ఫస్ట్ వీకెండే రూ.470 కోట్లు వసూలు చేసిన కార్ రేసింగ్ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర సంచలనం

Best Web Hosting Provider In India 2024

ఫస్ట్ వీకెండే రూ.470 కోట్లు వసూలు చేసిన కార్ రేసింగ్ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర సంచలనం

Hari Prasad S HT Telugu

హాలీవుడ్ భారీ బడ్జెట్ కార్ రేసింగ్ మూవీ ఎఫ్ 1 బాక్సాఫీస్ దగ్గర దూసుకెళ్లింది. ఫస్ట్ వీకెండే ఏకంగా రూ.470 కోట్లు వసూలు చేసిన సంచలనం సృష్టించింది. ఆపిల్ నుంచి వచ్చిన ఈ సినిమా ఆ సంస్థకు తొలి సక్సెస్ అందించింది.

ఫస్ట్ వీకెండే రూ.470 కోట్లు వసూలు చేసిన కార్ రేసింగ్ మూవీ.. బాక్సాఫీస్ దగ్గర సంచలనం

ఈ ఏడాది ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన సినిమాల్లో బ్రాడ్ పిట్ నటించిన రేసింగ్ డ్రామా ‘F1’ ఒకటి. జోసెఫ్ కోసిన్స్కి డైరెక్ట్ చేసిన ఈ సినిమా.. విడుదలైన తొలి వీకెండ్ లో యూఎస్ బాక్సాఫీస్ దగ్గర సంచలనం సృష్టించింది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ డ్రామాకు అభిమానులు, విమర్శకుల నుండి పాజిటివ్ రివ్యూలు వచ్చాయి. తాజాగా ‘వెరైటీ’ రిపోర్టు ప్రకారం, ఈ సినిమా దేశీయంగా విడుదలైన మొదటి వీకెండ్ లో 55.6 మిలియన్ డాలర్లు (సుమారు రూ. 470 కోట్లు) వసూలు చేసింది.

‘F1’ బాక్సాఫీస్ అప్‌డేట్

‘వెరైటీ’ నివేదిక ప్రకారం, ‘F1’ సినిమా 50 మిలియన్ డాలర్ల నుండి 60 మిలియన్ డాలర్ల అంచనాలకు తగ్గకుండా మంచి వసూళ్లను సాధించింది. ఇది ఇప్పటికే ఉన్న ఫ్రాంచైజీలో భాగం కానప్పటికీ.. ఫస్ట్ వీకెండ్ వసూళ్లు చాలా మెరుగ్గా ఉన్నాయి.

అయితే 250 మిలియన్ డాలర్ల బడ్జెట్‌ను బ్రేక్ ఈవెన్ చేయడానికి, సినిమా మొదటి వారంలో స్థిరంగా వసూళ్లు సాధించాలి. అదనంగా, ఈ మూవీ 78 అంతర్జాతీయ మార్కెట్లలో విడుదలై 88.4 మిలియన్ డాలర్లు (సుమారు రూ.739 కోట్లు) వసూలు చేసింది.

ఆపిల్‌కు తొలి బిగ్ హిట్

‘F1’ ఇప్పుడు ఆపిల్‌కు మొదటి కమర్షియల్ సక్సెస్ ను అందించింది. అంతకుముందు ఈ టెక్ దిగ్గజం మార్టిన్ స్కోర్సెస్ దర్శకత్వంలో వచ్చిన ‘కిల్లర్స్ ఆఫ్ ది ఫ్లవర్ మూన్’, రిడ్లీ స్కాట్ దర్శకత్వంలో వచ్చిన ‘నెపోలియన్’ వంటి సినిమాలను నిర్మించింది. అయితే, ఆ రెండు సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఈ తాజా విజయంపై ఆపిల్ ప్రపంచవ్యాప్త వీడియో హెడ్ జేమీ ఎర్లిచ్ ఒక ప్రకటన విడుదల చేశారు.

“F1 సినిమాకు ప్రపంచవ్యాప్తంగా వచ్చిన స్పందన చూసి మేము చాలా సంతోషిస్తున్నాం. సినిమాను ఇంత ఉత్సాహంగా ఆదరించిన ప్రేక్షకులకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. ఈ విజయం జో, జెర్రీ, బ్రాడ్, లూయిస్ ల దార్శనికతకు.. అలాగే మొత్తం నటీనటులు, సిబ్బంది కృషికి నిదర్శనం. ఫార్ములా 1తో కలిసి ఒక స్ఫూర్తిదాయకమైన సినిమాను సృష్టించారు” అని ఆయన అన్నారు.

ఎఫ్1 మూవీ స్టోరీ ఏంటంటే?

ఎఫ్1 మూవీ సోనీ హేస్ (బ్రాడ్ పిట్) అనే అనుభవజ్ఞుడైన ఫార్ములా వన్ డ్రైవర్ చుట్టూ తిరుగుతుంది. 30 సంవత్సరాల విరామం తర్వాత అతను తిరిగి ఈ రేసింగ్ లోకి ప్రవేశిస్తాడు. ఒకప్పుడు అతని సహచరుడు అయిన రూబెన్ సెర్వాంటెస్ (జావియర్ బార్డెమ్ పోషించిన పాత్ర) ఇప్పుడు ఒక కష్టాల్లో ఉన్న F1 టీమ్‌ను నడుపుతుంటాడు. అతను సోనీని తిరిగి ఫార్ములా వన్ ప్రపంచంలోకి తీసుకువస్తాడు. ఈ చిత్రంలో డామ్‌సన్ ఇద్రిస్, కెర్రీ కాండన్, టోబియాస్ మెంజీస్, సారా నైల్స్ కూడా నటించారు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024