




Best Web Hosting Provider In India 2024

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కూతురి కోసం తల్లడిల్లిన శివ నారాయణ- జ్యోత్స్న, తాత దుమ్ము దులిపిన కాశీ- మాటల తూటాలు!
కార్తీక దీపం 2 సీరియల్ జూలై 1 ఎపిసోడ్‌లో ఇంటికెళ్లిన శ్రీధర్ అందరికి కాంచన విషయంలో జ్యోత్స్న చేసిన విషయం గురించి చెబుతాడు. దాంతో కాశీ రెచ్చిపోయి జ్యోత్స్న ఇంటికి వెళ్లి రచ్చ రచ్చ చేస్తాడు. జ్యోత్స్న, శివ నారాయణలను తన మాటల తూటాలతో దుమ్ముదులుపుతాడు. దాంతో అంతా షాక్ అయిపోతారు.
కార్తీక దీపం 2 సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో జ్యోత్స్న కట్టమన్నంత డబ్బు కట్టి కార్తీక్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేపిస్తాను అని శ్రీధర్ బాధతో అంటాడు. నేను అంత దీన స్థితిలో లేను. నువ్ మారినంత ఈజీగా అందరూ మారరు. గాయాలన్ని పచ్చిగానే ఉన్నాయని కార్తీక్ అంటాడు. బావ నాకోసం ఏం మాట్లాడుకుండా ఉండు అని దీప అనేసరికి కార్తీక్ సైలెంట్‌గా ఉంటాడు.
దానం ఇచ్చింది అడుగుతారా
కాంచన నేను నీతో ఉంటాను. నాతో ఉండు అని శ్రీధర్ అంటే ఒకరికి దానం ఇచ్చింది తిరిగి అడుగుతారా అని కాంచన అంటుంది. లేదు. దానం ఇచ్చాం కదా అని శ్రీధర్ అంటాడు. నేను నిన్ను కావేరికి అలాగే ఇచ్చాను. మళ్లీ ఎలా అడుగుతాను. ఎలా కోరుతాను అని కాంచన ఏడుస్తూ చెబుతుంది. నాకు భర్త లేడు. కానీ, ఐదోతనం ఉంది. నాకు నా కొడుకు, కోడలు చాలు. వాళ్లతో ఉంటే పేదరికంలో ఉంటే ఐశ్వర్యంలో ఉన్నట్లే. మీరింకా బయలుదేరొచ్చు అని కాంచన అంటుంది.
నువ్ క్షమించే వరకు వస్తూనే ఉంటాను. ఆరోజు కోసం ఎదురుచూస్తూనే ఉంటాను అని శ్రీధర్ వెళ్లిపోతాడు. తర్వాత ఏడుస్తున్న కాంచనను అంతా ఓదార్చుతారు. తర్వాత కార్తీక్, దీప వెళ్లిపోతారు. మనుషులు మంచోళ్లే కానీ గుణాలే చెడ్డవి. మావయ్యను చూశాకా అర్థమైందని దీప అంటుంది. మావయ్యనా అని కార్తీక్ అంటే శ్రీధర్ మావయ్య. ఆయన ప్రేమలో నిజాయితీ ఉందని దీప గొప్పగా చెబుతుంది.
నాకు మా అమ్మ కంటే ఎక్కువ ఏది కాదు అని కార్తీక్ అంటాడు. ఇంతలో శివ నారాయణ వస్తాడు. ఇద్దరు వచ్చారు. ఒక్కరు వస్తే సరిపోయేది కదా. ఇంట్లో ఒంట్లో బాగోలేని మనిషి ఉన్నట్లున్నారు అని కూతురు కాంచన కోసం దీప ఇంట్లోనే ఉంటే అయిపోయిది కదా అని ఇన్‌డైరెక్ట్‌గా అంటాడు శివ నారాయణ. ఒహో ఈయనకు కూతురు మీద ప్రేమ కలిగినట్లుంది. ఆడుకుంటాను చూడు అని కార్తీక్ అంటాడు.
అన్నయ్య దయ వల్ల
ఎవరి గురించి అడుగుతున్నారు. మీరు పనోళ్ల గురించి కూడా అడుగుతారా అని కార్తీక్ అంటాడు. ఒకరు ఉండండి ఒకరు వెళ్లిపోండి అని శివ నారాయణ అంటాడు. మా అమ్మ అన్నయ్య దయ వల్ల బాగానే ఉంది. నాన్న దయే కావాలి. చూసుకునే మనిషి ఉంది. పైగా అమ్మకు బాగానే ఉందని కార్తీక్ అంటాడు. నిజమేనా అని శివనారాయణ ప్రేమగా అడుగుతాడు.
అబద్ధాలు ఎందుకు చెబుతాను సర్ అని కార్తీక్ ఫోన్ తీస్తే కూతురుని చూసేందుకు తెగ ఆరాటపడతాడు శివ నారాయణ. ఫొటో చూపించినట్లే సరిగా చూపించడు కార్తీక్. కావాల్సిన వాళ్లు ఇంటికి వచ్చి చూస్తారు. అయినా మీరు మాకు ఏం అవుతారు. పనోళ్ల ఇంటికి ఓనర్స్ ఎందుకు వస్తారు పద దీప అని కార్తీక్ దీపను పట్టుకుని వెళ్లిపోతాడు. తాతయ్యతో అలా మాట్లాడావు అని దీప అంటుంది.
