ఎన్టీఆర్, హృతిక్ ‘వార్ 2’ తెలుగు థియేట్రికల్ హక్కులకు భారీ ధర.. ఎన్ని కోట్లంటే!

Best Web Hosting Provider In India 2024

ఎన్టీఆర్, హృతిక్ ‘వార్ 2’ తెలుగు థియేట్రికల్ హక్కులకు భారీ ధర.. ఎన్ని కోట్లంటే!

వార్ 2 సినిమా తెలుగు థియేట్రికల్ హక్కుల డీల్ జరిగిపోయింది. తెలుగు వెర్షన్‍కు భారీ ధర దక్కింది. సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ ఈ రైట్స్ తీసుకుంది.

ఎన్టీఆర్, హృతిక్ ‘వార్ 2’ తెలుగు థియేట్రికల్ హక్కులకు భారీ ధర

టాలీవుడ్ మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్, బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ ప్రధాన పాత్రలు పోషించిన ‘వార్ 2’ సినిమాకు ఓ రేంజ్‍లో క్రేజ్ ఉంది. ఈ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రంపై అంచనాలు భారీ స్థాయిలో నెలకొన్నాయి. ఈ మూవీతోనే బాలీవుడ్‍‌లోకి ఎంట్రీ ఇస్తున్నారు ఎన్టీఆర్. ఈ సినిమాకు తెలుగులోనూ హైప్ బాగా ఉంది. ఆగస్టు 14న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ తరుణంలో వార్ 2 మూవీ తెలుగు వెర్షన్ థియేట్రికల్ హక్కులు భారీ ధరకు అమ్ముడయ్యాయి. ఆ వివరాలు బయటికి వచ్చాయి.

‘సితార’ చేతికి.. భారీ ధర

వార్ 2 సినిమా తెలుగు వెర్షన్ థియేట్రికల్ హక్కులను సితార ఎంటర్‌టైన్‍మెంట్స్ పతాకంపై నిర్మాత నాగవంశీ దక్కించుకున్నారు. ఏకంగా రూ.80కోట్ల భారీ ధరకు ఈ మూవీ తెలుగు రైట్స్‌ను సితార సంస్థ దక్కించుకుందని సమాచారం బయటికి వచ్చింది. దీంతో వార్ 2 తెలుగు వెర్షన్ డీల్‍పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది.

వార్ 2 చిత్రం తెలుగు థియేట్రికల్ హక్కులకు ముందుగా రూ.100కోట్లను యశ్ రాజ్ ఫిల్మ్స్ డిమాండ్ చేసిందని టాక్ బయటికి వచ్చింది. అయితే, చర్చల తర్వాత రూ.80కోట్లకు డీల్ జరిగిందని సమాచారం వెల్లడైంది. మొత్తంగా ఈ చిత్రానికి తెలుగులో అంచనాలకు తగ్గట్టే క్రేజీ ధర దక్కింది.

స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా..

వార్ 2 చిత్రానికి అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. స్పై యాక్షన్ థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించారు. ఆరేళ్ల క్రితం వచ్చి సూపర్ హిట్ అయిన వార్‌కు సీక్వెల్‍గా ఈ మూవీ రూపొందింది. వార్ 2లోనూ మేజర్ కబీర్ పాత్రను హృతిక్ పోషించారు. ఎన్టీఆర్ కూడా స్పై ఏజెంట్‍గా నటించారు. ఈ సినిమాతో బాలీవుడ్‍లోకి తారక్ అడుగుపెడుతున్నారు. ఈ చిత్రంలో కియారా అడ్వానీ హీరోయిన్‍గా చేశారు. అనిల్ కపూర్, షాబిర్ అహ్లువాలియా, అశుతోష్ రాణా కీలకపాత్రలు పోషించారు.

వార్ 2 సినిమాను యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై ఆదిత్య చోప్రా ప్రొడ్యూజ్ చేశారు. సుమారు రూ.200కోట్లకు పైగా భారీ బడ్జెట్‍తో ఈ చిత్రం రూపొందుతోందని అంచనా. ప్రీతమ్ సంగీతం అందిస్తున్నారు. ఆగస్టు 14న ఈ చిత్రం హిందీ, తెలుగు, తమిళంలో విడుదల కానుంది. లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజినీకాంత్ హీరోగా నటించిన ‘కూలీ’ చిత్రం కూడా ఆగస్టు 14నే విడుదల కానుంది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ రెండు భారీ చిత్రాలు పోటీ పడనున్నాయి.

చాటకొండ కృష్ణ ప్రకాశ్.. హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. ఇక్కడ ప్రస్తుతం ఎంటర్‌టైన్‍మెంట్, స్పోర్ట్స్, అస్ట్రాలజీ వార్తలు రాస్తున్నారు. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. 2022 నవంబర్‌లో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024