అన్నీ కేసుల్లోనూ వంశీకి బెయిల్..! సుప్రీంకోర్టులోనూ ఊరట – జైలు నుంచి విడుదలకు లైన్ క్లియర్…!

Best Web Hosting Provider In India 2024

అన్నీ కేసుల్లోనూ వంశీకి బెయిల్..! సుప్రీంకోర్టులోనూ ఊరట – జైలు నుంచి విడుదలకు లైన్ క్లియర్…!

Maheshwaram Mahendra Chary HT Telugu
  • Share on Whatsappమమ్మల్ని ఫాలో అవ్వండి
  • Share on Facebook
Maheshwaram Mahendra Chary HT Telugu

సుప్రీంకోర్టులో వల్లభనేని వంశీకి ఊరట దక్కింది. వంశీ బెయిల్ రద్దుకు నిరాకరించింది. అక్రమ మైనింగ్ కేసులో వాల్యూషన్ నివేదిక వచ్చాక చూస్తామని తెలిపింది. తదుపరి విచారణ ఈ నెల 16కు వాయిదా వేసింది. ఇప్పటికే వంశీకి అన్నికేసుల్లోనూ బెయిల్ లభించింది. దీంతో ఆయన ఇవాళ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది.

వల్లభనేని వంశీకి ఊరట

మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. మైనింగ్ కేసులో వంశీ బెయిల్‌ రద్దు చేసేందుకు నిరాకరించింది. మైనింగ్ వాల్యూయేషన్‌పై నివేదిక ఇచ్చిన తర్వాత చూస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. తదుపరి విచారణ ఈనెల 16కు వాయిదా వేసింది. దీంతో వంశీ బెయిల్ విషయంలో అప్పీల్ కు వెళ్లిన ఏపీ ప్రభుత్వానికి ఎదురుదెబ్బ తగిలినట్లు అయింది.

అన్ని కేసుల్లోనూ బెయిల్…

వల్లభనేని వంశీకి ఏలూరు జిల్లా నూజివీడులోని 15వ అదనపు జిల్లా జడ్జి కోర్టు మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది. నకిలీ ఇళ్ల స్థల పట్టాలు ఇచ్చారంటూ అ పెట్టిన అక్రమ కేసులో వంశీ ప్రస్తుతం రిమాండ్‌లో ఉన్నారు. ఈ కేసులో బెయిల్‌ కోసం వంశీ పిటిషన్‌ దాఖలు చేయగా.. 4 రోజుల క్రితం వాదనలు ముగిశాయి. ఇరువైపు వాదనలు విన్న కోర్టు…. మంగళవారం బెయిల్‌ మంజూరు చేసింది. దీంతో ఆయనపై నమోదైన అన్ని కేసుల్లో బెయిల్ లభించినట్లు అయింది.

ప్రస్తుతం వల్లభనేని వంశీ విజయవాడ జిల్లా జైలులో రిమాండ్‌ ఖైదీ ఉన్నారు. గత నెలలో రెండు కేసుల్లో వంశీకి బెయిల్‌ మంజూరు అయ్యాయి. తాజాగా ఇళ్ల పట్టాల కేసులో బెయిల్‌ మంజూరైంది. దాంతో వంశీపై పెట్టిన కేసులన్నింటిల్లోనూ బెయిల్‌ మంజూరైంది. వంశీకి వచ్చిన బెయిల్ ను రద్దు చేయాలని ఏపీ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా… అక్కడ కూడా వంశీకి ఊరట లభించింది.

అన్ని కేసుల్లో బెయిల్ రావటంతో వల్లభనేని వంశీ ఇవాళ జైలు నుంచి విడుదలయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే బెయిల్ అర్డర్ కాపీలను జైలు అధికారులను సమర్పించినట్లు తెలిసింది.దీంతో ఇవాళ సాయంత్రం కల్లా ఆయన బయటికి వచ్చే అవకాశం ఉంది. ఆయనకు స్వాగతం పలికేందుకు వైసీపీ నేతలు, కార్యకర్తలు,అభిమానులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు.

Maheshwaram Mahendra Chary

TwittereMail
మహేంద్ర మహేశ్వరం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన వార్తలను రాస్తారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. గతంలో ఈటీవీ భారత్ లో పని చేశారు. 2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

టాపిక్

Andhra Pradesh NewsSupreme CourtYsrcp
మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ తాజా వార్తలు, క్రైమ్ వార్తలు, ట్రెండింగ్ వార్తలు, పొలిటికల్ వార్తలు చూడండి.
Source / Credits

Best Web Hosting Provider In India 2024