హీరో కావాల్సిన వాడు హీరోయిన్ అయితే.. ఓటీటీలోకి కన్నడ కామెడీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఐఎండీబీలో 9.9 రేటింగ్

Best Web Hosting Provider In India 2024

హీరో కావాల్సిన వాడు హీరోయిన్ అయితే.. ఓటీటీలోకి కన్నడ కామెడీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఐఎండీబీలో 9.9 రేటింగ్

Hari Prasad S HT Telugu

కన్నడ కామెడీ మూవీ ఒకటి ఓటీటీలోకి వస్తోంది. థియేటర్లలో రిలీజైన ఐదు నెలల తర్వాత ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ కానుండటం విశేషం. తెలుగులోనూ స్ట్రీమింగ్ కాబోతున్న ఈ సినిమాకు ఐఎండీబీలో 9.9 రేటింగ్ ఉండటం విశేషం.

హీరో కావాల్సిన వాడు హీరోయిన్ అయితే.. ఓటీటీలోకి కన్నడ కామెడీ మూవీ.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఐఎండీబీలో 9.9 రేటింగ్

ఈ ఏడాది ఫిబ్రవరిలో థియేటర్లలో రిలీజైన కన్నడ కామెడీ మూవీ మిస్టర్ రాణి (Mr Rani) ఇప్పుడు తెలుగులోనూ ఓటీటీలోకి వస్తోంది. ఐదు నెలల తర్వాత ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ కాబోతోంది. హీరో కావాలనుకున్న వాడు హీరోయిన్ అయితే ఎలా ఉంటుందన్న వెరైటీ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమాకు మిక్స్‌డ్ రివ్యూలు వచ్చాయి.

మిస్టర్ రాణి ఓటీటీ రిలీజ్ డేట్

మిస్టర్ రాణి ఓ కన్నడ కామెడీ మూవీ. ఈ ఏడాది ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజైంది. బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపకపోయినా.. ప్రేక్షకులను మాత్రం బాగానే ఆకట్టుకుంది. ఇప్పుడీ సినిమాను జులై 11 నుంచి లయన్స్‌గేట్ ప్లే (Lionsgate Play) ఓటీటీ స్ట్రీమింగ్ చేయబోతోంది.

ఒరిజినల్ కన్నడ ఆడియోతోపాటు తెలుగు, తమిళం, మలయాళం భాషల్లోనూ స్ట్రీమింగ్ చేయనుండటం విశేషం. ఈ సినిమాకు ఐఎండీబీలో 9.9 రేటింగ్ ఉంది. చాలా మంది ప్రేక్షకులు పాజిటివ్ రివ్యూలు ఇచ్చారు.

మిస్టర్ రాణి మూవీ గురించి..

మిస్టర్ రాణి మూవీని మధు చంద్ర డైరెక్ట్ చేశాడు. అంతేకాదు ఈ సినిమాలో డైరెక్టర్ కాకా అనే పాత్ర కూడా పోషించాడు. ఇక దీపక్ సుబ్రమణ్య, పార్వతీ నాయర్, లక్ష్మీ కారంత్, శ్రీవత్స శ్యామ్ లాంటి వాళ్లు నటించారు. ఈ సినిమా ఫిబ్రవరి 7న థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమా రాజా అనే యువకుడి చుట్టూ తిరుగుతుంది. అతడు సినిమాల్లో పెద్ద హీరో కావాలని కలలు కంటాడు.

కానీ అతని పేరెంట్స్ మాత్రం ఇంజినీరింగ్ చేయాలని పట్టుబడతారు. రాజా ఎలాగోలా సినిమాల్లోకి వెళ్లినా.. అతనికి హీరో కాకుండా హీరోయిన్ ఛాన్స్ వస్తుంది. అదే క్రమంలో అతడు ఇండస్ట్రీలోనే నంబర్ వన్ హీరోయిన్ స్థాయికి ఎదుగుతాడు. రాజా ఇలా మిస్టర్ రాణిగా మారి, ఆ క్రేజ్ నిలుపుకునే క్రమంలో వచ్చే సీన్లు ప్రేక్షకులను తెగ నవ్విస్తాయి.

ఐఎండీబీలో క్రేజీ రేటింగ్

ఈ మిస్టర్ రాణి సినిమాకు ఐఎండీబీలో క్రేజీ రేటింగ్ ఉంది. ఏకంగా 9.9 రేటింగ్ రావడం విశేషం. చాలా మంది ప్రేక్షకులు ఈ సినిమాకు 10, 9 రేటింగ్స్ ఇచ్చారు. ఓ మస్ట్ వాచ్ కామెడీ మూవీ అని కామెంట్స్ చేశారు. ఓ భిన్నమైన, ఫ్రెష్ కాన్సెప్ట్ తో వచ్చి తెగ నవ్వించారని ఓ వ్యక్తి రివ్యూ ఇచ్చారు.

అద్భుతమైన టెక్నాలజీ, మేకప్, టాలెంట్ కలగలిపి రాణి పాత్ర నిజమనేలా చేసిన తీరు చాలా బాగుందని మరో వ్యక్తి అన్నారు. ఈ మిస్టర్ రాణి మూవీ బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపలేదు. ఇప్పుడు జులై 11 నుంచి లయన్స్‌గేట్ ప్లేలో స్ట్రీమింగ్ కానుంది. తెలుగు సహా ఇతర భాషల్లోనూ రానుండటంతో ఓటీటీలో మంచి రెస్పాన్స్ వస్తుందని భావిస్తున్నారు.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024