ఓటీటీలోకి సూపర్ హిట్ మలయాళం డ్యాన్స్ మూవీ.. బ్రేక్ డ్యాన్స్‌పై రూపొందిన అద్భుతమైన సినిమా ఇది.. ఎక్కడ చూడాలంటే?

Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి సూపర్ హిట్ మలయాళం డ్యాన్స్ మూవీ.. బ్రేక్ డ్యాన్స్‌పై రూపొందిన అద్భుతమైన సినిమా ఇది.. ఎక్కడ చూడాలంటే?

Hari Prasad S HT Telugu

బ్రేక్ డ్యాన్స్‌కు గొప్ప ట్రిబ్యూట్ గా చెబుతూ మలయాళంలో వచ్చిన మూవీ ఇప్పుడు డిజిటల్ ప్రీమియర్ కు సిద్ధమైంది. ఐఎండీబీలో 7.9 రేటింగ్ సాధించి డ్యాన్స్ లవర్స్ ను ఉర్రూతలూగించిన ఈ సినిమాను ఎప్పుడు, ఎక్కడ చూడాలో తెలుసుకోండి.

ఓటీటీలోకి సూపర్ హిట్ మలయాళం డ్యాన్స్ మూవీ.. బ్రేక్ డ్యాన్స్‌పై రూపొందిన అద్భుతమైన సినిమా ఇది.. ఎక్కడ చూడాలంటే?

మలయాళంలో వచ్చిన డ్యాన్స్ సినిమా ‘మూన్‌వాక్’ డిజిటల్ ప్రీమియర్ చేయడానికి సిద్ధమైంది. ఈ ఏడాది మే 30న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ డిజిటల్ ప్రీమియర్ కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చేస్తున్నారు. ఐఎండీబీలో 7.9 రేటింగ్ సాధించడం చూస్తే.. ఈ మూవీ ప్రేక్షకులకు ఎంతబాగా నచ్చిందో అర్థం చేసుకోవచ్చు. మరి ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఏంటో చూడండి.

మూన్‌వాక్ ఓటీటీ రిలీజ్ డేట్

మలయాళం ఇండస్ట్రీ నుంచి డ్యాన్స్ పై వచ్చిన మూవీ మూన్‌వాక్. అనునాథ్, రిషి కైనిక్కర, సిద్ధార్థ్ బి, మనోజ్ మోసెస్, నైనిత మరియా, సుజిత్ ప్రభాకర్ లాంటి వాళ్లు నటించారు. ఈ సినిమా మే 30న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు జులై 8 నుంచి జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. ఈ మధ్య సూపర్ హిట్ మలయాళం సినిమాల హక్కులను వరుసగా సొంతం చేసుకుంటున్న ఈ ప్లాట్‌ఫామ్ ఇప్పుడు మూన్‌వాక్ మూవీనీ స్ట్రీమింగ్ చేయనుంది.

ఇప్పటికే జియోహాట్‌స్టార్ లో ఈ ఏడాది రెండు అతిపెద్ద మలయాళం బ్లాక్‌బస్టర్లు ఎల్2: ఎంపురాన్, తుడరుమ్ తోపాటు పడక్కళంలాంటి సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఇప్పుడు ఐఎండీబీలో 7.9 రేటింగ్ సాధించిన ఈ మూన్‌వాక్ కూడా రాబోతోంది. ఇలాంటి చిన్న సినిమాలకు ఓటీటీలో మరింత ఎక్కువ ఆదరణ లభిస్తోంది. దీంతో మూన్‌వాక్ జియోహాట్‌స్టార్ లోనూ హిట్ అవుతుందని భావిస్తున్నారు.

‘మూన్‌వాక్’ స్టోరీ ఏంటంటే?

‘మూన్‌వాక్’ కథ నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఒకప్పటి పాప్ సామ్రాజ్యపు రాజు మైఖేల్ జాక్సన్ స్ఫూర్తితో బ్రేక్ డ్యాన్స్ నేర్చుకోవాలని కలలు కనే యువకుల బృందం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. స్కూల్‌కు వెళ్తూ లేదా చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఈ యువకులు డ్యాన్స్ నేర్చుకోవడానికి ఎలాంటి అడ్డంకులను అధిగమిస్తారో ఈ మూవీలో చూపించారు. ఒక కాంపిటీషన్ లో పాల్గొనడానికి డ్యాన్స్ స్టెప్స్‌ని పక్కాగా నేర్చుకోవడానికి వారు పడే కష్టాన్ని కూడా ఇందులో చూడొచ్చు. ఇది 1980ల నాటి కేరళలోని ఒక చిన్న గ్రామం నేపథ్యంలో సాగే కథనం.

ఈ సినిమాను ప్రముఖ దర్శకుడు లిజో జోస్ పెల్లిస్సేరి థియేటర్లలో విడుదల చేశారు. ఎ.కె. వినోద్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. ఈ యూత్ గ్రూప్ ద్వారా ‘మూన్‌వాక్’ సినిమా పరిశ్రమకు ఒక కొత్త స్ఫూర్తిని తీసుకువస్తుందని లిజో ఒక ప్రమోషన్ వీడియోలో చెప్పారు. ‘మూన్‌వాక్’లో ప్రధాన నటులలో ఎక్కువ మంది కొత్తవాళ్లే. షేర్షా షరీఫ్, అనునాథ్, రిషి కైనిక్కర, సిద్ధార్థ్ బి, మనోజ్ మోసెస్, సుజిత్ ప్రభాకర్, నైనిత మరియా, శ్రీకాంత్ మురళి, మీనాక్షి రవీంద్రన్, అర్జున్ మణిలాల్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రలు పోషించారు.

స్క్రీన్‌ప్లేను ఎ.కె. వినోద్, మాథ్యూ వర్గీస్, సునీల్ గోపాలకృష్ణన్ కలిసి రాశారు. డ్యాన్స్ లవర్స్ తోపాటు మైఖేల్ జాక్సన్ ను అమితంగా ఆరాధించే ప్రేక్షకులకు ఈ మూన్‌వాక్ మూవీ బాగా నచ్చుతుందని చెప్పొచ్చు. ఇంకేం జులై 8 నుంచి జియోహాట్‌స్టార్ లో ఈ సినిమాను చూడటానికి సిద్ధంగా ఉండండి.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024