



Best Web Hosting Provider In India 2024

బిగ్‌బాస్ నుంచి బయటకు వచ్చి ఓ హీరోలా నిలబడ్డా – గౌతమ్ కృష్ణ కామెంట్స్
బిగ్‌బాస్ ఫేమ్ గౌతమ్ కృష్ణ హీరోగా నటించిన సోలో బాయ్ మూవీ జూలై 4న రిలీజ్ కాబోతోంది. రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ మూవీకి నవీన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.ఇటీవల ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ వేడుకకు డైరెక్టర్ వీవీ వినాయక్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు.
బిగ్‌బాస్ తెలుగు సీజన్ 8 రన్నరప్ గౌతమ్ కృష్ణ హీరోగా నటించిన సోలో బాయ్ మూవీ జూలై 4న థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. నవీన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రమ్య పసుపులేటి, శ్వేత అవస్తి హీరోయిన్లుగా నటిస్తున్నారు. అనిత చౌదరి, పోసాని కృష్ణ మురళి, అరుణ్ కుమార్, భద్రం, షఫీ కీలక పాత్రలు పోషించారు. సోలో బాయ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ వేడుకకు డైరెక్టర్ వీవీ వినాయక్ చీఫ్ గెస్ట్‌గా హాజరయ్యారు.
ఈ సందర్భంగా వీవీ వినాయక్ మాట్లాడుతూ… “సోలో బాయ్ నిర్మాత సతీష్ ఒక డైరెక్టర్‌గా ఇండస్ట్రీకి వచ్చి బట్టల రామస్వామి బయోపిక్ ద్వారా నిర్మాతగా మారారు. సాధారణ స్థాయి నుండి ఈరోజు నిర్మాతగా మారడానికి ఎంతో కష్టపపడ్డారు. హీరోగా గౌతమ్ కృష్ణకు మంచి భవిష్యత్తు ఉండాలి” అని అన్నారు.
మిడిల్ క్లాస్‌కు కనెక్ట్ అయ్యేలా…
దర్శకుడు నవీన్ కుమార్ మాట్లాడుతూ… ” ప్రతి మధ్యతరగతి కుటుంబానికి కనెక్ట్ అయ్యేలా సోలోబాయ్ ఉంటుంది. గౌతమ్ కృష్ణ యాక్టింగ్ చాలా నాచురల్‌గా ఉంటుంది. హీరోయిన్ల నటన ఆకట్టుకుంటుంది. మంచి కంటెంట్ ప్రేక్షకుల ముందుకు వస్తున్నాం. తప్పకుండా హిట్ కొడతామనే నమ్మకం ఉంది అని డైరెక్టర్ నవీన్ కుమార్ అన్నారు. నిర్మాత ఈ చిత్రం ద్వారా గొప్ప స్థాయికి వెళ్ళాలని కోరుకుంటున్నాను. పరిశ్రమకు ఇంకెంతమందిని పరిశీలించాలని అనుకుంటున్నాను” అన్నారు.
బిగ్‌బాస్‌లోకి వెళ్లకముందు…
హీరో గౌతమ్ కృష్ణ మాట్లాడుతూ… “నేను బిగ్ బాస్ కు వెళ్లక ముందు ఈ సినిమా మొదలైంది. నాకు ఎటువంటి ఫేమ్ లేని సమయంలో నన్ను నమ్మి నిర్మాత సతీష్ ఈ సినిమా మొదలుపెట్టారు.మధ్యతరగతి కుటుంబంలో ఉండే ఎన్నో విషయాలు ఈ సినిమాలో ఉంటాయి.
చాలా తక్కువ బడ్జెట్‌లో మంచి ఔట్‌పుట్‌తో ఈ సినిమాను రూపొందించారు. ఇండస్ట్రీలో ఎటువంటి పరిచయాలు లేకుండా కేవలం బిగ్ బాస్ నుండి బయటకు వచ్చి ఇలా ఒక సినిమాలో హీరోలా నిలబడటం అనేది చాలా పెద్ద విషయం. నేను దానిని ఒక సక్సెస్ లా భావిస్తున్నాను. నన్ను ప్రశ్నించే వారికి ఇదేనా సమాధానం” అని అన్నాడు. గౌతమ్ కృష్ణ కెరీర్‌లో మంచి మైల్‌స్టోన్‌లా సోలో బాయ్ మూవీ ఉంటుందని నిర్మాత సెవెన్ హిల్స్ సతీష్ పేర్కొన్నాడు