గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: చీర కోసం ప్రభావతి, శోభ గొడవ- ఇద్దరికీ న్యాయం చేసిన శ్రుతి- బాలుకు నిరాశ!

Best Web Hosting Provider In India 2024

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: చీర కోసం ప్రభావతి, శోభ గొడవ- ఇద్దరికీ న్యాయం చేసిన శ్రుతి- బాలుకు నిరాశ!

Sanjiv Kumar HT Telugu

గుండె నిండా గుడి గంటలు జూన్ 30 ఎపిసోడ్‌లో నల్లపూసల వేడుకలో తాను తీసుకొచ్చిన చీర కట్టుకోవాలని తల్లి శోభ, ఆచారం తప్పకూడదని అత్తింటి చీరే కట్టుకోవాలని ప్రభావతి ఇద్దరు గొడవ పడతారు. అటు తల్లికి, ఇటు అత్తకు సమానమైన న్యాయం చేసి తెలివైన పిల్లగా శ్రుతి పేరు తెచ్చుకుంటుంది. భార్య శ్రుతికి రవి ముద్దు పెడతాడు.

గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూన్ 30 ఎపిసోడ్‌

గుండె నిండా గుడి గంటలు సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో నల్ల పూసల వేడుకలో శ్రుతిని బంగారు ఆభరణాలతో రిచ్‌గా అందంగా అంలకరిస్తారు. ఇదంతా మా అమ్మ కోసం అని ఫ్రెండ్స్‌కు శ్రుతి చెబుతుంది. ఇప్పుడు వేసుకున్నా. మళ్లీ సీమంతానికేగా అని ఫ్రెండ్స్ అంటుంటే రవి వచ్చి శ్రుతి ఇంకా ఎంత టైమ్ పడుతుందంటాడు. ఇంకో ఆరు నెలలు. దీనికి సీమంతం కావాలంటే అని ఫ్రెండ్స్ సరదాగా అంటారు.

శ్రుతికి రవి ముద్దు

తర్వాత అరగంట వరకు రాము అని ఫ్రెండ్స్ వెళ్లిపోతారు. శ్రుతిని అలాగే చూసిన రవి కొత్తగా ఉన్నావ్ అని రవి అంటాడు. తర్వాత శ్రుతికి రవి ముద్దు పెడతాడు. తర్వాత ఇద్దరు ప్రేమగా హగ్ చేసుకుంటారు. ఇంతలో శోభ వచ్చి చూసి సిగ్గుపడుతుంది.కంగారుగా రవి వెళ్లిపోతాడు. ఈ చీరలోనే అన్ని నగలు వేసుకున్నావా. ఫంక్షన్‌కు ఇంకో చీర కట్టుకోవాలని వెళ్లిపోతుంది శోభన.

రోహిణిని రెడీ చేసిన విద్య ఎంతో అందంగా ఉన్నావ్. నీకు శ్రుతికి ఒక్కటే తేడా. తను జ్యూయలరీ షాపులో బొమ్మలా ఉంది. అది మీ అత్త చూస్తే నీ మీదకు వస్తుంది అని విద్య అంటుంది. అవును, నా మీదకు వచ్చేలోపే ఇక్కడ గొడవ చేయాలి అని వాళ్లు ప్లాన్ చేసిన వ్యక్తిని పిలవమంటుంది రోహిణి. దాంతో అతనికి విద్య కాల్ చేస్తే బార్ సెటప్‌తో రెడీగా ఉన్నాను. అన్ని బ్రాండ్స్ తీసుకొచ్చాను. అతన్ని మందులో ముంచుతాను చూడండి అని చెబుతాడు.

బాలుతో కచ్చితంగా తాగిస్తాడుగా అని రోహిణి అంటే బాలు తాగడంలో డిగ్రీ చేశాడుగా కచ్చితంగా తాగుతాడు అని విద్య అంటుంది. ఇంతలో బాలు పలకరించలేదని ఒకతను గొడవ పెట్టుకుంటాడు. దాంతో కామాక్షి వచ్చి మౌనవ్రతం ఉంటే ఎలా మాట్లాడుతారు అని చెప్పి పంపిస్తుంది. మరోవైపు శోభ సాధారణంగా అత్తగారు చీర తెస్తారుగా అని బంధువు ఆవిడ అంటే వాళ్లు తెచ్చే నాసిరకపు మతకపు చీర నేనేందుకు కట్టిస్తాను. ఇది నేను చేస్తున్న ఫంక్షన్. నా మాట నెగ్గాలి అని వెళ్లిపోతుంది శోభ.

