




Best Web Hosting Provider In India 2024
‘సబ్సిడీలు తగ్గిస్తా’ అంటున్న ట్రంప్- ‘మొత్తం తీసేయండి, కొత్త పార్టీ పెడతా’ అని మస్క్ మాస్ రిప్లై!
అపర కుబేరుడు ఎలాన్ మస్క్ వ్యాపారాలకు ఇస్తున్న సబ్సిడీలను తగ్గిస్తానని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించారు. మొత్తాన్ని నిలిపివేయాలని మస్క్ బదులిచ్చారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, అపర కుబేరుడు ఎలాన్ మస్క మధ్య విభేదాలు మరింత ముదిరినట్టు కనిపిస్తోంది. ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న మస్క్‌ని ట్రంప్ హెచ్చరిస్తుండగా, టెస్లా సీఈఓ గట్టి జవాబు ఇస్తున్నారు. ఈ పూర్తి వ్యవహారంపై ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ రచ్చ చేస్తోంది.
డొనాల్డ్ ట్రంప్ వర్సెస్ ఎలాన్ మస్క్..
ట్రంప్ తన మాజీ సలహాదారు అయిన మస్క్‌పై తీవ్ర విమర్శలు చేశారు. మస్క్ కంపెనీలకు ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీలను నిలిపివేస్తామని హెచ్చరించారు. ట్రంప్ పరిపాలన కనుక టెస్లా, స్పేస్‌ఎక్స్ వంటి మస్క్ వివిధ కంపెనీలకు ఇస్తున్న సబ్సిడీలను నిలిపివేస్తే, దక్షిణాఫ్రికాలో పుట్టిన మస్క్ “బహుశా తన వ్యాపారాలను మూసివేసి స్వదేశానికి తిరిగి వెళ్లాల్సి వస్తుంది,” అని ట్రంప్ వ్యాఖ్యానించారు.
“ఈవీలను ప్రజలపై రుద్దే విషయాన్ని నేను వ్యతిరేకిస్తాను. అధ్యక్ష ఎన్నికల్లో నాకు మద్దతిచ్చే ముందే ఎలాన్ మస్క్‌కి ఈ విషయం తెలుసు. నా ఎన్నికల ప్రచారాల్లో చాలాసార్లు దీని గురించి మాట్లాడాను. నేను ఎలక్ట్రిక్ కార్లకు వ్యతిరేకం కాదు. కానీ, అందరు ఈవీలు కొనాలని బలవంతం చేయడం కరెక్ట్ కాదు. మనిషి మనుగడలో ఎవరు పొందనన్ని సబ్సిడీలు మస్క్ పొందుతున్నారు. సబ్సిడీలు లేకపోతే మస్క్ దుకాణం మూసేసి, తన స్వదేశం దక్షిణాఫ్రికాకు వెళ్లిపోవాల్సి వస్తుంది. రాకెట్లు ఉండవు. శాటిలైట్లు ఉండవు. ఈవీల తయారీ ఉండదు. మన దేశంలో సంపద వెల్లువెత్తుతుంది. మన డాడ్జ్ వీటిపై ఒక లుక్కేయాలేమో! చాలా డబ్బులు ఆదా చేసుకోవచ్చు,” అని ట్రంప్ తన ట్రూత్ సోషల్ మీడియాలో రాసుకొచ్చారు.
ట్రంప్ వ్యాఖ్యలకు మస్క్ వెంటనే స్పందించారు. రిపబ్లికన్ నాయకుడు తన బెదిరింపును అమలు చేయాలని, తన కంపెనీలకు ఇస్తున్న సబ్సిడీలను తగ్గించడం కాదు, పూర్తిగా నిలిపివేయాలని అన్నారు. “వాటన్నింటినీ వెంటనే నిలిపివేయమని నేనే చెబుతున్నాను. వెంటనే,” అని ఎక్స్‌లో మస్క్ ఒక పోస్ట్‌లో పెట్టారు.
ట్రంప్‌నకు అధ్యక్ష సలహాదారుగా పనిచేసి, మే నెల వరకు ప్రభుత్వానికి సంబంధించిన ‘డిపార్ట్‌మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియెన్సీ’ విభాగానికి మస్క్ అధిపతిగా ఉన్న విషయం తెలిసిందే. అయితే, గత నెలలో ట్రంప్ తీసుకొచ్చిన ‘వన్ బిగ్ బ్యూటిఫుల్ బిల్’ విషయంలో ట్రంప్‌తో మస్క్ బహిరంగంగా తీవ్ర విభేదాలు ఏర్పరచుకున్నారు.
‘కొత్త పార్టీ పెడతా..’
అమెరికా కాంగ్రెస్‌లో సోమవారం ఈ బిగ్ బ్యూటిఫుల్ బిల్ ఓటింగ్‌కి వెళ్లింది. ఈ బిల్లుతో ట్యాక్స్‌లు తగ్గించి, స్పెండింగ్ని పెంచుతానని ట్రంప్ చెబుతున్నారు. కానీ బిల్లులో అనేక లోపాలు ఉన్నాయని, మరీ ముఖ్యంగా అమెరికా ఆర్థిక వ్యవస్థ ధ్వంసమవుతుందని, అప్పులు పెరిగిపోతాయని మస్క్ హెచ్చరిస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ బిల్లు కాంగ్రెస్‌లో పాసైన మరుసటి రోజే తాను కొత్త పార్టీ పెడతానని మస్క్ చెప్పుకొచ్చారు. రిపబ్లికన్ పార్టీ, డెమొక్రటిక్ పార్టీకి ప్రత్యామ్నాయంగా ‘అమెరికా పార్టీ ’ పెడతానని మస్క్ అన్నారు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link