లివ్ ఇన్ పార్టనర్ ను గొంతు నులిమి హత్య: మృతదేహం తోనే 2 రోజులు..

Best Web Hosting Provider In India 2024


లివ్ ఇన్ పార్టనర్ ను గొంతు నులిమి హత్య: మృతదేహం తోనే 2 రోజులు..

Sudarshan V HT Telugu

వాగ్వాదం జరగడంతో క్షణికావేశంలో తనతో సహ జీవనం చేస్తున్న యువతిని గొంతు నులిమి హత్య చేశాడు. ఆ తరువాత ఆ మృతదేహంలోనే రెండు రోజులు గడిపాడు. ఈ దారుణ ఘటన మధ్య ప్రదేశ్ లోని భోపాల్ లో జరిగింది.

లివ్ ఇన్ పార్టనర్ హత్య (REUTERS)

మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్ లో ఓ ప్రేమ జంటకు సంబంధించిన షాకింగ్ ఘటన వెలుగుచూసింది. రితికా సేన్ (29) అనే యువతిని ఆమె ప్రియుడు గొంతు నులిమి హత్య చేశాడు. ఈ విషయాన్ని పోలీసులకు తెలియజేసి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించే వరకు 32 ఏళ్ల నిందితుడు రెండు రోజుల పాటు ఆ శవంతో ఇంట్లోనే ఉన్నాడు. హత్య విషయాన్ని నిందితుడు తన స్నేహితుడికి తెలియజేయడంతో అతను మొదట ఇది జోక్ అని భావించాడు.

మొదట ఫ్రెండ్ కు చెప్పి..

సచిన్ రాజ్ పుత్ అనే నిందితుడు జూన్ 27న తన భాగస్వామి రితికా సేన్ (29) ని హత్య చేసి రెండు రోజుల పాటు మృతదేహంతో పాటే ఉండి చివరకు మిస్రోడ్ లోని తన స్నేహితుడు అనూజ్ కు హత్య చేసిన విషయాన్ని వెల్లడించాడు. దాంతో, ఆ స్నేహితుడు పోలీసులకు సమాచారం ఇచ్చాడు.

గొంతు నులిమి హత్య

నిందితుడు సచిన్ నిరుద్యోగి. రితిక జాబ్ చేస్తోంది. ఓ ప్రైవేట్ సంస్థలో పనిచేస్తున్న రితికా మూడున్నరేళ్లుగా సచిన్ తో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉంది. రితికకు తన బాస్ తో ఎఫైర్ ఉందని సచిన్ కు అనుమానం. ఘటన జరిగిన రోజు మద్యం మత్తులో ఉన్న సచిన్ కు రితిక తో తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. దాంతో, కోపంతో రితిక గొంతు నులిమి హత్యచేశాడు. ఆ తర్వాత సచిన్ ఏమీ జరగనట్లుగా ఆమె మృతదేహాన్ని దుప్పటిలో చుట్టాడు. జూన్ 29 వరకు రెండు రాత్రులు వారి మంచంపై శవం పక్కన పడుకున్నాడు. ఆ తరువాత తన ఫ్రెండ్ కు సమాచారం ఇచ్చాడు.

పోలీసు కేసు

సచిన్ ఫ్రెండ్ ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ఘటనా స్థలానికి చేరుకున్న బజారియా పోలీసులు కుళ్లిపోయిన రితికా మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆసుపత్రికి తరలించారు. అనంతరం నిందితుడు సచిన్ ను అరెస్ట్ చేశారు. అతను మద్యం మత్తులో తన భాగస్వామిని హత్య చేసినట్లు అంగీకరించాడు.

హత్య చేసి మందు తాగి..

తొమ్మిది నెలల క్రితం రితికతో కలిసి గాయత్రి నగర్ కు వచ్చిన నిందితుడు తన లివ్ ఇన్ పార్ట్ నర్ ను హత్య చేసిన తర్వాత షాక్ తో, భయంతో భాగా మద్యం సేవించి, మృతదేహం పక్కన పడుకున్నాడు. ‘మృతదేహాన్ని కౌగిలించుకుని అక్కడే ఉండిపోయాను’ అని పోలీసులకు తెలిపాడు.

వి. సుదర్శన్ గత 3 సంవత్సరాల నుండి హిందూస్తాన్ టైమ్స్ డిజిటల్ మీడియా తెలుగు విభాగంలో న్యూస్ ఎడిటర్ గా ఉన్నారు. గతంలో, ఆయన ఈనాడు, సాక్షి వంటి ప్రముఖ తెలుగు దినపత్రికలతో వివిధ సంపాదకీయ హోదాలలో పనిచేశారు. జాతీయ అంతర్జాతీయ రాజకీయ పరిణామాలు, ఎన్నికలు, బడ్జెట్స్, ఆర్థిక రంగ పరిణామాలను రిపోర్ట్ చేయడంలో, రాజకీయ విశ్లేషణల్లో దాదాపు 20 సంవత్సరాల అనుభవం ఉంది. వి. సుదర్శన్ ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎంబీఏ, ఎల్ఎల్ బీ చేశారు.

సంబంధిత కథనం

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link