పవన్ కల్యాణ్ పెద్ద మనసు.. కష్టాల్లో ఉన్న సీనియర్ నటి పాకీజాకు సాయం.. ఆయన కాళ్లు మొక్కుతానంటూ..

Best Web Hosting Provider In India 2024

పవన్ కల్యాణ్ పెద్ద మనసు.. కష్టాల్లో ఉన్న సీనియర్ నటి పాకీజాకు సాయం.. ఆయన కాళ్లు మొక్కుతానంటూ..

Hari Prasad S HT Telugu

నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పెద్ద మనసు చాటుకున్నాడు. కష్టాల్లో ఉన్న సీనియర్ నటికి సాయం చేశాడు. దీంతో భావోద్వేగానికి గురైన ఆమె.. ఆయన కాళ్లు మొక్కుతానంటూ కామెంట్ చేసింది.

పవన్ కల్యాణ్ పెద్ద మనసు.. కష్టాల్లో ఉన్న సీనియర్ నటి పాకీజాకు సాయం.. ఆయన కాళ్లు మొక్కుతానంటూ..

తెలుగు సినిమాల్లో ఒకప్పుడు పాకీజాగా పేరుగాంచిన తమిళ నటి వాసుకి. జయలలిత పిలుపు మేరకు ఆమె ఏఐఏడీఎంకేలో చేరి అధికార ప్రతినిధి స్థాయికి చేరింది. కానీ కొన్నాళ్లుగా సంపాదించిన డబ్బంతా కోల్పోయి బిచ్చమెత్తే స్థాయికి పతనమైంది. ఇప్పుడామె పరిస్థితి తెలుసుకున్న నటుడు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఆమెకు సాయం చేయడం గమనార్హం.

పాకీజాకు పవన్ కల్యాణ్ సాయం

తెలుగు సినిమాల్లో పాకీజాగా పేరుగాంచిన నటి వాసుకి దుస్థితి తెలుసుకున్న పవన్ కల్యాణ్ ఆమెకు రూ. 2 లక్షల సాయం అందించాడు. మంగళవారం (జులై 1) మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో ఈ మొత్తాన్ని శాసన మండలిలో ప్రభుత్వ విప్ పి. హరిప్రసాద్, పి.గన్నవరం ఎమ్మెల్యే గిడ్డి సత్యనారాయణ పాకీజాకు అందజేశారు.

పవన్ కల్యాణ్ చేసిన సాయానికి పాకీజా కృతజ్ఞతలు తెలిపింది. చిన్నవాడైనా ఎదురుగా ఉంటే కాళ్లు మొక్కుతానంటూ ఆమె భావోద్వేగానికి లోనయింది. తన ఆర్థిక పరిస్థితి గురించి నిన్ననే పవన్ కల్యాణ్ కార్యాలయానికి తెలియజేశాననీ, తక్షణం స్పందించి తగిన విధంగా ఆర్థిక సాయం అందించారని తెలిపింది. పవన్ కల్యాణ్ కుటుంబానికి జీవితాంతం రుణపడి ఉంటానని పాకీజా చెప్పింది.

ఎవరీ పాకీజా?

పాకీజా అసలు పేరు వాసుకి. ఆమె తమిళనాడుకు చెందిన నటి. అయితే 1990ల్లో తెలుగు సినిమాలో పాకీజాగా ఆమె పేరుగాంచింది. మోహన్ బాబు నటించిన అసెంబ్లీ రౌడీ సినిమాలో పాకీజాగా వాసుకి పరిచయమైంది. ఆ తర్వాత రౌడీ గారి పెళ్లాం, మామగారు, రౌడీ ఇన్‌స్పెక్టర్, చిట్టెమ్మ మొగుడు, బ్రహ్మ, పెదరాయుడు, రౌడీ ఎమ్మెల్యే, అమ్మా రాజీనామా, సీతారత్నంగారి అబ్బాయి, అన్నమయ్యలాంటి సినిమాల్లో నటించింది.

ఆమె సినిమాల తర్వాత ఏఐఏడీఎంకే పార్టీలో చేరింది. అధికార ప్రతినిధి స్థాయికి చేరింది. ఆ తర్వాత రాజ్‌కుమార్ అనే వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. అప్పటి నుంచే ఆమె కష్టాలు మొదలయ్యాయి. ఆ తర్వాత మెల్లగా ఆర్థికంగా కూడా చితికిపోయింది. చివరికి మందుకు బానిసై భిక్షమెత్తుకునే దుస్థితికి చేరుకుంది. అలాంటి నటికి ఇప్పుడు పవన్ కల్యాణ్ రూ.2 లక్షల సాయం అందించడం గమనార్హం.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024