





Best Web Hosting Provider In India 2024

బోల్డ్ వెబ్ సిరీస్ చివరి సీజన్ వచ్చేస్తోంది.. సెక్స్ అండ్ ద సిటీకి దేశీ వెర్షన్‌లాంటి సిరీస్.. నలుగురు అమ్మాయిల చుట్టూ..
ఇండియన్ ఓటీటీల్లో వచ్చిన బోల్డ్ వెబ్ సిరీస్ లలో ఒకటైన ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ చివరి సీజన్ వచ్చేస్తోంది. ఈ విషయాన్ని ప్రైమ్ వీడియో మంగళవారం (జులై 1) వెల్లడించింది. నలుగురు అమ్మాయిల చుట్టూ తిరిగే స్టోరీ ఇది.
బోల్డ్ టైటిల్, అంతకంటే బోల్డ్ కంటెంట్ తో ఇండియన్ ఓటీటీ స్పేస్ లో సంచలనం సృష్టించిన వెబ్ సిరీస్ ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్. 2019లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో తొలి సీజన్ రాగా.. ఇప్పుడు చివరి సీజన్ రాబోతోంది. ఈ విషయాన్ని ప్రైమ్ వీడియో ఓటీటీ వెల్లడించింది. కొత్త పోస్టర్ కూడా రిలీజ్ చేసింది.
ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ ఫైనల్ సీజన్
అమెజాన్ ప్రైమ్ వీడియో బోల్డ్ వెబ్ సిరీస్ ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ (Four More Shots Please). ముంబైలోని ఓ బార్ లో టెకీలా షాట్స్ తో పరిచయమైన నలుగురు ఫ్రెండ్స్ చుట్టూ తిరిగే స్టోరీతో వచ్చిన ఈ సిరీస్ ఇప్పటికే మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. త్వరలోనే నాలుగోది, చివరి సీజన్ వస్తున్నట్లు ప్రైమ్ వీడియో మంగళవారం (జులై 1) తన ఎక్స్ అకౌంట్ ద్వారా వెల్లడించింది.
“సీజన్ ఫినాలే కోసం ఏం చేయాలో చెప్పడానికి వస్తున్నాం. ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ చివరి సీజన్ త్వరలోనే రాబోతోంది” అనే క్యాప్షన్ తో ఈ చివరి సీజన్ గురించి ప్రైమ్ వీడియో తెలిపింది. మూడో సీజన్ వచ్చిన సుమారు రెండున్నర ఏళ్ల తర్వాత నాలుగో సీజన్ రాబోతుండటం విశేషం. ఐఎండీబీలో 6.6 రేటింగ్ ఉన్న ఈ సిరీస్ మూడు సీజన్లు బోల్డ్ కంటెంట్ తో ప్రేక్షకులను అలరించింది.
ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ వెబ్ సిరీస్ గురించి..
ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ వెబ్ సిరీస్ ఇంగ్లిష్ లో వచ్చిన సెక్స్ అండ్ ద సిటీకి దేశీ వెర్షన్ గా పేరుగాంచింది. ముఖ్యంగా ఇందులోని బోల్డ్ కంటెంట్ ఇండియన్ ఓటీటీ ఆడియెన్స్ ను ఆశ్చర్యపరిచింది.
ఈ సిరీస్ ముంబైలో ఉండే దామిని రిజ్వీ రాయ్ (సయానీ గుప్తా), ఉమంగ్ సింగ్ (బానీ జే), అంజనా మేనన్ (కీర్తి కుల్హరి), సిద్ధీ పటేల్ (మాన్వీ గగ్రూ) చుట్టూ తిరిగే స్టోరీ. జీవితంలో స్వతంత్రంగా ఉంటూ తమకు నచ్చినట్లుగా జీవించే ఈ నలుగురు అమ్మాయిల జీవితాల్లోని ఎత్తుపల్లాలను ఈ ఫోర్ మోర్ షాట్స్ ప్లీజ్ వెబ్ సిరీస్ ఆవిష్కరించింది.
అయితే ఇందులోని బోల్డ్ సీన్స్ వల్లే ఈ సిరీస్ పాపులర్ అయింది. ఇప్పటి వరకూ మూడు సీజన్లు పూర్తి చేసుకుంది. ఒక్కో సీజన్ ను ఒక్కొక్కరు డైరెక్ట్ చేశారు. మూడు సీజన్లు కలిపి మొత్తం 30 ఎపిసోడ్లు ప్రస్తుతం ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పుడు చివరిదైన నాలుగో సీజన్ రానుంది. మరి ఈ చివరి సీజన్ ఎలా ఉంటుందో అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.
మూడో సీజన్లో ఏం జరిగిందంటే?
ఫెమినిజం, ఇండివిడ్యువాలిటీ, మోడర్న్ రిలేషన్‌షిప్స్, పేజ్ త్రీ లుకింగ్స్ తో నాలుగు మెయిన్ క్యారెక్టర్స్ డిఫరెంట్ కాన్ ఫ్లిక్ల్ న్ డీల్ చేస్తూ మూడో సీజన్‌ను నడిపించారు. ఫోర్ మోర్ షాట్స్ సీజన్ 2కు కొనసాగింపుగా సీజన్ 3 సాగుతుంది.
ఉమంగ్ పెళ్లి క్యాన్సిల్ చేసుకోవడం, సిద్ధి వాళ్ల నాన్న చనిపోవడం, అంజనా రిలేషన్ షిప్ బయటపడడం, దామిని మిస్ క్యారేజ్..ఇ లా ఒక్కో పాత్రకి ఒక్కో కాన్ ఫ్లిక్ట్ తో సీజన్ 2ను ఎండ్ చేయడం వల్ల థర్డ్ సీజన్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూసేలా చేశారు. మూడో సీజన్ పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో చివరి సీజన్ లో మేకర్స్ ఏం చేయబోతున్నారో చూడాలి.
సంబంధిత కథనం