కొందరి మనుసులు కదిలించాలంటే ఇలాగే మాట్లాడాలి అని కార్తీక్ చెబుతాడు. మరోవైపు మావయ్యతో మాట్లాడి డబ్బులు అరెంజ్ చేస్తానని కాశీతో కావేరి అంటుంది. ఇంతలో శ్రీధర్ వస్తాడు. అదేంటీ అలా ఉన్నారు. ఎక్కడికి వెళ్లారని కావేరి అడుగుతుంది. కాంచన వీల్ చైర్ నుంచి పడిపోయింది. ప్రాణాలతో బతికే ఉంది. లేకుంటే ఆ జ్యోత్స్న చేసిన పనికి చచ్చిపోయేది అని శ్రీధర్ అంటాడు.
నేనేం రెచ్చగొట్టలేదు
ఇదంతా చేసింది దీప, జ్యోత్స్ననే. వీళ్లిద్దరు కొట్టుకుని చచ్చి నా పెళ్లాన్ని చంపేలా చేశారు అని శ్రీధర్ అంటాడు. అర్థమయ్యేలా చెప్పండి అని కావేరి అడిగితే జరిగింది అంతా శ్రీధర్ చెబుతాడు. దీప మీద కోపం ఉంటే ఇలా చేస్తుంది. అన్నింటికి అగ్రిమెంట్ అని శ్రీధర్ అంటాడు. అక్కా బావ ఏం పాపం చేశారని అంతలా ఇబ్బందిపెట్టాలి అని కోపంగా కాశీ వెళ్తాడు.
ఎందుకు కాశీని రెచ్చగొట్టావ్ అని శ్రీధర్‌ను స్వప్న అంటుంది. నేనేం రెచ్చగొట్టలేదు. జరిగింది చెప్పాను. నా అల్లుడు మంచి పనే చేశాడు. వెళ్లి ఆ శివ నారాయణ కాలర్ పట్టుకుని నిలదీస్తే కానీ వాళ్లకు బుద్ధిరాదు అని శ్రీధర్ అంటాడు. వీళ్లేమే బానిసలుగా చేసి నచ్చినట్లు చేస్తుంటే మీరు సేవలు చేస్తున్నారా అని కాశీ అంటాడు. ఇంకొక్క మాట మాట్లాడితే చెంప పగులుతుందని శివ నారాయణ అంటాడు.
అగ్రిమెంట్ రాయించుకున్న వాళ్లకు బుద్ధి ఉండాలి అని జ్యోత్స్నను అంటాడు కాశీ. నువ్వెవరురా అని జ్యో అంటే దీపక్క తమ్ముడిని అని కాశీ అంటాడు. అయితే ముందు బయటకు వెళ్లు అని సుమిత్ర అంటుంది. నీకు ఎలాంటి హక్కు లేదని శివ నారాయణ అంటాడు. మా నానమ్మా మీ భార్య అని కాశీ అంటే.. కానీ, ఒకప్పుడు మీ అమ్మ ఈ ఇంట్లో పని మనిషి అని శివ నారాయణ అంటాడు.
నువ్ పని మనిషి కొడుకువిరా
దాంతో కాశీ ఫీల్ అవుతాడు. అంటే, నువ్ ఒక పని మనిషి కొడుకువిరా. దీప అక్క అంటే ఆ రకంగా పని మనిషి తమ్ముడివిరా అని శివ నారాయణ అంటాడు. నా పుట్టుక గురించి ఎలా ఉన్నా బాగానే బతుకున్నా. కానీ, మీ బతుకు అని కాశీ అంటే శివ నారాయణ కోపంగా పైకి వెళ్తాడు. దశరథ్ ఆపుతాడు. వాడికి బలుపు ఎక్కువైందని జ్యోత్స్న అంటుంది.
దాంతో పారిజాతంను పిలిచి వాడిని బయటకు గెంటేయ్ అని శివ నారాయణ అంటాడు. ఇదే మన ప్లేసులో వాళ్లు ఉంటే ఊరుకునేవారా. గొడవ గొడవ చేస్తారు అని కాశీ అంటాడు. బయటకు వెళ్లి మాట్లాడుదాం అని కాశీ అంటాడు. రేపు ఇంకో ప్రమాదం ఏదైనా జరిగినా మా అక్కను ఇలాగే ఆపుతారా కాశీ అంటాడు. ఆ దాసు గాడి కొడుకువి కదా. ఇలాగే ఉంటాయి మాటలు అని శివ నారాయణ అంటాడు.
దీపే పంపించింది
ఊరికనే మాటలు వదిలేయాలంటే నేను కూడా మాటలు వదిలేయాలి తాతగారు అని కాశీ అంటాడు. అంతా అవాక్కవుతారు. ఇదంతా దీప ప్లాన్. తమ్ముడిని రెచ్చగొట్టి పంపించింది అని జ్యోత్స్న అంటుంది. అది నీకు అలవాటు. నన్ను ఎవరు పంపించలేదు. నువ్ ఇలా తయారవడానికి కారణం ఉన్నాడుగా మనిషి అని శివ నారాయణను అంటాడు కాశీ.
కాశీ మాటలు మర్యాదగా మాట్లాడు అని కార్తీక్ వారిస్తాడు. దీప ఏడుస్తూ ఉంటుంది. మాటల తూటాలతో అటు తాత శివ నారాయణ, ఇటు అక్క జ్యోత్స్న దుమ్ముదులుపుతాడు కాశీ. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్