



Best Web Hosting Provider In India 2024

గుండె నిండా గుడి గంటలు టుడే ఎపిసోడ్: మీనా మాట నిలబెట్టిన బాలు -రౌడీతో రోహిణి డీల్ -బెడిసికొట్టిన శోభన ప్లాన్
గుండె నిండా గుడి గంటలు సీరియల్ జూలై 1 ఎపిసోడ్‌లో బాలును అడ్డుపెట్టుకొని ఫంక్షన్‌లో గొడవలు సృష్టించాలని శోభన, రోహిణి స్కెచ్ వేస్తారు. బాలుకు కోపాన్ని తెప్పించేందుకు శోభన మనుషులు ప్రయత్నిస్తారు. వారు ఎన్ని ఇబ్బందులు పెట్టినా మీనాకు ఇచ్చిన మాట గుర్తొచ్చి బాలు సైలెంట్‌గా ఉంటాడు.
తాళిబొట్టు మార్చే ఫంక్షన్‌ను రోహిణితో మొదలుపెట్టాలని ప్రభావతి అనుకుంటుంది. రోహిణి తండ్రి రాకపోవడంతో ఆమె టెన్షన్ పెరిగిపోతుంది. ఫంక్షన్‌లో ఏదో గొడవ జరుగుతుందని నా సిక్త్స్ సెన్స్ చెబుతుందని శృతితో రవి అంటాడు. మా అమ్మ నాన్న ఇంతకుముందులా లేరని, మారిపోయారని తల్లిదండ్రులను వెనకేసుకు వస్తుంది శృతి. ఏ గొడవ జరగకుండా తాను మ్యానేజ్ చేస్తానని భర్తకు మాటిస్తుంది.
బాలు సైగలు…
బాలు సైగలతో మీనాకు ఏదో చెబుతాడు. భర్త ఏం చెబుతున్నాడో మీనాకు అర్థం కాదు. బాలు సైగలకు తాను అర్థం చెబుతానని కామాక్షి అంటుంది. అందరిని కొట్టేసి రమ్మంటున్నావా…రవి వాళ్ల అత్త బాగా తిని తెగ లావైపోయిందని చెబుతున్నావు అంటూ బాలు అన్న మాటలను పూర్తిగా మార్చేసి చెబుతుంది. దాంతో బాలు తల పట్టుకుంటాడు.
గొడవ జరుగుతుందని అనుకున్నా…
పూల మాల విషయంలో పెద్ద గొడవ జరుగుతుందని అనుకున్నా…అదేంటి తుస్ మంది అని మీనాతో అంటాడు బాలు. నాకు పనిలేకుండాపోయిందని చెబుతాడు. ఏ గొడవ జరగలేదని ఫీలవుతున్నారా అని భర్తను నిలదీస్తుంది మీనా. మీరు ఇలా నోరు విప్పకుండా ఉంటేనే నేను మనశ్శాంతిగా ఉంటాను. ఫంక్షన్ ప్రశాంతంగా జరుగుతుందని భర్తతో మీనా అంటుంది.
నొప్పితో విలవిల…
బాలుతో గొడవ పెట్టుకోవడానికి ఇద్దరు మనుషులను నియమిస్తుంది శోభన. బాలును చూపించి అతడికి ఎలాగైనా కోపం తెప్పించి గొడవ పెద్దది చేయాలని వారితో చెబుతుంది. కావాలనే వాళ్లిద్దరూ బాలు కాలును గట్టిగా తొక్కుతారు. నొప్పితో విలవిలలాడిన బాలు వారితో గొడవ పడాలని లేస్తాడు.
కానీ మీనాకు ఇచ్చిన మాట గుర్తొచ్చి ఆగిపోతాడు. మీనానే వారిపై ఫైర్ అవుతుంది. తొక్కింది అతడిని…అతడికి లేని బాధ మీకేందుకు అనిమీనాను వాళ్లు నానా మాటలు అంటారు. కామాక్షి వారిని చెడామడా తిట్టి పంపిస్తుంది. తన కాలు తొక్కిన వారి ఫొటో తీస్తాడు బాలు. వారి గురించి ఎంక్వైరీ చేయమని రాజేష్‌కు ఫొటో పంపిస్తాడు.
