





Best Web Hosting Provider In India 2024

చిన్న సినిమాలే కానీ పెద్ద హిట్లు.. ఈ ఏడాది వచ్చిన ఈ మలయాళం సినిమాలు చూశారా? ఈ ఓటీటీల్లో చూసేయండి
ఈ ఏడాది మలయాళం సినిమా నుంచి కొన్ని బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్ హిట్స్ వచ్చాయి. అయితే మరికొన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర పెద్దగా ప్రభావం చూపకపోయినా.. స్టోరీ పరంగా ఓ కొత్త ఫీల్ ను కలిగించాయి. అలాంటి మూవీస్ ఏవి? ఏ ఓటీటీల్లో చూడాలో తెలుసుకోండి.
ఈ ఏడాది మలయాళ సినిమాకు కొన్ని అద్భుతమైన విజయాలను అందించింది. ‘ఎల్2:ఎంపురాన్’, ‘తుడరుమ్’, ‘రేఖాచిత్రమ్’, ‘అలప్పుళ జింఖానా’ వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను రాబట్టాయి. అయితే, ఈ ఏడాది బాక్సాఫీస్ దగ్గర గెలవకపోయినా, తప్పకుండా చూడదగిన కొన్ని మంచి సినిమాలు కూడా వచ్చాయి.
టొవినో థామస్ నటించిన ‘ఐడెంటిటీ’ నుండి బేసిల్ జోసెఫ్ ప్రధాన పాత్రలో వచ్చిన ‘ప్రావిన్‌కూడు షాపు’ వరకు, 2025 మొదటి అర్ధభాగంలో వచ్చిన, మీ దృష్టిని ఆకర్షించాల్సిన కొన్ని మలయాళ చిత్రాలు ఇక్కడ ఉన్నాయి.
ఐడెంటిటీ (Identity) – జీ5 ఓటీటీ
ప్రముఖ నటుడు టొవినో థామస్ ‘ఐడెంటిటీ’ సినిమాతో 2025లో మలయాళ సినిమాకు తొలి హిట్ అందించాడు. ఇది ఈ ఏడాది విడుదలైన మొదటి పెద్ద సినిమా. ఒక స్కెచ్ ఆర్టిస్ట్, ఒక పోలీస్, ఒక నేరానికి సాక్షిగా ఉన్న వ్యక్తి – ఈ ముగ్గురూ కలిసి హంతకుడిని గుర్తించడానికి ప్రయత్నించడమే ఈ కథలో ప్రధానాంశం. కథనంలో అనేక ఆశ్చర్యకరమైన మలుపులు, ట్విస్ట్‌లు ఉన్నాయి.
ఈ సినిమా దర్శకులు అఖిల్ పాల్, అనాస్ ఖాన్లను అభినందించాలి. కొన్ని అద్భుతమైన యాక్షన్ సన్నివేశాలు, థ్రిల్లింగ్ కార్ ఛేజ్‌లు, పదునైన నటనతో ఈ సినిమా ఆకట్టుకుంటుంది. తమిళ నటులైన త్రిష కృష్ణన్, వినయ్ రాయ్ ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు.
ప్రావిన్‌కూడు షాపు (Pravinkoodu Shappu) – సోనీ లివ్
మలయాళ నటుడు, దర్శకుడు బేసిల్ జోసెఫ్ ‘ప్రావిన్‌కూడు షాపు’లో ఒక పోలీసుగా నటించాడు. ఈ సినిమా ఒక భయంకరమైన కల్లు దుకాణం చుట్టూ తిరుగుతుంది. ఒక రాత్రి దుకాణం యజమాని చనిపోయి ఉంటాడు. అక్కడ ఉన్న వారందరూ అనుమానితులుగా మారతారు. బేసిల్ జోసెఫ్ సీఐ సంతోష్‌గా ఎలా ఈ కేసును పరిష్కరించాడన్నది మూవీలో చూడొచ్చు. సౌబిన్ షాహిర్, చెంబన్ వినోద్ జోస్, చాందిని శ్రీధరన్ ఈ సినిమాలో ఇతర కీలక పాత్రల్లో నటించారు.
దావీద్ (Daveed) – జీ5 ఓటీటీ
మలయాళ నటుడు ఆంటోనీ వర్గీస్.. అభిమానులకు పెపేగా సుపరిచితుడు. ‘దావీద్’ సినిమాలో ఆషిక్ అబుగా నటించాడు. బౌన్సర్‌గా అతడు చేసిన ఓ తప్పు.. ఆషిక్ అబుకు ఒక అంతర్జాతీయ బాక్సింగ్ ఛాంపియన్‌ను రింగ్‌లో ఎదుర్కోవలసి వస్తుంది. యాక్షన్ ప్యాక్డ్ మూవీ ఇది. లిజోమోల్ జోస్, విజయరాఘవన్ ‘దావీద్’లో ఇతర కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి గోవింద్ విష్ణు దర్శకత్వం వహించారు.
మరణమాస్ (Maranamass) – సోనీ లివ్
మరణమాస్ కూడా బేసిల్ జోసెఫ్ నటించిన సినిమా. అయితే ఇందులో అతడు నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ పోషించాడు. ల్యూక్ పీపీ అనే ఓ జెన్ జీ యూత్ పాత్రలో ఒదిగిపోయాడు. ఓ సీరియల్ కిల్లర్ చుట్టూ తిరిగే కథ ఇది. ఒక నైట్ బస్సులోనే చాలా వరకు స్టోరీ సాగుతుంది. మంచి కామెడీ థ్రిల్లర్ ఇది. నవ్విస్తూనే థ్రిల్ పంచుతుంది. సోనీలివ్ ఓటీటీలో మూవీ స్ట్రీమింగ్ అవుతోంది.
సంబంధిత కథనం