బ్రహ్మముడి జూన్ 30 ఎపిసోడ్: కావ్యకు రెండు రోజుల గడువు- యామిని రెండో దెబ్బ- 500 కోట్ల ప్రాజెక్ట్‌తో సిద్ధార్థ్ స్కెచ్!

Best Web Hosting Provider In India 2024

బ్రహ్మముడి జూన్ 30 ఎపిసోడ్: కావ్యకు రెండు రోజుల గడువు- యామిని రెండో దెబ్బ- 500 కోట్ల ప్రాజెక్ట్‌తో సిద్ధార్థ్ స్కెచ్!

Sanjiv Kumar HT Telugu

బ్రహ్మముడి సీరియల్ జూన్ 30 ఎపిసోడ్‌లో ఆఫీస్ నుంచి కాల్ రావడంతో కావ్య వెళ్లిపోతుంది. బోర్డ్ మీటింగ్ పెట్టిన సిద్ధార్థ్ తన వల్ల రూ. 500, వెయ్యి కోట్ల ప్రాజెక్ట్స్ వస్తాయని, కానీ, తనకు కంపెనీ పవర్స్ ఇవ్వాలని, లేదా రెండు రోజుల్లో తనకంటే బెస్ట్ అని కావ్య నిరూపించుకోవాలని సిద్ధార్థ్ చెబుతాడు.

బ్రహ్మముడి సీరియల్‌ జూన్ 30వ తేది ఎపిసోడ్

బ్రహ్మముడి సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌‌లో రాత్రి రాజ్, కావ్య మాట్లాడుకుంటారు. నేను మీ ఇంటికి ఎందుకు వచ్చానో తెలిసి తెలియనట్లు నటిస్తున్నారు. అది ఫోన్‌లో చెప్పను. మీరు కళ్లముందు ఉన్నప్పుడు చెబితే బాగుంటుంది. ఆ ఫీలింగ్ బాగుంటుంది. రేపటి వరకు వెయిట్ చేయండి అని రాజ్ అంటాడు.

వీలైనంత త్వరగా

నేను ఎదురుచూస్తుంటాను అని కావ్య అంటుంది. మీకు నేను ఏం చెబుతానో అర్థమై కూడా తెలియనట్లు ఉన్నారు. ఈ ఒక్కరాత్రి ఆగండి. నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నట్లు చెప్పేస్తాను అని రాజ్ అనుకుంటాడు. మరుసటి రోజు ఉదయం నీకు ఇవాళ ఎంత అర్జంట్ వర్క్ ఉన్న నువ్వ వెళ్లకూడదు అని ఫోన్ లాక్కుంటారు అపర్ణ, ఇందిరాదేవి. వీలైనంత త్వరగా వాడి ప్రేమను యాక్సెప్ట్ చేస్తే అయిపోతుందని సుభాష్ అంటాడు.

అదంతా జరగదని రుద్రాణి మనసులో అనుకుంటుంది. అంతా కావ్య, రాజ్ కలవాలని కోరుకుంటున్నట్లు మాట్లాడుతారు. ఈరోజు నీకున్న పనులన్నీ క్యాన్సిల్ చేసుకో. వాడు వచ్చి చెప్పగానే ఐ లవ్యూ టు అని చెప్పు అని ఇందిరాదేవి అంటుంది. ఇంతలో రాజ్ వస్తాడు. అంతా ఇక్కడే ఉన్నారు. కళావతికి కౌన్సిలింగ్ ఇస్తున్నావా అని అపర్ణను అంటాడు రాజ్.

ఎక్కడికి వెళ్లకుండా వెళ్లమని చెబుతున్నాను. నిన్న కళావతికి ఏదో చెబుతా అన్నావ్‌గా చెప్పు అని అపర్ణ అంటుంది. అలా బయటకు అని రాజ్ అంటే బయటేమొద్దు ఇక్కడే చెప్పేసేయ్ అని ఇందిరాదేవి అంటుంది. మనకు నచ్చినవాళ్లు కళ్లముందు ఉంటే అని రాజ్ చెప్పబోతుంటే కావ్యకు మేనేజర్ కాల్ చేస్తాడు. కానీ, అపర్ణ స్విచాఫ్ చేస్తుంది. నా జీవితంలో సంతోషం అనే పదానికి డెఫినేషన్ అని రాజ్ అంటుంటే సుభాష్‌కు కాల్ వస్తుంది.

సుభాష్‌కు షాక్

సుభాష్ కాల్ లిఫ్ట్ చేయగానే ఆ సిద్ధార్థ్ సడెన్‌గా వచ్చి బోర్డ్ మీటింగ్ పెడుతున్నారు అని మేనేజర్ చెబుతాడు. దాంతో షాక్ అయిన సుభాష్ కావ్యకు ఫోన్ ఇస్తాడు. సిద్దార్థ్ సడెన్‌గా వచ్చి బోర్డ్ మీటింగ్ అంటున్నాడు. ఏదో ప్లాన్ చేస్తున్నట్లు ఉన్నారు అని మేనేజర్ చెబుతాడు. అదే విషయం చెప్పి నేను అర్జంట్‌గా ఆఫీస్‌కు వెళ్లాలి అని కావ్య అంటూ రాజ్ వైపు చూస్తుంది.