ఆచారం తప్పకూడదుగా

ఆ మాటలను మీనా, కామాక్షి, బాలు వింటారు. వెళ్లి ప్రభావతికి చెబుతుంది కామాక్షి. కోటీశ్వరాలు అయితే ఆచారం ఎలా తప్పుతారు. నా మాటే నెగ్గాలి అని ప్రభావతి అంటుంది. అయిపోయింది. నా వల్ల కాదు. వీళ్ల వల్లే ఫంక్షన్ ఆగిపోతుంది. పోట్లగిత్తల్లా కొట్టుకుంటారు అని బాలు అంటాడు. శ్రుతి దగ్గరికి వెళ్లి తను తెచ్చిన చీర కట్టుకోమ్మని శోభ అంటుంది.

ఇంతలో ప్రభావతి వచ్చి మీ అంత కాకపోయిన ఖరీదైన చీరే తీసుకొచ్చాను. ఆచారం తప్పకూడదుగా అని అంటుంది. ఫంక్షన్ అంతా మేము చేస్తే చీర తెచ్చి మీరు చేశారని చెప్పుకుంటారు అని శోభ అంటుంది. అలా ఎందుకు చెప్పుకుంటాం. మీరు చేస్తున్నట్లు అందరికి తెలుసుగా అని ప్రభావతి అంటుంది. ఎవరు చెప్పిన నేను వినను అని శోభ అంటుంది.

ఈ విషయం నేను రాజీ పడను అని ప్రభావతి అంటుంది. ప్రభావతి, శోభ ఇద్దరూ చీర విషయంలో వాదించుకుంటారు. బయట బాలు గొడవ కోసం వెయిట్ చేస్తుంటాడు. ఇద్దరూ లేచిపోవడం గురించి అనుకుంటారు. ఎవరో ఒకరు తగ్గండి అని కామాక్షి అంటుంది. మీరు తెచ్చిన నాసిరకం చీర కట్టుకోవాల అని శోభ అంటుంది. ఇప్పటిదాకా మీ బాధ ఇదా. ఇప్పుడు మీ నిజ స్వరూపం బయటపడింది. మీరే ఫంక్షన్ చేసుకోండి. మేము మా అబ్బాయిని తీసుకుని వెళ్లిపోతాం అని ప్రభావతి వెళ్తుంది.

సమానమైన న్యాయం

స్టాప్ ఇట్ అని శ్రుతి గట్టిగా అరుస్తుంది. దాంతో ప్రభావతి ఆగిపోతుంది. ఒక చీర కోసం నన్ను రవిని విడదీసేలా ఉన్నారా. అసలు మీరు పెద్దవారేనా అని శ్రుతి నిలదీస్తుంది. రెండు చీరలు తీసుకున్న శ్రుతి అత్తగారు తెచ్చింది సాఫ్ట్‌గా ఉంది అదే కట్టుకుంటా అని చెబుతుంది. అయితే నన్ను అవమానిస్తావా అని తల్లి శోభ అంటే లేదు. నువ్ తెచ్చిన నగలన్ని వేసుకుంటాగా అని శ్రుతి అంటుంది.

ఇద్దరికి సమమైన న్యాయం చేశావు పిల్ల అని కామాక్షి అంటుంది. ఇంత ఖర్చు పెట్టి ఫంక్షన్ చేస్తే అని శోభ అంటే అమ్మా నా విషయం ఖర్చు గురించి మాట్లాడితే ఈ ఫంక్షనే వద్దనేదాన్ని. నేను అక్కడికే వెళ్లాలిగా. ఆవిడకు గౌరవం ఇవ్వాలిగా అని శ్రుతి అంటుంది. నిన్ను పంపించడానికి కాదే నీ భర్తని మన ఇంటికి రప్పించడానికి ప్లాన్ చేస్తున్నాను అని శోభ మనసులో అనుకుని బయటకు సరే అని అంటుంది.

సత్యం, రంగా సురేంద్ర గురించి మాట్లాడుకుంటారు. శ్రుతి అత్త తెచ్చిన చీర కట్టుకుని వస్తుంది. అది చూసిన బాలు గొడవ జరగలేదని నిరాశపడతాడు. శ్రుతి తెలివైన పిల్ల అత్త తెచ్చిన చీర కట్టుకుంది. తల్లి వాళ్ల పూలమాల వేసుకుంది అని మీనా అంటుంది. అంటే ఇద్దరికి న్యాయం చేసిందన్నమాట అని రంగా అంటాడు. శ్రుతి మహాలక్ష్మిలా ఉందని సత్యం అంటాడు.

గొప్పింటివాళ్లకే

శ్రుతి తెలివైన పిల్ల అని, గొప్పింట్లో వాళ్లకే ఇలాంటివి వస్తాయని ఇన్‌డైరెక్ట్‌గా మీనాను సత్యంతో అంటుంది ప్రభావతి. అందుకే నీకు రాలేదమ్మా. ఇంతకాలం నిన్ను నాన్న భరిస్తున్నాడు. నీకు ఓపిక రత్న అని బిరుదు ఇవ్వాలి అని బాలు కౌంటర్ వేస్తాడు. అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024