సీ-డాక్‌ రిక్రూట్‌మెంట్.. భారీగా జీతంతో ఫ్రెషర్లకు కూడా ఛాన్స్.. అప్లై చేయండి!

Best Web Hosting Provider In India 2024


సీ-డాక్‌ రిక్రూట్‌మెంట్.. భారీగా జీతంతో ఫ్రెషర్లకు కూడా ఛాన్స్.. అప్లై చేయండి!

Anand Sai HT Telugu

సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(C-DAC) ప్రాజెక్ట్ సిబ్బంది నియామకాలను ప్రకటించింది. అభ్యర్థులు అధికారిక సైట్‌ను సందర్శించడం ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

ప్రతీకాత్మక చిత్రం

మీరు కంప్యూటర్, టెక్నాలజీ రంగంలో కెరీర్‌ను పొందాలని, ప్రభుత్వ సంస్థలో పనిచేయాలని అనుకుంటే మీ కోసం గోల్డెన్ ఛాన్స్ వచ్చింది. సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్(C-DAC) ప్రాజెక్ట్ సిబ్బంది నియామకానికి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నియామకం కింద మొత్తం 91 పోస్టులకు అభ్యర్థులను నియమిస్తారు.

C-DAC నియామకంలో ప్రాజెక్ట్ మేనేజర్, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఫ్రెషర్ వంటి పోస్టులు ఉంటాయి. ఈ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ప్రాజెక్టులలో పనిచేయడానికి గొప్ప అవకాశాన్ని పొందుతారు. అలాగే టెక్నాలజీ రంగంలో అనుభవాన్ని పొందుతారు.

అర్హతలు

ఈ పోస్టులకు, అభ్యర్థులు భారతదేశంలోని గుర్తింపు పొందిన సంస్థ నుండి బీఈ లేదా బిటెక్ డిగ్రీని కలిగి ఉండాలి.

వయోపరిమితి

వివిధ పోస్టులను బట్టి వయోపరిమితి నిర్ణయించారు. రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు నిబంధనల ప్రకారం వయోపరిమితిలో సడలింపు ఇస్తారు.

ప్రాజెక్ట్ మేనేజర్: గరిష్టంగా 56 సంవత్సరాలు, సీనియర్ ప్రాజెక్ట్ ఇంజనీర్: గరిష్టంగా 40 సంవత్సరాలు, అనుభవం ఉన్న ప్రాజెక్ట్ ఇంజనీర్: గరిష్టంగా 45 సంవత్సరాలు, ప్రాజెక్ట్ ఇంజనీర్ ఫ్రెషర్: గరిష్టంగా 30 సంవత్సరాలుగా ఉండాలి.

జీతం ఎంత?

C-DAC ద్వారా ఎంపిక చేసిన అభ్యర్థులకు పోస్టు ప్రకారం జీతం లభిస్తుంది. కనీస జీతం నెలకు రూ. 37,500, గరిష్టంగా నెలకు రూ. 1,10,000గా నిర్ణయించారు.

కావాల్సిన పత్రాలు

10వ, 12వ మార్కుల షీట్, గ్రాడ్యుయేషన్, పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ, ఆధార్ కార్డు, పాన్ కార్డు, కుల ధృవీకరణ పత్రం (వర్తిస్తే), మునుపటి సంస్థ నుండి అనుభవ ధృవీకరణ పత్రం (వర్తిస్తే) ఉండాలి.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

దరఖాస్తు ప్రక్రియ జూన్ 25, 2025 నుండి ప్రారంభమైంది. ఆసక్తిగల అభ్యర్థులు C-DAC cdac.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించడం ద్వారా జూలై 09, 2025 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకున్న తర్వాత అర్హత కలిగిన అభ్యర్థులను జూలై నాల్గో, ఐదో వారంలో జరిగే వాక్-ఇన్-ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూ సమయం ఉదయం 8:30 నుండి 10:30 వరకు నిర్ణయించారు.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

Best Web Hosting Provider In India 2024


Source link