




Best Web Hosting Provider In India 2024

హరి హర వీరమల్లు ట్రైలర్ రన్‍టైమ్ ఖరారు.. అఫీషియల్‍గా ప్రకటించిన టీమ్
హరి హర వీరమల్లు ట్రైలర్ రెడీ అయింది. మరొక్క రోజులో వచ్చేయనుంది. ఈ తరుణంలో ట్రైలర్ ఎంతసేపు ఉండనుందో రన్‍టైమ్ గురించి మూవీ టీమ్ వెల్లడించింది. ట్రైలర్ సెన్సార్ తర్వాత ఈ విషయాన్ని ప్రకటించింది. ట్రైలర్ ఎంత సేపు ఉండనుందంటే..
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా నటించిన హరి హర వీరమల్లు చిత్రంపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇప్పటికే చాలాసార్లు వాయిదా పడిన ఈ సినిమా ఎట్టకేలకు జూలై 24న విడుదలయ్యేందుకు సిద్ధమైంది. ట్రైలర్ కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ తరుణం సమీపించేసింది. రేపే (జూలై 3) హరి హర వీరమల్లు ట్రైలర్ రానుంది. ఈ తరుణంలో ఈ ట్రైలర్ ఎంత నిడివి (రన్‍టైమ్) ఉండనుందో మూవీ టీమ్ నేడు వెల్లడించింది.
ట్రైలర్ రన్‍టైమ్ ఇదే
హరి హర వీరమల్లు సినిమా ట్రైలర్ రన్‍టైమ్ 3 నిమిషాల 1 సెకను ఉండనుంది.ఈ విషయాన్ని మూవీ టీమ్ నేడు (జూలై 2) అధికారికంగా వెల్లడించింది. ట్రైలర్ సెన్సార్ పూర్తయిందంటూ ఈ విషయాన్ని ప్రకటించింది మెగా సూర్య ప్రొడక్షన్స్. 3.01 నిమిషాల పాటు ట్రైలర్ నిడివి ఉంటుందంటూ ఓ పోస్టర్ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ట్రైలర్ రిలీజ్ టైమ్
హరి హర వీరమల్లు ట్రైలర్ రేపు (జూలై 3) ఉదయం 11 గంటల 10 నిమిషాలకు రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని టీమ్ ఇప్పటికే కన్ఫర్మ్ చేసింది. ట్రైలర్ ఫైనల్ కట్‍ను పవన్ కల్యాణ్ చూసేశారు. ట్రైలర్ చూసిన తర్వాత ఈ సినిమా దర్శకుడు జ్యోతికృష్ణను పవర్ స్టార్ అభినందించారు. పవన్‍తో పాటు స్టార్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా ట్రైలర్ వీక్షించారు. ఈ వీడియోను మూవీ టీమ్ పోస్ట్ చేసింది. రేపు ప్రేక్షకుల ముందుకు ఈ ట్రైలర్ రానుంది.
పవర్‌ఫుల్ డైలాగ్‍లతో..
హరి హర వీరమల్లు ట్రైలర్ కోసం సినీ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ట్రైలర్ ఎలా ఉంటుందా అనే ఆసక్తి చాలా ఉంది. ఇప్పటి వరకు ఈ చిత్రం నుంచి టీజర్, పాటలు వచ్చాయి. ట్రైలర్ వస్తే ఈ చిత్రం ఎలా ఉండనుందో మరింత స్పష్టత వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ ట్రైలర్ పవన్ కల్యాణ్ అభిమానులకు పండుగలా ఉంటుందని, పవర్‌ఫుల్ డైలాగ్స్ ఉంటాయని తెలుస్తోంది. మొఘలుల కాలం నాటి బ్యాక్‍డ్రాప్‍లో ఈ చిత్రం తెరకెక్కింది. గ్రాండ్ స్కేల్‍లో ఈ చిత్రం ఉంటుందనే అంచనాలు ఉన్నాయి. ఏపీ డిప్యూటీ సీఎం పదవిని పవన్ కల్యాణ్ చేపట్టిన తర్వాత ఆయన నుంచి వస్తున్న చిత్రం కావడంతో హరి హర వీరమల్లుపై హైప్ మరింత అధికంగా నెలకొంది.
హరి హర వీరమల్లు సినిమాకు ముందుగా డైరెక్టర్ క్రిష్ దర్శకత్వం వహించారు. అయితే, వాయిదాలు పడుతూ ఆలస్యమవుతుండటంతో మధ్యలోనే తప్పుకున్నారు. ఆ తర్వాత దర్శకత్వ బాధ్యతలను జ్యోతికృష్ణ చేపట్టారు. ఈ సినిమాను ఏఎం రత్నం, దయాకర్ రావు నిర్మిస్తున్నారు.
ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు బాబీ డియోల్.. ఔరంగజేబ్ పాత్ర పోషించారు. ఈ సినిమాలో నిధి అగర్వాల్, సత్యరాజ్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి, విక్రమ్‍జీత్ విర్క్, జిస్సు సెంగుప్తా, సచిన్ ఖేడేకర్ కీలకపాత్రల్లో నటించారు. ఈ మూవీకి ఆస్కార్ విన్నర్ ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. జూలై 24న తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లోనూ ఈ చిత్రం విడుదల కానుంది.
సంబంధిత కథనం