



ఎన్టీఆర్ జిల్లా / నందిగామ మండలం :
ది.12-9-2022(సోమవారం) ..
సంక్షేమానికి అర్థం చెప్పేలా ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలన ..
కేతవీరునిపాడు గ్రామంలో “గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమం”లో భాగంగా సంక్షేమ పథకాలను వివరిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు ..
నందిగామ మండలంలోని కేతవీరునిపాడు గ్రామంలో గడపగడపకు -మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా సోమవారం ఉదయం ప్రతి గడపకు వెళ్లి ప్రభుత్వం అందజేస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ – ప్రజల సమస్యలను శాసనసభ్యులు డాక్టర్ మొండితోక జగన్ మోహన్ రావు గారు అడిగి తెలుసుకున్నారు ..
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోను పవిత్ర గ్రంథం గా తలచి అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే 90 శాతం మేర హామీలు అమలు చేసిన ఏకైక ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అని తెలిపారు , గత ప్రభుత్వం కొన్ని సామాజిక వర్గాలకు మాత్రమే కొమ్ము కాసిందని, వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి అన్ని వర్గాలకు సముచిత స్థానం కల్పిస్తున్నారని తెలిపారు , ఎన్నికలలో ఇచ్చిన హామీలనే కాకుండా మరెన్నో సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి పేద బడుగు బలహీన వర్గాల ప్రజల జీవితాలకు ఆర్థిక భరోసా చేకూరేలా వైయస్ జగన్ పరిపాలన చేస్తున్నారని తెలిపారు ,ఒకపక్క వర్షం కురుస్తున్న ఎమ్మెల్యే డాక్టర్ జగన్ మోహన్ రావు గారు ప్రతి ఇంటి తలుపు తడుతూ వారితో మాట్లాడుతూ ప్రభుత్వం అమలు పరుస్తున్న సంక్షేమ పథకాల క్యాలెండర్ ను అందజేస్తూ ముందుకు సాగుతున్నారు ,
ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుందరమ్మ , జడ్పిటిసి గాదెల బాబు ,గ్రామ సర్పంచ్ నెలకుదుటి శిరీష , మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ గోనెల సీతారామయ్య ,మండల పార్టీ అధ్యక్షులు నెలకుదిటి శివ నాగేశ్వరరావు ,ఎమ్మార్వో , హౌసింగ్ ఏఈ, పలువురు ఎంపీటీసీలు ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు ..