కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక్, దీప మొహంమీదే తలుపేసిన శివ నారాయణ- వేరే దారిలేక ఇంట్లోంచి పారిపోయిన జ్యోత్స్న!

Best Web Hosting Provider In India 2024

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: కార్తీక్, దీప మొహంమీదే తలుపేసిన శివ నారాయణ- వేరే దారిలేక ఇంట్లోంచి పారిపోయిన జ్యోత్స్న!

Sanjiv Kumar HT Telugu

కార్తీక దీపం 2 సీరియల్ జూలై 19 ఎపిసోడ్‌లో కాశీకి కాల్ చేసి జ్యోత్స్న తిడుతుంది. కాశీ మాత్రం నువ్వే గౌతమ్ గాడి గురించి చెప్పు అని కాల్ కట్ చేస్తాడు. రాత్రిపూట ఎవరు లేనప్పుడు దొంగచాటుగా పారిపోతుంది జ్యోత్స్న. ఆ రాత్రికి ఇంట్లోనే ఉందామనుకున్న కార్తీక్, దీపను వెళ్లగొడతాడు శివ నారాయణ.

కార్తీక దీపం 2 సీరియల్ జూలై 19వ తేది ఎపిసోడ్

కార్తీక దీపం 2 సీరియల్‌ ఈరోజు ఎపిసోడ్‌లో కాశీతోనే జ్యోత్స్నకు దిమ్మతిరిగేపోయేలా చేశావ్ అని కార్తీక్‌ను మెచ్చుకుంటుంది దీప. ఇప్పటికీ కూడా జ్యోత్స్న వేరే దారి వెతుకుతుందని కార్తీక్ అంటాడు. మరోవైపు కాశీకి జ్యోత్స్న కాల్ చేస్తే కట్ చేసి కార్తీక్‌కు ఫోన్ చేసి చెబుతాడు. అప్పుడు మళ్లీ జ్యోత్స్న కాల్ చేస్తుందని చెబుతాడు.

బాగా మండుతున్నట్లుంది

కాల్ కాన్ఫరెన్స్‌లో పెట్టు, నేను లేనట్లు మాట్లాడు అని కార్తీక్ అంటాడు. దాంతో కాశీ అలాగే చేస్తాడు. ఏంట్రా నన్నే మోసం చేశావ్. గౌతమ్ గాడి ప్రూఫ్స్ అనుకున్నాను అని జ్యోత్స్న అంటే గౌతమ్ గురించి నాకు ఏం తెలియదు అని కాశీ అంటాడు. మరదలికి బాగా మండుతున్నట్లు ఉందని కార్తీక్ అనుకుంటాడు.

ఆడురా, మీ బావ చెప్పినట్లు వాడు. మీరంతా కలిసిపోతే నేను భయపడతాననుకుంటున్నారా. నీ దగ్గర గౌతమ్ గాడి వీడియోలు ఉన్నాయని నాకు తెలుసు అని జ్యోత్స్న అంటుంది. గౌతమ్ గాడి గురించి నీకు తెలుసు కాబట్టి నువ్వే చెప్పొచ్చుగా అని కాల్ కట్ చేస్తాడు కాశీ. అదే విషయం కార్తీక్‌తో చెబితే నేను చూసుకుంటాను అని కార్తీక్ అంటాడు.

ఇప్పుడు జ్యోత్స్న ఎంగేజ్‌మెంట్ ఆపడానికి ఏమైనా చేయొచ్చు. ఇవాళ ఇక్కడే ఉంటున్నాం. ఎవరికైనా ఏమైనా చేయొచ్చు. అందరిని కంట కనిపెట్టుకుంటేనే ఆపగలం, జ్యోత్స్న ఏ విధంగా తప్పించుకోకుండా చూడాలి. మనం ఎదురుచూస్తుంది రేపటికోసమే. మన ఫ్యామిలీని కాపాడుకుంటేనే తర్వాత జ్యోత్స్నను ఏం చేయాలో చెబుతాను అని కార్తీక్ అంటాడు.

రెండో భార్య వదిలేసింది

శ్రీధర్ ఇంటికి కాలింగ్ బెల్ కొట్టి మరి అడుక్కునేవాడు వస్తాడు. పది రూపాయలు ఇంగ్లీషులో అడుగుతాడు. తన భార్య వల్ల జరిగిన నష్టాల గురించి చెబుతాడు బెగ్గర్. శ్రీధర్ లానే బెగ్గర్ కూడా రెండో పెళ్లి చేసుకున్నట్లు, అది మొదటి పెళ్లానికి తెలిసినట్లు, ముందు అది వదిలేసింది, తర్వాత రెండో భార్య వదిలేసింది. సమాజమే వదిలేసింది. దాంతో ఇలా బిచ్చగాడిని అయ్యానని బెగ్గర్ చెబుతాడు.