శోభన ఫైర్…
బాలుకు ఎందుకు కోపం తెప్పించలేకపోయారని తన మనుషులపై శోభన ఫైర్ అవుతుంది. కాలును బలంగానే తొక్కామని అయినా బాలు కిక్కురుమనలేదని వాళ్లు అంటారు. శోభన వారి మాటలు నమ్మకపోవడంతో ఆమె కాలు తొక్కి చూపిస్తాడు ఓ రౌడీ. నొప్పితో కేకలు వేస్తుంది శోభన. ఒరేయ్ బండ సన్నాసి అంటూ అతడిపై తిట్లతో విరుచుకుపడుతుంది. మీరు ఏం చేస్తారో తెలియదు…ఈ రోజు బాలుతో తాను గొడవ పడాల్సిందేనని వారికి ఆర్డర్ వేస్తుంది.
నా పరువు పోతుంది…
రోహిణి దగ్గరకు మీ నాన్న ఎక్కడ అని నిలదీస్తుంది ప్రభావతి. ఫోన్ చేశానని, నాట్ రీచబుల్ అని వస్తుందని రోహిణి అంటుంది. ఇలాంటి సాకులు చెప్పొద్దని ప్రభావతి గొడవ చేస్తుంది. మీ నాన్న తప్ప అందరూ వచ్చారని నానా మాటలు అంటుంది. మీ నాన్న రాకపోతే నా పరువు పోతుంది అని అంటుంది. నీ మెడలో నగలు ఏం లేవని మీ నాన్న తెచ్చిన తర్వాత వేసుకుందామని బోసిగా ఉన్నావా ప్రశ్నల వర్షం కురిపిస్తుంది. రోహిణి బోసిగా కనిపించకూడదని తన మెడలో ఉన్న నగలు తీసి రోహిణికి ఇస్తుంది.
స్వర్గానికి పంపించాల్సింది ఎవరిని…
విద్య సహాయంతో బాలుకు మందు తాగించి ఫంక్షన్‌లో గొడవలు చేసి తన తండ్రికి సంబంధించిన టాపిక్‌ను డైవర్ట్ చేయాలని రోహిణి స్కెచ్ వేస్తుంది. ఇందుకోసం ఓ మనిషికి డబ్బులు ఇస్తుంది.
అతడు వచ్చి రాగానే నేను స్వర్గానికి పంపించాల్సింది ఎవరిని అని రోహిణిని అడుగుతాడు. అతడి మాటలు వినగానే రోహిణి షాకవుతుంది. ఏంటి చంపమని చెప్పావా అని విద్యను భయంతో అడుగుతుంది రోహిణి. లేదని విద్య బదులిస్తుంది. స్వర్గానికి అంటే మత్తులో ఉంచాల్సింది ఎవరిని అని ఆ రౌడీ అంటాడు.
నా ఫ్రెండ్ అనుకున్నా…
బాలు ఫోన్ మాట్లాడుతుండగా…శోభన మనిషి వచ్చి బాలు వీపుపై గట్టిగా ఒక్కటి కొడతాడు. తన ఫ్రెండ్ అనుకున్నానని అంటాడు. కోపం పట్టలేని బాలు తిరిగి అతడిని కొట్టబోతుండగా కామాక్షి వచ్చి ఆపుతుంది. శోభన మనిషికి క్లాస్ ఇస్తుంది మీనా. బాలుకు సారీ చెప్పమని అంటుంది.
సారీ చెప్పేది లేదని అతడు తెగేసి చెప్పి వెళ్లిపోతాడు. బాలు కోపాన్ని కంట్రోల్ చేసుకుంటాడు. విద్య తీసుకొచ్చిన రౌడీ…మందు తాగుదామని బాలును బలవంతపెడతాడు. ఫంక్షన్ హాల్ బయటకు తీసుకొస్తాడు. బాలు మందు తాగబోతుండగా మీనా చూస్తుంది అక్కడితో నేటి గుండె నిండా గుడి గంటలు సీరియల్ ముగిసింది.
సంబంధిత కథనం