





Best Web Hosting Provider In India 2024

ఓటీటీల్లో ఈవారం 4 ముఖ్యమైన రిలీజ్‍లు.. కీర్తి సురేశ్ సినిమా డైరెక్ట్ స్ట్రీమింగ్.. తెలుగు వెబ్ సిరీస్ కూడా..
ఓటీటీల్లో ఈవారం నాలుగు రిలీజ్‍లు ఇంట్రెస్టింగ్‍గా ఉన్నాయి. కీర్తి సురేశ్ లీడ్ రోల్ చేసిన ఓ సినిమా నేరుగా స్ట్రీమింగ్‍కు రానుంది. ఓ తెలుగు సిరీస్ అడుగుపెట్టనుంది. ఓ తమిళ మూవీ, ప్రియమణి నటించిన వెబ్ సిరీస్ కూడా అందుబాటులోకి వచ్చేస్తున్నాయి. ఆ వివరాలు ఇక్కడ చూడండి.
ఓటీటీల్లోకి వచ్చేందుకు ఈ వారం (జూలై తొలివారం) కూడా కొన్ని సినిమాలు, వెబ్ సిరీస్‍లు క్యూ కట్టాయి. స్ట్రీమింగ్‍కు సిద్ధమయ్యాయి. వీటిలో నాలుగు రిలీజ్‍లపై ఎక్కువ ఇంట్రెస్ట్ నెలకొంది. స్టార్ హీరోయిన్ కీర్తి సురేశ్, సుహాస్ ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ఈ వారమే డైరెక్ట్ స్ట్రీమింగ్‍కు అందుబాటులోకి రానుంది. ఓ తెలుగు వెబ్ సిరీస్, ఓ తమిళ చిత్రం కూడా వచ్చేస్తున్నాయి. ప్రియమణి నటించిన సిరీస్ కూడా అడుగుపెట్టనుంది. ఈ వారం ఓటీటీల్లోకి ముఖ్యమైన నాలుగు రిలీజ్‍లు ఇవే.
ఉప్పు కప్పురంబు
తెలుగు రూరల్ కామెడీ డ్రామా మూవీ ‘ఉప్పు కప్పురంబు’ అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలో జూలై 4వ తేదీన స్ట్రీమింగ్‍కు రానుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ చిత్రం అడుగుపెట్టనుంది. హీరోయిన్ కీర్తి సురేశ్, యంగ్ హీరో సుహాస్ లీడ్ రోల్స్ చేసిన ఈ సినిమాపై మంచి క్రేజ్ ఉంది. ఈ చిత్రం థియేటర్లలో కాకుండా నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి వచ్చేస్తోంది.
ఉప్పు కప్పురంబు సినిమాకు అని వి.శశి దర్శకత్వం వహించారు. ఓ గ్రామంలో శ్మశానం సమస్య చుట్టూ ఈ మూవీ సాగుతుంది. 1990ల బ్యాక్‍డ్రాప్‍లో ఈ సినిమా ఉంటుంది. సెటైరికల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. శత్రు, తాళ్లురి రామేశ్వరి, బాబు మోహన్ ఈ చిత్రంలో కీలకపాత్రలు చేశారు. ఈ ఉప్పు కప్పురంబు సినిమాను ఈ శుక్రవారం జూలై 4 నుంచి ప్రైమ్ వీడియోలో చూసేయవచ్చు.
ఏఐఆర్
తెలుగు వెబ్ సిరీస్ ‘ఏఐఆర్’ (ఆల్ ఇండియా ర్యాంకర్స్) జూలై 3వ తేదీన ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్‍ఫామ్‍లోకి ఎంట్రీ ఇవ్వనుంది. కోర్ట్ సినిమా ఫేమ్ హర్ష్ రోహణ్, భాను ప్రకాశ్, జయతీర్థ, వైవా ఈ సిరీస్‍లో ప్రధాన పాత్రల్లో నటించారు. విద్యార్థులకు ఐఐటీ కోచింగ్‍ల విధానం ఎలా సాగుతుందో, ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటారో అనే విషయాలతో ఈ సిరీస్ రూపొందింది. ఏఐఆర్ సిరీస్‍కు జోసెఫ్ క్లింటన్ దర్శకత్వం వహించారు.
గుడ్ వైఫ్
స్టార్ నటి ప్రియమణి, సంపత్ రాజ్ నటించిన ‘గుడ్ వైఫ్’ వెబ్ సిరీస్ జూలై 4వ తేదీన జియో హాట్‍స్టార్ ఓటీటీలోకి వచ్చేయనుంది. తమిళంలో రూపొందిన ఈ లీగల్ డ్రామ్ సిరీస్ తెలుగు, మలయాళం, కన్నడ, హిందీ, మరాఠీ, బెంగాలీలో కూడా అందుబాటులోకి రానుంది. ఈ సిరీస్‍కు రేవతి దర్శకత్వం వహించారు. అమెరికన్ సిరీస్ గుడ్ వైఫ్ ఆధారంగా అదే పేరుతో ఈ వెబ్ సిరీస్‍ను తెరకెక్కించారు.
మద్రాస్ మ్యాట్నీ
సీనియర్ నటుడు సత్యరాజ్, కాళి వెంకట్ ప్రధాన పాత్రలు పోషించిన మద్రాస్ మ్యాట్నీ సినిమా జూలై 4వ తేదీన అమెజాన్ ప్రైమ్ వీడియో, సన్ నెక్స్ట్, టెంట్‍కొట్టా ఓటీటీల్లో స్ట్రీమింగ్‍కు రానుంది. ఏకంగా మూడు ప్లాట్‍ఫామ్‍ల్లో అందుబాటులోకి వస్తోంది. ఈ ఫ్యామిలీ డ్రామా చిత్రం జూన్ 6వ తేదీన థియేటర్లలో విడుదలైంది. కార్తికేయన్ మణి దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి థియేట్రికల్ రిలీజ్‍లో మిక్స్డ్ టాక్ దక్కింది.
సంబంధిత కథనం