మీకు బిగ్ బాస్ కంటెస్టెంట్ కావాలనుందా? అయితే ఈ వార్త మీకోసమే.. ఇలా అప్లై చేసుకోండి.. ఎవరిదో లక్కీ ఛాన్స్?

Best Web Hosting Provider In India 2024

మీకు బిగ్ బాస్ కంటెస్టెంట్ కావాలనుందా? అయితే ఈ వార్త మీకోసమే.. ఇలా అప్లై చేసుకోండి.. ఎవరిదో లక్కీ ఛాన్స్?

బిగ్ బాస్ రియాలిటీ షోకు తెలుగు ఫ్యాన్స్ ఎక్కువే. సెలబ్రిటీలు ఆడే ఆటలు చూడటమే కాదు.. అందులో పార్టిసిపేట్ చేయాలని కూడా కోరుకుంటారు. కానీ ఏం చేయాలో, ఎలా చేయాలో తెలియదు. అలాంటి బిగ్ బాస్ ఫ్యాన్స్ కు గోల్డెన్ ఛాన్స్. మరి ఎలా అప్లై చేసుకోవాలో చూసేయండి.

బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున

బుల్లితెర రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు తొమ్మిదో సీజన్ కు ముందు ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్. ఈ సీజన్ లో సెలబ్రిటీలతో పాటు మనమూ అంటే కామన్ పీపుల్ కూడా పార్టిసిపేట్ చేయొచ్చు. ఈ సీజన్ కు సంబంధించిన క్యాస్టింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది. షో చరిత్రలోనే తొలిసారిగా సెలబ్రిటీలతో పాటు సామాన్యులను కూడా ఇందులో భాగస్వామ్యం చేయనున్నట్లు హోస్ట్ నాగార్జున ఆదివారం ప్రకటించారు.

రిటర్న్ గిఫ్ట్

బిగ్ బాస్ 9 ప్రమోషనల్ వీడియోలో నాగార్జున మాట్లాడుతూ.. ‘ఇప్పటి వరకు బిగ్ బాస్ అంటే మీకు చాలా ఇష్టం. కాబట్టి, మీకు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. మీరు ఇష్టపడే బిగ్ బాస్ హౌస్ లోకి మిమ్మల్ని అనుమతించడం మీ రిటర్న్ గిఫ్ట్. ఈ సారి సెలబ్రిటీలే కాదు మీరు కూడా ఈ షోలో పాల్గొనే అవకాశం దక్కించుకున్నారు. కాబట్టి రండి.. బిగ్ బాస్ సీజన్ 9 హౌస్ మీ కోసం వేచి ఉంది’’ అని పేర్కొన్నారు.

నాగార్జున స్థానంలో ఇతర స్టార్స్ బిగ్ బాస్ సీజన్ 9క హోస్ట్ గా వ్యవహరిస్తారని ప్రచారం జరుగుతున్నప్పటికీ ఈ రియాలిటీ షోకు ఆయనే హోస్ట్ గా కొనసాగుతారని ఈ వీడియో స్పష్టం చేస్తోంది.

ఎలా అప్లై చేయాలి

ఈ షోను నిర్మిస్తున్న ఎండెమోల్ షైన్ ఇండియా తమ ఇన్ స్టాగ్రామ్ లో ప్రమోషనల్ వీడియోను పోస్ట్ చేసి, ఈ షోలో పాల్గొనడానికి ఆసక్తి ఉన్నవారు ఎలా అప్లై చేసుకోవాలో సూచనలు ఇచ్చింది.

“#బిగ్ బాస్ 9 అందరికీ ఓపెన్! ఈ సారి మీరు కుడా బిగ్ బాస్ హౌస్ లో హౌస్ మేట్ అవ్వచ్చు! పాల్గొనడం చాలా సులభం: 1. bb9.jiostar.com సందర్శించండి 2. మీ పేరు నమోదు చేయండి 3. మీ మొబైల్ నెంబరు వెరిఫై చేయండి. 4. బిగ్ బాస్ 9 లో ఉండటానికి మీరు ఎందుకు అర్హులో తెలుపుతూ ఒక చిన్న వీడియో (గరిష్టంగా 3 నిమిషాలు) అప్ లోడ్ చేయండి. నియమనిబంధనలను అంగీకరించండి’’ అని పోస్టు చేసింది.

గతంలోనూ

అయితే బిగ్ బాస్ తెలుగు షోలో గతంలోనూ కొంతమంది సామాన్యులకు ఎంట్రీ ఇచ్చారు. అంటే సినిమా, సీరియల్స్ చేయకపోయినా సోషల్ మీడియాలో పాపులర్ అయితే అవకాశం ఇచ్చారు. అలా వచ్చిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ 7 విన్నర్ గా నిలిచిన సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ హోస్ట్ గా 2017లో బిగ్ బాస్ మొదటి సీజన్ ప్రారంభమైంది. 2018లో ప్రసారమైన తర్వాతి సీజన్లో నాని అతని స్థానాన్ని భర్తీ చేశాడు. అయితే 2019లో మూడో సీజన్ నుంచి నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తుండగా.. రమ్యకృష్ణ, సమంత రూత్ ప్రభు వివిధ కారణాలతో రెండుసార్లు గెస్ట్ హోస్ట్లుగా వ్యవహరించారు. శివ బాలాజీ, కౌశల్ మండా, రాహుల్ సిప్లిగంజ్, అభిజీత్, వీజే సన్నీ, ఎల్వీ రేవంత్, పల్లవి ప్రశాంత్, నిఖిల్ మలియక్కల్ గతంలో విజేతలుగా నిలిచారు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024