



Best Web Hosting Provider In India 2024
అమెరికాలో భారతీయ ఉద్యోగికి అవమానం; మీటింగ్ లో మాట్లాడవద్దని ఆదేశం
అమెరికాలో పని చేస్తున్న ఒక భారతీయుడికి అవమానం జరిగింది. ఆఫీస్ మీటింగ్ ల్లో అతడిని మాట్లాడవద్దని ఆదేశించారు. తన ఇంగ్లీష్ ఉచ్ఛారణ అర్థం చేసుకోవడం కష్టంగా ఉందని, అందువల్ల సమావేశాల్లో మాట్లాడటం మానేయమని అతడికి ఉన్నతాధికారులు చెప్పారు.
అమెరికాలో పనిచేస్తున్న ఒక భారతీయుడు తనకు ఆఫీస్ లో జరిగిన అవమానం గురించి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ రెడ్డిట్ లో వెల్లడించాడు. ఆఫీస్ మీటింగ్ ల్లో ఉచ్ఛారణ అర్థం చేసుకోవడం కష్టంగా ఉందని, కాబట్టి సమావేశాల్లో మాట్లాడటం మానేయమని తనను అడిగారని ఆవేదన వ్యక్తం చేశారు.
అమెరికన్లు ఉన్న టీమ్ లో..
32 సంవత్సరాల వయస్సు ఉన్న ఆ భారతీయ ఉద్యోగి గత కొన్ని సంవత్సరాలుగా అమెరికాలోని ఒక కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడు తాను అనుభవించిన పనిప్రాంత వివక్షపై తన ఆవేదనను ఆ రెడ్డిట్ పోస్ట్ లో వ్యక్తం చేశాడు. తను పనిచేస్తున్న టీమ్ లో అందరూ అమెరికన్లే ఉన్నారని, వారు తనను ఆఫీస్ మీటింగ్ లలో మాట్లాడడం మానేయాలని అడిగారని అతడు వెల్లడించాడు. “
అవమానంగా భావించాను..
ఈ రోజు, ఒక సమావేశంలో, నా సాధారణ బాధ్యతల్లో భాగంగా ప్రాజెక్ట్ అప్డేట్ కోసం ఒక టీమ్ సభ్యుడిని (సుమారు 55 సంవత్సరాలు) అడిగాను. నా యాస అర్థం కాకపోవడంతో సమావేశాల్లో మాట్లాడటం మానేయమని అతడు చెప్పాడు’’ అని ఆ భారతీయ ఉద్యోగి వెల్లడించాడు. తాను ఆ వ్యక్తితో చాలా సరళంగా, సూటిగా తన అభ్యర్థనను వెల్లడించానని అతను చెప్పాడు. ‘‘నా అసలు అభ్యర్థన కేవలం ప్రోగ్రెస్ అప్డేట్, దానితో పాటు ఉన్న చిత్రాల కోసం మాత్రమే. కాంట్రాక్టరుగా నా స్థానం, ఆ టీమ్ మెంబర్ వయసు దృష్ట్యా నా ప్రశ్న అతడిని ఇబ్బంది పెట్టి ఉండవచ్చు’’ అని ఆ ఉద్యోగి రెడ్డిట్ లో రాశాడు. ‘‘ చాలా అవమానంగా భావించాను. ఈ అనుభవం నన్ను చాలా బాధపెట్టింది’’ అని ఆ భారతీయ ఉద్యోగి రాసుకొచ్చారు.
ఇదే ఫస్ట్ టైమ్..
“నేను ఎల్లప్పుడూ స్పష్టంగా మరియు ప్రొఫెషనల్ గా కమ్యూనికేట్ చేయడానికి ప్రయత్నిస్తాను. ఏడాది కాలంగా నేను ఒకే క్లయింట్ తో కలిసి పని చేస్తున్నాను. నాతో ఇంతవరకు మరెవరూ ఇలాంటి మాటలు మాట్లాడలేదు’’ అని రెడ్డిట్ లో రాసిన పోస్ట్ లో ఆయన తెలిపారు. ఆ జట్టు సభ్యుడితో నేరుగా మాట్లాడొద్దని తన మేనేజర్ చెప్పినట్లు కామెంట్స్ సెక్షన్ లో పేర్కొన్నాడు. కాగా, విభిన్న యాసలు మరియు పనిప్రాంత మర్యాదల గురించి రెడ్డిట్ లో అతని పోస్ట్ చురుకైన చర్చకు దారితీసింది. ఒక నిర్దిష్ట ఉచ్ఛారణను అర్థం చేసుకోవడం కొన్నిసార్లు నిజంగా కష్టంగా ఉంటుంది కాబట్టి, తన టీమ్ సభ్యుడిని అర్థం చేసుకోవడానికిి ప్రయత్నించమని కొంతమంది ఆ ఉద్యోగికి సలహా ఇచ్చారు.
యాస అర్థం చేసుకోవడం కష్టమే..
“నేను ఒకసారి ఒక సమావేశాన్ని నిర్వహించాను, అక్కడ ఒక భారతీయ మహిళ తాను పనిచేస్తున్నదాన్ని, నా బృందం యొక్క ఉత్పత్తితో ఇంటిగ్రేషన్ గురించి అప్డేట్ ఇచ్చింది. కాల్ లో పెద్ద సంఖ్యలో ఉన్నతాధికారులు ఉన్నారు, మరియు ఆమె చెప్పిన ఒక్క పదం కూడా నాకు అర్థం కాలేదని నేను ప్రమాణం చేస్తున్నాను” అని ఒక రెడ్డిట్ యూజర్ గుర్తు చేసుకున్నాడు. తాను రష్యన్లు, వియత్నామీస్ తదితరులతో సమావేశాల్లో ఉన్నానని, వారు చెప్పిన ఒక్క మాట కూడా తనకు అర్థం కాలేదని, పదేపదే వివరణ అడగాల్సి వచ్చిందని మరొకరు చెప్పారు.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link