




Best Web Hosting Provider In India 2024

టీజీ ఈఏపీసెట్ కౌన్సెలింగ్ – 2025 : బీటెక్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు – సీఎస్‌ఈకి ఫుల్ డిమాండ్..!
టీజీ ఈఏపీసెట్ -2025 (ఇంజినీరింగ్ స్ట్రీమ్) ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయించారు. ఈ విడతలో 77,561 మంది విద్యార్థులు సీట్లు సాధించారు. అలాట్ మెంట్ కాపీని tgeapcet.nic.in/cand లింక్ తో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
ఇంజినీరింగ్ కాలేజీల్లో సీట్ల భర్తీకి ఈఏసీపెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఫస్ట్ ఫేజ్ సీట్లను కేటాయించారు. ఈ ఫేజ్ కింద 93.38 శాతం సీట్లు భర్తీ అయినట్లు అధికారులు ప్రకటించారు. 77,561 మంది విద్యార్థులు సీట్లు సాధించారు.
టీజీ ఈఏపీసెట్ ఫస్ట్ ఫేజ్ కింద సీట్లు పొందిన విద్యార్థులు… జూలై 22వ తేదీలోపు వెబ్ సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయకపోతే సీటు కేటాయింపును రద్దు చేస్తారు.
సీఎస్ఈకి పుల్ డిమాండ్…
గతంలో మాదిరిగానే ఈసారి కూడా సీఎస్‌ఈకి పుల్ డిమాండ్ ఉంది. ఆయా కోర్సుల్లో 58,742 సీట్లు ఉండగా 57,042 సీట్లు భర్తీ అయ్యాయి. కేవలం 1,700 సీట్లు మాత్రమే మిగిలాయి. మొత్తం 17 బ్రాంచులకు గాను ఆరు బ్రాంచుల్లో వందశాతం సీట్లు నిండినట్లు అధికారులు తెలిపారు. రెండు, మూడు బ్రాంచులు మినహా మిగిలిన అన్నీ కూడా 90 శాతానికి పైగా సీట్లు నిండాయి.
అలాట్‌మెంట్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి
- అభ్యర్థులు ముందుగా https://tgeapcet.nic.in/default.aspx వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోంపేజీలోని సీటు క్యాండెట్ లాగిన్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ లాగిన్ ఐడీ, హాల్ టికెట్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
- సబ్మిట్ చేస్తే మీకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా అలాట్ మెంట్ కాపీని పొందవచ్చు.
- ఈ విడతలో సీటు అలాట్ కాని వారు రెండో విడత కౌన్సెలింగ్ లో పాల్గొనాలి.
ఫస్ట్ ఫేజ్ కింద రిజిస్ట్రేషన్ చేసుకున్న వారిలో 16,793 మందికి సీట్లు దక్కలేదు. ఈ ఫేజ్ కింద 5,493 సీట్లు మిగిలినట్లు అధికారులు పేర్కొన్నారు. సివిల్, మెకానికల్ సంబంధిత 10 బ్రాంచీల్లో 7,100 సీట్లు ఉండగా…. 5,632 (79.32 శాతం) భర్తీ అయ్యాయి.
సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ తేదీలు :
జూలై 25 నుంచి బీటెక్ (ఈఏపీసెట్) సెకండ్ ఫేజ్ కౌన్సెలింగ్ ప్రారంభమవుతుంది. జూలై 26న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఉంటుంది. 26 నుంచి 27 వరకు వెబ్ ఆప్షన్లు ఎంచుకోవాలి. జూలై 30 లోపు సీట్లను కేటాయిస్తారు. ఆ తర్వాత ఫైనల్ ఫేజ్ ఉంటుంది.
టాపిక్