తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ.. నెల రోజుల్లోపే ఓటీటీలోకి.. వెరైటీ టైటిల్, వెరైటీ స్టోరీ.. ఐఎండీబీలో 7.4 రేటింగ్

Best Web Hosting Provider In India 2024

తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ.. నెల రోజుల్లోపే ఓటీటీలోకి.. వెరైటీ టైటిల్, వెరైటీ స్టోరీ.. ఐఎండీబీలో 7.4 రేటింగ్

Hari Prasad S HT Telugu

తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ నెల రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తోంది. వెరైటీ టైటిల్, అంతకంటే వెరైటీ కాన్సెప్ట్ తో వచ్చిన సినిమాకు ఐఎండీబీలో 7.4 రేటింగ్ ఉంది. మరి ఈ సినిమా ఏంటి? ఎప్పుడు, ఎక్కడ చూడాలనే వివరాలు తెలుసుకోండి.

తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ.. నెల రోజుల్లోపే ఓటీటీలోకి.. వెరైటీ టైటిల్, వెరైటీ స్టోరీ.. ఐఎండీబీలో 7.4 రేటింగ్

ఓటీటీలో హారర్ థ్రిల్లర్ జానర్ సినిమాలు ఇష్టపడే వారి కోసం మరో మూవీ వస్తోంది. ఈ తమిళ మూవీ పేరు పరమశివన్ ఫాతిమా (Paramashivan Fathima). టైటిల్ వెరైటీగా ఉంది కదూ. మూవీ స్టోరీ మరింత వెరైటీగా ఉంటుంది. గత నెల 6న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా నెల రోజుల్లోపే ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది.

పరమశివన్ ఫాతిమా ఓటీటీ రిలీజ్ డేట్

తమిళ హారర్ థ్రిల్లర్ మూవీ పరమశివన్ ఫాతిమా వచ్చే శుక్రవారం (జులై 4) నుంచి ఆహా తమిళం ఓటీటీలో స్ట్రీమింగ్ కానుంది. ఈ విషయాన్ని ఆ ఓటీటీ మంగళవారం (జులై 1) వెల్లడించింది.

“ఈ కథను తెలుసుకుందాం”, “దీని తర్వాత ఏం జరుగుతుంది” అనే క్యాప్షన్లతో రెండు ట్వీట్స్ చేసింది. ఓ పోస్టర్, మరో వీడియో రిలీజ్ చేసింది. జూన్ 6న థియేటర్లలో రిలీజై ఐఎండీబీలో 7.4 రేటింగ్ సాధించిన ఈ మూవీ నెల రోజుల్లోపే ఓటీటీలోకి వచ్చేస్తోంది.

పరమశివన్ ఫాతిమా మూవీ గురించి..

పరమశివన్ ఫాతిమా మూవీలో విమల్, ఛాయా దేవి, ఎమ్మెస్ భాస్కర్ లాంటి వాళ్లు నటించారు. మూవీని ఇసక్కి కర్వన్నన్ డైరెక్ట్ చేశాడు. దీపక్ చక్రవర్తి మ్యూజిక్ అందించాడు. ఈ హారర్ థ్రిల్లర్ సినిమాకు ఎ సర్టిఫికెట్ లభించింది. ఇది రెండు ఊళ్ల చుట్టూ తిరిగే స్టోరీ.

ఓ ఊళ్లో హిందువులు ఎక్కువుగా ఉంటే.. మరో ఊళ్లో క్రిస్టియన్ జనాభా ఎక్కువ. అయితే ఈ రెండు ఊళ్లలోనూ కొన్ని వరుస హత్యలు జరుగుతుంటాయి. గతంలో జరిగిన మత ఘర్షణలకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఆత్మలు చేసే హత్యలుగా అక్కడి వాళ్లు భావిస్తుంటారు. తర్వాత ఏం జరిగిందన్నది ఈ సినిమాలో చూడాలి.

ఈ మూవీకి చాలా వరకు నెగటివ్ రివ్యూలే వచ్చాయి. సినిమా కథనం కూడా ముందే అంచనా వేసేలా ఉండటంతో హారర్ థ్రిల్లర్ జానర్ కు అర్థం లేకుండా పోయిందన్న విమర్శలూ వచ్చాయి. మరి ఆహా తమిళం ఓటీటీలో ఈ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందన్నది చూడాలి.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024