హరి హర వీరమల్లు ట్రైలర్ చూసిన పవన్ కల్యాణ్.. అతని రియాక్షన్ వైరల్.. వీడియో షేర్ చేసిన మూవీ టీమ్

Best Web Hosting Provider In India 2024

హరి హర వీరమల్లు ట్రైలర్ చూసిన పవన్ కల్యాణ్.. అతని రియాక్షన్ వైరల్.. వీడియో షేర్ చేసిన మూవీ టీమ్

Hari Prasad S HT Telugu

హరి హర వీరమల్లు మూవీ ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో పవన్ ఈ ట్రైలర్ చూస్తున్న వీడియోను మూవీ టీమ్ షేర్ చేసింది. ఇది చూసిన తర్వాత పవన్ రియాక్షన్ కూడా వైరల్ అవుతోంది.

హరి హర వీరమల్లు ట్రైలర్ చూసిన పవన్ కల్యాణ్.. అతని రియాక్షన్ వైరల్.. వీడియో షేర్ చేసిన మూవీ టీమ్

వాయిదాల మీద వాయిదాలు పడుతూ వస్తున్న పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హిస్టారిక్ మూవీ హరి హర వీరమల్లు ఈ నెల 24న రిలీజ్ కానున్న విషయం తెలుసు కదా. ఈ నేపథ్యంలో ట్రైలర్ ను గురువారం (జులై 3) మేకర్స్ రిలీజ్ చేయనున్నారు. అయితే ఇప్పటికే సిద్ధమైన ట్రైలర్ ను పవన్ కల్యాణ్ చూశాడు. దీనికి సంబంధించిన వీడియో, ఫొటోలను మూవీ టీమ్ షేర్ చేసింది.

ట్రైలర్ చూసి పవన్ రియాక్షన్ ఇదే..

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హరి హర వీరమల్లు కోసం ఎన్నో రోజులు అభిమానులు ఎదురు చూస్తూ ఉన్నారు. మొత్తానికి ట్రైలర్ రిలీజ్ సమయం దగ్గర పడుతోంది. అంతేకాదు ఈ ట్రైలర్ పవన్ కు కూడా బాగా నచ్చేసినట్లు మూవీ టీమ్ రిలీజ్ చేసిన వీడియో చూస్తే తెలుస్తోంది. ఈ హరి హర వీరమల్లు టీమ్ తోపాటు దర్శకుడు త్రివిక్రమ్ తో కలిసి పవన్ కల్యాణ్ ఈ సినిమా ట్రైలర్ చూశాడు.

ట్రైలర్ చూస్తున్నంతసేపు పవన్ బాగా ఎంజాయ్ చేసినట్లుగా వీడియో చూస్తే తెలుస్తోంది. ఇక చివర్లో దర్శుకుడు జ్యోతి కృష్ణను హగ్ చేసుకొని చాలా బాగా కష్టపడ్డావ్ అంటూ ప్రశంసించి పవన్ వెళ్లిపోవడం ఈ వీడియోలో చూడొచ్చు. ఎన్నో ఏళ్లుగా సాగుతున్న ఈ ప్రాజెక్ట్ మొత్తానికి ఈ నెలలోనే ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ నేపథ్యంలో ట్రైలర్ ఎలా ఉంటుందో అన్న ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది.

హరి హర వీరమల్లు మూవీ గురించి..

హరి హర వీరమల్లు మూవీ ఇప్పటికే ఎన్నోసార్లు రిలీజ్ డేట్ అనౌన్స్ చేసి మళ్లీ వెనక్కి తగ్గారు. గత నెలలోనే మూవీని రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించినా.. మళ్లీ వాయిదా వేశారు. మొత్తానికి జులై 24న మూవీ వస్తోంది. ట్రైలర్ కూడా సిద్ధమైపోయింది. దీంతో ఈసారి టీమ్ వెనక్కి తగ్గదని అభిమానులు భావిస్తున్నారు. ట్రైలర్ లాంచ్ తో మూవీ ప్రమోషన్ పనులు కూడా ప్రారంభం కానున్నాయి.

ఈ సినిమా మొదట క్రిష్ డైరెక్ట్ చేయగా.. మధ్యలోనే అతడు తప్పుకోవడంతో తర్వాత జ్యోతి కృష్ణ డైరెక్ట్ చేశాడు. ఏఎం రత్నం సినిమాను నిర్మించాడు. కీరవాణి మ్యూజిక్ అందించాడు. ఈ సినిమాలో పవన్ సరసన నిధి అగర్వాల్ నటించింది. ఇప్పటి వరకూ వచ్చిన సాంగ్స్, టీజర్, ఇతర ప్రమోషన్ వీడియోలు అభిమానులను బాగా ఆకట్టుకున్నాయి. ఈ నేపథ్యంలో ట్రైలర్ ఎలా ఉంటుందో అన్న ఆసక్తి నెలకొంది.

హరి ప్రసాద్ శీలమంతుల హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు. ఈయన 20 ఏళ్ల అనుభవం ఉన్న సీనియర్ జర్నలిస్ట్. ప్రింట్, ఎలక్ట్రానిక్, డిజిటల్ మీడియాల్లో పని చేసిన అనుభవం ఉంది. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షిలాంటి ప్రముఖ దిన పత్రికలు, టీవీ ఛానెల్లో పని చేశారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ చేయడంతోపాటు జర్నలిజంలో డిప్లొమా కోర్సు పూర్తి చేశారు. నవంబర్ 1, 2021 నుంచి అసిస్టెంట్ న్యూస్ ఎడిటర్‌గా స్పోర్ట్స్, ఎంటర్‌టైన్మెంట్, రాశి ఫలాల సెక్షన్ల బాధ్యతలు చూస్తున్నారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024