ఆహా ఓటీటీలోకి తెలుగు మైథాలజీ వెబ్ సిరీస్.. ఎవరు బకెట్ తన్నేస్తారో చెప్పబోతున్న రాజ్ తరుణ్.. ఆ కమెడియనే డైరెక్టర్..

Best Web Hosting Provider In India 2024

ఆహా ఓటీటీలోకి తెలుగు మైథాలజీ వెబ్ సిరీస్.. ఎవరు బకెట్ తన్నేస్తారో చెప్పబోతున్న రాజ్ తరుణ్.. ఆ కమెడియనే డైరెక్టర్..

Hari Prasad S HT Telugu

ఆహా వీడియో ఓటీటీలోకి మరో మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ వస్తోంది. రాజ్ తరుణ్ లీడ్ రోల్లో నటిస్తున్న ఈ సిరీస్ ను గతేడాది అనౌన్స్ చేసిన ఆ ఓటీటీ.. తాజాగా మంగళవారం (జులై 1) ఓ కొత్త పోస్టర్ రిలీజ్ చేస్తూ టీజర్ త్వరలోనే రాబోతోందని వెల్లడించింది.

ఆహా ఓటీటీలోకి సరికొత్త తెలుగు కామెడీ వెబ్ సిరీస్.. ఎవరు బకెట్ తన్నేస్తారో చెప్పబోతున్న రాజ్ తరుణ్.. ఆ కమెడియనే డైరెక్టర్

అందరి ఆయుష్షులు చెప్పడానికి వచ్చేస్తున్నాడు టాలీవుడ్ యువ హీరో రాజ్ తరుణ్. అతడు నటిస్తున్న మైథలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ చిరంజీవ ఆహా వీడియో ఓటీటీలోకి రాబోతోంది. గతేడాది నవంబర్లో ఈ సిరీస్ ను ఆ ఓటీటీ అనౌన్స్ చేసింది. ఇప్పుడు మరోసారి దీనిపై కీలకమైన అప్డేట్ ఇచ్చింది.

చిరంజీవ వెబ్ సిరీస్

రాజ్ తరుణ్ లీడ్ రోల్లో నటిస్తున్న వెబ్ సిరీస్ చిరంజీవ. ఈ సిరీస్ త్వరలోనే రాబోతోందంటూ ఓ పోస్టర్ ను మంగళవారం (జులై 1) ఆహా వీడియో ఓటీటీ తన ఎక్స్ అకౌంట్లో పోస్ట్ చేసింది. “అందరి ఆయుష్షు అతి త్వరలోనే చెప్పేస్తాం.. చిరంజీవ టీజర్ త్వరలోనే రానుంది” అనే క్యాప్షన్ తో ఈ పోస్టర్ ను తీసుకొచ్చారు.

ఆ పోస్టర్ పై కూడా నెక్ట్స్ బకెట్ తన్నేసేది ఎవరు అనే క్యాప్షన్ ఉంచడం విశేషం. ఈ పోస్టర్ లో రాజ్ తరుణ్ తోపాటు ఓ టైమర్ కూడా కనిపిస్తోంది. దానిపై ఇంకా భూమిపై ఉండటానికి ఎంత సమయం మిగిలి ఉందో రాసి ఉంది. త్వరలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానున్నట్లు కూడా ఆ పోస్టర్ ద్వారా ఆహా వెల్లడించింది.

చిరంజీవ వెబ్ సిరీస్ గురించి..

చిరంజీవ వెబ్ సిరీస్ ను ప్రముఖ కమెడియన్ అదిరే అభి అలియాస్ అభినయ కృష్ణ డైరెక్ట్ చేస్తుండటం విశేషం. తెలుగులో రాబోతున్న తొలి సూపర్ హీరో వెబ్ సిరీస్ ఇదే. గతేడాది నవంబర్ లో ఈ వెబ్ సిరీస్ ను ఆహా వీడియో ఓటీటీ అనౌన్స్ చేసింది. ఇందులో రాజ్ తరుణ్ లీడ్ రోల్లో నటిస్తున్నాడు.

నిజానికి ఈ ఏడాది జనవరిలోనే ఈ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుందని గతంలో చెప్పినా చాలా ఆలస్యమైంది. ఇప్పుడు టీజర్ అతి త్వరలోనే రానుందని మేకర్స్ వెల్లడించారు. ఈ సిరీస్ లో శివ అనే పాత్రలో రాజ్ తరుణ్ నటిస్తున్నాడు. రాహుల్ యాదవ్, సుహాసిని రాహుల్ ఈ సిరీస్ ను నిర్మిస్తున్నారు.

భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ వెబ్ సిరీస్ లో పెద్ద ఎత్తున వీఎఫ్ఎక్స్ వాడటంతోపాటు విజువల్ వండర్ గా తీర్చిదిద్దుతున్నారు. చిరంజీవ వెబ్ సిరీస్ అన్ని రకాల వయసు గల ప్రేక్షకులను ఆకట్టుకునే ఆసక్తికరమైన కంటెంట్‌తో అలరిస్తుందని ఆహా టీమ్ చెబుతోంది. అద్భుతమైన విజువల్స్‌తో మంచి అనుభూతిని అందించడం లక్ష్యంగా చిరంజీవ తెరకెక్కిస్తున్నట్లు పేర్కొన్నారు మేకర్స్.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024