వారసుడు ఎవరు? త్వరలోనే వెల్లడి.. దలైలామా ప్రకటనతో చైనాకు బిగ్ షాక్!

Best Web Hosting Provider In India 2024


వారసుడు ఎవరు? త్వరలోనే వెల్లడి.. దలైలామా ప్రకటనతో చైనాకు బిగ్ షాక్!

Anand Sai HT Telugu

దలైలామా 15వ వారసుడు ఎవరనేది ఇంకా వెల్లడి కాలేదు. కానీ ఈ విషయంపై దలైలామా నుండి స్పందన వచ్చింది. ఇది చైనాకు షాక్‌కు కలిగించినట్టుగా ఉంది.

దలైలామా

టిబెటన్ ఆధ్యాత్మిక గురువు దలైలామాకు త్వరలో 90 ఏళ్లు నిండనున్నాయి. ఆయన వయస్సు కారణంగా వారసుడి గురించి చర్చ మళ్లీ తీవ్రమైంది. ప్రస్తుతం 15వ దలైలామాను తన వారసుడిగా ఎన్నుకునే 14వ దలైలామా ఉన్నారు. దలైలామాను ఎన్నుకునే ఈ సంప్రదాయం సుమారు 600 సంవత్సరాలుగా కొనసాగుతోంది. తన వారసుడి గురించి ఒక ప్రకటన ఇచ్చారు దలైలామా. ఒక నివేదిక ప్రకారం.. టిబెటన్ బౌద్ధ సంప్రదాయాల ప్రకారం వారసుడిని ఎంపిక చేస్తామని ఆయన స్పష్టం చేశారు. ఇందులో చైనాకు ఎటువంటి పాత్ర ఉండదన్నారు. తమకు అనుకూలమైన వ్యక్తిని దలైలామాగా నియమించాలని చైనా భావిస్తోంది.

ఈ బౌద్ధ సంప్రదాయం ప్రకారం కాకుండా చైనా తదుపరి దలైలామాను ఎన్నుకునేందుకు కుతంత్రాలు చేస్తోందనే ఆరోపణలు ఉన్నాయి. అయితే తన మరణం తర్వాత వారసుడిని ఎన్నుకునే అధికారం గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్ట్‌కు దలైలామా అప్పగించారు. భవిష్యత్తులో దలైలామా ఇన్స్టిట్యూట్ కొనసాగుతుందని కూడా ఆయన స్పష్టం చేశారు. 2011 లో చేసిన వాగ్దానాన్ని ఆయన ప్రస్తావించారు. 2011 సెప్టెంబర్ 24 న జరిగిన సమావేశంలో, సంస్థ మరింతగా కొనసాగాలనే అంశాన్ని లేవనెత్తినట్లు ఆయన చెప్పారు.

‘నాకు దాదాపు 90 ఏళ్లు వచ్చినప్పుడు, దలైలామా సంస్థ కొనసాగాలా వద్దా అని పరిశీలించడానికి టిబెటన్ బౌద్ధ సంప్రదాయాల ఉన్నత లామాలు, టిబెటన్ ప్రజలు, టిబెటన్ బౌద్ధమతం ఇతర సంబంధిత అభ్యాసకులతో నేను సంప్రదిస్తాను.’ అని దలైలామా తన మాటలను గుర్తు చేసుకున్నారు.

దలైలామా వారసుడిపై చేసిన ప్రకటన చైనాలో ఉద్రిక్తతను పెంచింది. ఈ దేశానికి పెద్ద షాక్ ఇచ్చినట్టుగా అయింది. ధర్మాన్ని నమ్మని కమ్యూనిస్టులో ఈ వ్యవస్థలో జోక్యం చేసుకోవడం సరికాదని దలైలామా అన్నారు. తన వారసత్వా్న్ని సంప్రదాయాల ప్రకారం కొనసాగించాలన్నారు. తన 90వ పుట్టిన రోజు అంటే జులై 6 కంటే ముందు దలైలామా ఈ ప్రకటన చేయడంతో చైనాకు బిగ్ షాక్ తగిలింది.

‘దలైలామా సంస్థను కొనసాగించాలని టిబెట్, హిమాలయ, మంగోలియా, రష్యా, చైనా ప్రజల నుండి నాకు లేఖలు వచ్చాయి. ఆధ్యాత్మిక సంప్రదాయాల నాయకులు, టిబెటన్ పార్లమెంట్ సభ్యులు, ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్నవారు, ఎన్జీఓలు కూడా సంస్థను కొనసాగించడానికి గల కారణాన్ని లేఖలో వివరించారు.’ అని దలైలామా తన ప్రకటనలో తెలిపారు.

ప్రస్తుత దలైలామా అసలు పేరు టెన్జిన్ గ్యాట్సో. ఈయన 14వ దలైలామా, 1935లో టిబెట్‌లోని టాక్సేర్ గ్రామంలో జన్మించారు. 1940లో 14వ దలైలామాగా గుర్తింపు పొందారు. ఇప్పుడు తదుపరి వారసుడు అంటే 15వ దలైలామాగా ఎవరు ఉంటారని ప్రపంచం ఎదురుచూస్తోంది.

ఆనంద్ సాయి హెచ్.టి తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. నేషనల్, బిజినెస్ వార్తలు రాస్తారు. గతంలో ఎంటర్‌టైన్మెంట్, లైఫ్‌స్టైల్ రాసేవారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభం ఉంది. కాకతీయ యూనివర్సిటీలో మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం పీజీ చేశారు. గతంలో నవతెలంగాణ, ఈనాడు, ఈటీవీ భారత్, ఏబీపీ దేశంలో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. 2022లో హెచ్.టి తెలుగులో చేరారు.

టాపిక్

జాతీయ, అంతర్జాతీయ తాజా వార్తలను మన తెలుగు హిందుస్తాన్ టైమ్స్ న్యూస్ సైట్‌లోని జాతీయ అంతర్జాతీయ సెక్షన్‌లో చూడవచ్చు.

Best Web Hosting Provider In India 2024


Source link