




Best Web Hosting Provider In India 2024
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి బిగ్ అప్డేట్! 1340 పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ షురు..
ఎస్ఎస్సీ జేఈ రిక్రూట్‌మెంట్ 2025 రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైంది. ఈ దఫా రిక్రూట్మెంట్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి? ఫీజు ఎంత? ముఖ్యమైన తేదీలు ఏంటి? వంటి పూర్తి వివరాలను ఇక్కడ తెలుసుకోండి..
స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్ఎస్సీ) జూనియర్ ఇంజనీర్ (సివిల్, మెకానికల్- ఎలక్ట్రికల్) రిక్రూట్‌మెంట్ పరీక్ష 2025 కోసం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీంతోపాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియను కూడా ప్రారంభించింది. ఆసక్తి గల అభ్యర్థులు ssc.gov.in వెబ్‌సైట్ ద్వారా SSC JE 2025 పరీక్షకు దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకునేందుకు చివరి తేదీ జులై 21 అని గుర్తుపెట్టుకోవాలి.
ఎస్ఎస్సీ జేఈ రిక్రూట్‌మెంట్ 2025: ముఖ్యమైన తేదీలు- వివరాలు..
ఎస్ఎస్సీ జేఈ 2025 ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ తేదీలు: జూన్ 30 నుంచి జులై 21 వరకు.
ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ- సమయం: జులై 22 (రాత్రి 11 గంటల వరకు).
దరఖాస్తు ఫారమ్ సవరణ విండో: ఆగస్టు 1 నుంచి 2 వరకు.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (పేపర్-I) తాత్కాలిక షెడ్యూల్: అక్టోబర్ 27 నుంచి 31 వరకు.
కంప్యూటర్ ఆధారిత పరీక్ష (పేపర్-II) తాత్కాలిక షెడ్యూల్: జనవరి-ఫిబ్రవరి, 2026.
దరఖాస్తు ఫారమ్ నింపడంలో ఏదైనా ఇబ్బంది తలెత్తితే సంప్రదించాల్సిన టోల్-ఫ్రీ హెల్ప్‌లైన్ నంబర్: 180 030 93063.
ఈ రిక్రూట్‌మెంట్ ద్వారా మొత్తం 1,340 తాత్కాలిక ఖాళీలను భర్తీ చేయనున్నారు. పోస్ట్, కేటగిరీ వారీగా తుది ఖాళీల వివరాలు త్వరలో అధికారిక వెబ్‌సైట్‌లో ప్రకటిస్తారు.
ఎస్ఎస్సీ జేఈ రిక్రూట్‌మెంట్ 2025 కోసం వయోపరిమితి వివిధ పోస్టులకు వేరువేరుగా ఉంటుంది. అభ్యర్థులు మరింత సమాచారం కోసం అధికారిక నోటిఫికేషన్‌ను క్షుణ్ణంగా చదవాలని సూచించడం జరిగింది.
ఎస్ఎస్సీ దరఖాస్తు రుసుము రూ. 100. అయితే, మహిళా అభ్యర్థులు, షెడ్యూల్డ్ కులాలు (ఎస్సీ), షెడ్యూల్డ్ తెగలు (ఎస్టీ), బెంచ్‌మార్క్ వికలాంగులు (పీడబ్ల్యూబీడీ), రిజర్వేషన్‌కు అర్హులైన మాజీ సైనికులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.
ఎస్ఎస్సీ జేఈ రిక్రూట్‌మెంట్ కోసం కంప్యూటర్ ఆధారిత పరీక్ష రెండు పేపర్‌లలో నిర్వహిస్తారు.
సబ్జెక్ట్ | ప్రశ్నలు/మార్కులు | వ్వవధి |
---|---|---|
జెనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ | 50/ 50 | 2 గంటలు |
జెనరల్ అవేర్నెస్ | 50/ 50 | |
పార్ట్ ఏ- జెనరల్ ఇంజినీరింగ్ (సివిల్- స్ట్రక్చరల్) లేదా పార్ట్ బీ- జెనరల్ ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్) లేదా పార్ట్ సీ- జెనరల్ ఇంజినీరింగ్ (మెకానికల్) | 100/ 100 |
సబ్జెక్ట్ | ప్రశ్నలు/మార్కులు | వ్యవధి |
---|---|---|
పార్ట్ ఏ- జెనరల్ ఇంజినీరింగ్ (సివిల్- స్ట్రక్చరల్) లేదా పార్ట్ బీ- జెనరల్ ఇంజినీరింగ్ (ఎలక్ట్రికల్) లేదా పార్ట్ సీ- జెనరల్ ఇంజినీరింగ్ (మెకానికల్) | 100/ 300 | 2 గంటలు |
మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్‌ని పరిశీలించాలి.
ఎస్ఎస్సీ జేఈ రిక్రూట్‌మెంట్ 2025 రిజిస్ట్రేషన్ డైరక్ట్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link