అర్జంట్ వర్క్. వెళ్లండి అని రాజ్ అంటాడు. సరే అని కావ్య అంటే.. ఒక్క పది నిమిషాలు ఆగు అని ఇందిరాదేవి, అపర్ణ అరుస్తారు. ఇప్పుడు కావ్య వెళ్లడం చాలా ఇంపార్టెంట్. లేకుంటే కంపెనీ రిస్కులో పడుతుంది అని సుభాష్ అంటాడు. అపర్ణ ఆపబోతుంటే రాజ్ వద్దని కావ్యను వెళ్లమంటాడు. దాంతో కావ్య వెళ్లిపోతుంది. మీటింగ్‌కు కావ్య వస్తుంది.

నాకు మీటింగ్ గురించి తెలియదు లేకుంటే ముందే వచ్చేదాన్ని అని కావ్య అంటుంది. మీకు మెసేజ్ ఫార్వాడ్ చేశాననుకున్నా. కానీ కాలేదు అని సిద్ధార్థ్ అంటాడు. మీకు అనుభవం లేదు కదా. ఇలాంటివి అంతగా తెలియవు అని సిద్ధార్థ్‌కు కౌంటర్ వేస్తుంది కావ్య. సడెన్‌గా మీటింగ్ పెట్టడానికి కారణం ఏంటని మిగతా మెంబర్స్ అడుగుతారు. కంపెనీ గ్రోత్ గురించి అని సిద్ధార్థ్ అంటే కంపెనీ గ్రోత్ బాగుందిగా అని శేషు అంటాడు.

వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ కూడా

ఏంటండి గుడ్. లాభాలతో నడిచేది నత్త నడక సాగుతుంది. టాప్ 1లో ఉండేది టాప్ 10లో ఉంది. నేను మంచి ఐడియాతో వచ్చాను. ఇది 500 కోట్ల ప్రాజెక్ట్. నన్ను నమ్మి ప్రాజెక్ట్ ఇచ్చారు. లండన్, పారిస్‌లో విగ్రహాలకు ఆర్నమెంట్స్ చేయాలి. ఇది సరిగ్గా చేస్తే మరో వెయ్యి కోట్ల ప్రాజెక్ట్ వస్తుంది. కానీ, ఇది అవ్వాలంటే నాదో కండీషన్. ప్రస్తుతం బోర్డ్ మెంబర్‌గా ఉండి హెడ్‌గా ఉన్న కావ్య గారు ఆ పోస్ట్ నుంచి తప్పుకోవాలని సిద్ధార్థ్ చెబుతాడు.

ఆ పోస్ట్ నుంచి తప్పుకుని ఆ ప్లేస్ నాకిచ్చి కంపెనీ పవర్స్ నా చేతులో పెడితే ఈ కాంట్రాక్ట్ మనకు వచ్చేలా చేస్తాను అని సిద్ధార్థ్ అంటాడు. కావ్య షాక్ అవుతుంది. ఆవిడ మీద నాకు నమ్మకం లేదు. రాజ్ గురించి తెలుసు కాబట్టి ఆబ్జెక్షన్ పెట్టలేదు. కానీ, కావ్య మీద నమ్మకం లేదు. కావ్యను కుర్చీలో నుంచి దింపేసి నాకు ఇస్తే స్టేట్‌లో నెంబర్ వన్ చేస్తానంటున్నాను అని సిద్ధార్థ్ అంటాడు.

అంతా డిస్కషన్ చేస్తారు. కావ్యకే ప్రాజెక్ట్ హ్యాండోవర్ చేస్తే సరిపోతుంది కదా అని వారంటరు. సరే చేస్తాను. కానీ, ఇంకో కండీషన్. నాకన్న కావ్య బెస్ట్ అని ప్రూవ్ చేసుకోవాలి. అది కూడా రెండు రోజుల్లో అని గడువు పెడతాడు సిద్ధార్థ్. కావ్య ఏం మాట్లాడదు. రెండు రోజుల్లో కావ్య గారు మీకంటే బెస్ట్ అని నిరూపించుకోకపోతే మీకే కంపెనీ పవర్స్ అని సిద్ధార్థ్ సైడ్ వాళ్లు అంటారు.

రెండు రోజుల టైమ్

మీటింగ్ ఈజ్ ఓవర్. ఇక వెళ్దామా అని సిద్ధార్థ్ అంటే బోర్డ్ మెంబర్స్ వెళ్లిపోతారు. ఆల్ ది బెస్ట్ కావ్య గారు అని సిద్ధార్థ్ వెల్లిపోతాడు. కావ్య కంగారుగా బయటకు వస్తుంది. ఇప్పుడు రాజ్ సర్ లేకపోయేసరికి కంపెనీ పగ్గాలు చేపట్టేందుకు ట్రై చేస్తున్నాడు. మీరే బెస్ట్ అని నిరూపించుకోండి అని శ్రుతి అంటుంది. ఎవరు పడితే అలా కూర్చోలేరు. ఇంకా రెండు రోజుల టైమ్ ఉందిగా నేను చూసుకుంటాను అని కావ్య అంటుంది.

ఇంతలో కావ్యకు యామిని కాల్ చేసి బోర్డ్ మీటింగ్ గురించి చెప్పి ఎలా ఉంది నా రెండో బహుమతి (దెబ్బ). ఆ సిద్ధార్థ్‌ను పంపించింది నేనే. కంపెనీ బాధ్యతలు నీ చేయి జారకుండా ఎా కాపాడుకుంటావ్. కుటుంబంలో నీ స్థానం కూడా పోతుంది అని యామిని అంటుంది. కట్ చేస్తే కావ్య దగ్గరికి రాజ్ వచ్చి ఏదో ముఖ్యమన విషయం మాట్లాడాలి అన్నారని అడుగుతాడు. అక్కడితో నేటి బ్రహ్మముడి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024