటీటీలో ఈ సినిమా ఉంది.

నిమ్మ వాస్తుగలిగే నీవే జవాబ్దరారు

కన్నడ ఆంథాలజీ సినిమా నిమ్మ వాస్తుగలిగే నీవే జవాబ్దరారు. కేశవ్ మూర్తి ఈ మూవీకి డైరెక్టర్. కథ కూడా ఆయనే రాశారు. ఈ ఆంథాలజీ చిత్రం మూడు కథలను చాకచక్యంగా అల్లింది. ఇవన్నీ దొంగతనానికి సంబంధం ఉన్నట్లు అనిపించినా ఓ అదిరిపోయే ట్విస్ట్ ఉంటుంది. ఈ చిత్రం ఈ ఏడాది జనవరిలో థియేటర్లలో విడుదలైనప్పుడు పాజిటివ్ రెస్పాన్స్ తెచ్చుకుంది. ఈ వారం సన్ నెక్ట్స్ ఓటీటీలో అడుగుపెట్టింది ఈ సినిమా.

విరాటపాలెం: పి.సి.మీనా రిపోర్టింగ్

తెలుగు థ్రిల్లర్ వెబ్ సిరీస్ విరాటపాలెం: పి.సి.మీనా రిపోర్టింగ్. దర్శకుడు పోలూరు కృష్ణ రూపొందించిన ఈ సిరీస్ 1980వ దశకంలో కొత్తగా పెళ్లయిన మహిళలు చనిపోతున్న విరాటపాలెం గ్రామానికి మనల్ని తీసుకెళుతుంది. మిస్టరీ, సూపర్ నేచురల్, థ్రిల్లర్ ఎలిమెంట్స్ తో అల్లుకున్న ఈ సిరీస్ లో పెళ్లి రాత్రి జరిగే మరణాలు ఒక శాపంతో ముడిపడి ఉంటాయి. అనుమానాస్పద మరణాలకు కారణాన్ని కనుగొనే పి.సి.మీనాక్షి పాత్రలో నటి అభిజ్ఞా వుత్తలూరు నటించింది. జీ5లో ఈ వెబ్ సిరీస్ ఉంది.

పరివార్

మలయాళ కామెడీ డ్రామాగా తెరకెక్కింది పరివార్. భాస్కర పిళ్ళై మంచం పడతాడు. చావు బతుకుల మధ్య ఉంటాడు. అతని డైమండ్ రింగ్ ను దక్కించుకోవడం కోసం ముగ్గురు కొడుకులు పోటీపడతారు. కానీ వారు నిజంగా తమ వృద్ధ తండ్రి ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతున్నారా లేదా మరేదైనా జరుగుతోందా? అనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. క్యారెక్టర్, కామెడీ పాత్రలకు పేరుగాంచిన నటులు జగదీష్, ఇంద్రన్స్, రాజేంద్రన్, అలెగ్జాండర్ ప్రశాంత్ తదితరులు నటించారు. మీరు చమత్కారమైన ఫ్యామిలీ ఎంటర్టైనర్ కోసం చూస్తున్నట్లయితే ప్రైమ్ వీడియోలో పరివార్ చూడొచ్చు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024