ఆహా అనిపించే థ్రిల్లర్లు.. ఆహా ఓటీటీలో ఉన్న ఈ టాప్-5 లేటెస్ట్ సస్పెన్స్ మూవీస్ చూశారా?

Best Web Hosting Provider In India 2024

ఆహా అనిపించే థ్రిల్లర్లు.. ఆహా ఓటీటీలో ఉన్న ఈ టాప్-5 లేటెస్ట్ సస్పెన్స్ మూవీస్ చూశారా?

థ్రిల్లర్ సినిమాలకు ఉండే ఫ్యాన్ బేస్. క్షణక్షణం ఉత్కంఠ రేపుతూ సాగే ఇలాంటి సినిమాలు ఆడియన్స్ కు ఫుల్ ఎంటర్ టైన్ మెంట్ అందిస్తాయి. ఆహా ఓటీటీలో ఉన్న ఇలాంటి టాప్-5 సస్పెన్స్ థ్రిల్లర్లపై ఓ లుక్కేయండి.

ఆహా ఓటీటీలోని టాప్ 5 థ్రిల్లర్లు (x)

ఓటీటీలో ఢిఫరెంట్ జోనర్ మూవీస్ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇందులో థ్రిల్లర్ మూవీస్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. క్షణక్షణం ఉత్కంఠ రేపుతూ, కను రెప్ప వేయనివ్వని మూవీస్ కూడా ఉన్నాయి. ఆహా ఓటీటీలో ఉన్న అలాంటి టాప్-5 థ్రిల్లర్లు ఇవే. అవేంటో ఇక్కడ చూసేయండి.

23

మన సమాజంలో చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందా? అనే ప్రశ్నతో వచ్చిన మూవీ ‘23 ఇరవై మూడు’. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ వచ్చింది. కులం ఆధారంగా శిక్షలు విధిస్తారనే విషయాన్ని చాటుతూ.. న్యాయం కోసం బలహీన వర్గాలు సాగించే పోరాటం నేపథ్యంలో వచ్చింది ఈ సినిమా. ఈ మూవీ అదిరిపోయిందని, కథ ఆలోచించేలా ఉందని ఎక్స్ లో నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.

లెవన్

నవీన్ చంద్ర హీరోగా వచ్చిన ‘లెవన్’ మూవీ ఓటీటీలో అదరగొడుతోంది. ఈ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ ఆడియన్స్ ఎంగేజ్ చేస్తోంది. కవలలను టార్గెట్ చేసుకుని జరిగే సీరియల్ మర్డర్స్ వెనుకు ఉన్న హంతకుడిని పట్టుకునే కథతో లెవన్ మూవీ గ్రిప్పింగ్ గా సాగుతుంది. ఈ సినిమాలో ఏసీపీ అరవిందన్ గా నవీన్ చంద్ర యాక్టింగ్ తో అదరగొట్టాడు.

రేఖాచిత్రం

మిస్టరీ సస్పెన్స్ ఫుల్ క్రైమ్ థ్రిల్లర్ గా వచ్చింది ‘రేఖాచిత్రం’ మూవీ. ఈ మలయాళం ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ అదరగొడుతోంది. సస్పెన్షన్ నుండి తిరిగి విధుల్లోకి వచ్చిన పోలీసు అధికారి వివేక్, ఒక హత్య కేసును దర్యాప్తు చేయాల్సి వస్తుంది. ఒకప్పుడు సినీ పరిశ్రమలో జూనియర్ ఆర్టిస్ట్ గా పనిచేసిన రేఖ అనే యువతి హత్యకు గురైనట్లు తెలుస్తుంది. వివేక్ ఈ కేసుని విచారించే క్రమంలో చాలా కాలం క్రితం జరిగిన ఒక హత్య కేసుతో సంబంధం ఉందని తెలుసుకుంటాడు. వివేక్ ఈ కేసుని ఎలా ఛేదించాడు, రేఖ హత్య వెనుక ఉన్న నిజాలు ఏమిటి అనేది ఈ సినిమా కథ.

వడక్కన్

మలయాళం సూపర్ నేచురల్ థ్రిల్లర్ చిత్రం ‘వడక్కన్’. పోలీస్ ఆఫీసర్ కు సూపర్ నేచురల్ పవర్స్ వస్తే ఎలా ఉంటుందనే స్టోరీ లైన్ మరింత ఇంట్రెస్ట్ రేకెత్తిస్తోంది. కేరళలోని జానపద కథల ఆధారంగా ఈ సినిమా రూపొందించారు. ఇందులో పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ రామన్ పెరుమలయన్ పాత్రలో కిశోర్ నటించారు. అతను తన మాజీ ప్రియురాలి భర్త, అతని టీవీ సిబ్బంది మరణాల వెనుక ఉన్న రహస్యాన్ని ఛేదించడానికి కేరళకు తిరిగి వస్తాడు.

ది డెవిల్స్ చెయిర్

జబర్దస్త్ షోతో ఫేమ్ తెచ్చుకున్న అదిరే అభి లీడ్ రోల్ లో యాక్ట్ చేసిన మూవీ ‘ది డెవిల్స్ చెయిర్’. హారర్ థ్రిల్లర్ గా వచ్చిన ఈ మూవీలో మంచి సందేశం కూడా ఉంది. దురాశ దు:ఖానికి చేటు అని చాటుతుంది ఈ సినిమా. అప్పుల పాలై, ఉద్యోగం కోల్పోయిన ఓ యువకుడిగా మిస్టరీ చెయిర్ లో ఉన్న ఆత్మ డబ్బులు పొందే మార్గాలు చెబుతుంది. మరి ఆ చెయిర్ లో ఉన్నది ఎవరు? చివరకు ఏం జరిగిందనేది ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024