ఈ కథ ఎవరికో దగ్గరిగా ఉన్నట్లుందని శ్రీధర్‌తో కావేరి అంటుంది. ఇద్దరి భార్యలతో పడటం కంటే నాకు ఇదే హాయిగా ఉంది. కానీ, మీరు పొరపాటున రెండో పెళ్లి చేసుకోకండి సర్ అని వార్నింగ్ ఇచ్చి వెళ్లిపోతాడు బెగ్గర్. పెళ్లాన్ని మోసం చేస్తే ఇలాంటి గతే పడుతుందని కావేరి అంటుంది.

పెళ్లి చేసుకున్న ఆడదానితో తల్లి, అక్క, చెల్లి, తోడి కోడళ్లతో గొడవలు అవుతాయి. అదంతా అమాయక భర్తపై పడుతుంది. మళ్లీ జన్మంటూ ఉంటే పెళ్లి చేసుకోను అని శ్రీధర్ అనుకుంటాడు. మరోవైపు కాశీ చేసినదాని గురించి జ్యో రగిలిపోతుంది. ఇదంతా కార్తీక్ గాడి మాయజాలమే అని పారు అంటుంది. మిమ్మల్ని రక్షించేవాడే లేడా అని జ్యోత్స్న అంటుంది.

నగలు పెట్టుకోకుంటే

ఇంతలో దీప వచ్చి అమ్మగారు పిలుస్తున్నారని చెబుతుంది. దాంతో సుమిత్ర దగ్గరికి జ్యో, పారు వెళ్తారు. నగలు చూపించి ఎంగేజ్‌మెంట్‌కు ఏది వేసుకుంటావో తీసి పెట్టుకో అని సుమిత్ర చెబుతుంది. ఇంతలో కార్తీక్ వచ్చి నిశ్చితార్థం ఎంత ఘనంగా జరుగుతుందో గొప్పగా చెబుతాడు కార్తీక్. నగలు పెట్టుకోకుంటే వాళ్లు ఏమనుకుంటారు అని జ్యోత్స్నను ఇరికిస్తాడు కార్తీక్.

ఇవి నానమ్మ ఇచ్చిన నగలు అట దీప చెబుతుంది. ఇంత సెంటిమెంట్ యాడ్ అవుతుంటే పెట్టుకోవచ్చుగా. ఏం జరిగినా నిశ్చితార్థం అయితే జరుగుతుంది అని కార్తీక్ అంటాడు. ఇరికించానని సంబరపడకు ఎలాగైనా తప్పించుకుంటాను అని జ్యోత్స్న మనసులో అనుకుంటుంది. అందరిని సుమిత్ర పంపించి తాను కూడా వెళ్లిపోతుంది. ఇప్పుడు నేను ఎలా తప్పించుకోవాలి అని జ్యో ఆలోచిస్తుంది.

మరోవైపు కార్తీక్, దీపను ఇంత టైమ్‌ అయిన ఉన్నారేంటీ అని శివ నారాయణ అడిగితే.. ఉదయమే నిశ్చితార్థం కదా. రావడానికి లేట్ అవుతుందని ఈరోజు రాత్రి ఇక్కడే ఉందామనుకుంటున్నాం అని కార్తీక్ చెబుతాడు. నాకు అభ్యంతరం ఉంది. మీరు వెళ్లండి. వెళ్తే డోర్ క్లోజ్ చేసుకుంటాను. ఉదయం కాస్తా త్వరగా రండి చాలు అని కార్తీక్, దీప మొహాలపైనే డోర్ వేస్తాడు శివ నారాయణ.

పారిపోయిన జ్యోత్స్న

ఈ రాత్రి ఏం జరుగుతుందో ఏంటో అని కార్తీక్ ఆలోచిస్తాడు. పద అని కార్తీక్, దీప వెళ్తారు. మరోవైపు రాత్రి జ్యోత్స్న దొంగచాటుగా ఎక్కడికో వెళ్తుంటే పారు చేయి పట్టుకుంటుంది. ఈ టైమ్‌లో ఎక్కడికే అని పారు అంటే పారిపోతున్నాను. పెళ్లి కూతురు పారిపోయింది. లేకుంటే లేచిపోయింది అనుకున్నావా అని జ్యో అంటుంది. అలా చేస్తే పరువు పోతుందే అని పారు అంటుంది.

నిజంగానే ఎవరితోనే లేచిపోయిందని అనుకుంటారే అని పారిజాతం అంటుంది. ఎవరేమనుకున్న నా సంతోషం నాకు ముఖ్యం. ఇంతకంటే వేరే దారిలేదు. నేను కనిపించకపోతే దీపనే చేసిందనుకుంటారు. వారం తర్వాత వస్తాను అని జ్యోత్స్న కారులో వెళ్లిపోతుంది.

ఇది పారిపోయి బాగానే ఉంది. కానీ, ముసలోడు నన్ను అంటాడు. ఏ.. నాలుగు తిట్లు తిందాం అని పారు అనుకుంటుంది. అక్కడితో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024