ఓటీటీలోకి 4 లేటెస్ట్ హారర్ థ్రిల్లర్స్- ఒకేరోజు ఒక్కదాంట్లోనే 3- కామెడీ, సైకలాజికల్, సస్పెన్స్ వేరు వేరు ఎలిమెంట్స్‌తో!

Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి 4 లేటెస్ట్ హారర్ థ్రిల్లర్స్- ఒకేరోజు ఒక్కదాంట్లోనే 3- కామెడీ, సైకలాజికల్, సస్పెన్స్ వేరు వేరు ఎలిమెంట్స్‌తో!

Sanjiv Kumar HT Telugu

ఓటీటీలోకి నాలుగు లేటెస్ట్ హారర్ థ్రిల్లర్ సినిమాలు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చేశాయి. ఆ హారర్ థ్రిల్లర్స్ అన్ని కూడా కామెడీ, సైకలాజికల్, సస్పెన్స్ వంటి వివిధ అంశాలతో తెరకెక్కించారు. అంతేకాకుండా ఒక్క ప్లాట్‌ఫామ్‌లోనే మూడు హారర్ థ్రిల్లర్ సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్ అవుతున్నాయి. ఆ సినిమాలేంటో చూద్దాం.

ఓటీటీలోకి 4 లేటెస్ట్ హారర్ థ్రిల్లర్స్- ఒకేరోజు ఒక్కదాంట్లోనే 3- కామెడీ, సైకలాజికల్, సస్పెన్స్ వేరు వేరు ఎలిమెంట్స్‌తో!

ఓటీటీలోకి ఈ వారం ఎన్నో రకాల జోనర్లలో సినిమాలు, వెబ్ సిరీస్‌లు డిజిటల్ స్ట్రీమింగ్‌కు వచ్చాయి. అయితే, వాటిలో నాలుగు హారర్ థ్రిల్లర్స్ ఇంట్రెస్టింగ్‌గా లేటెస్ట్‌గా ఓటీటీ రిలీజ్ అయ్యయి. ఈ నాలుగింటిలో మూడు ఒకే ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో డిజిటల్ ప్రీమియర్ అవుతున్నాయి. వివిధ ఎలిమెంట్స్‌తో ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన ఆ నాలుగు హారర్ థ్రిల్లర్స్ ఏంటో ఇక్కడ లుక్కేద్దాం.

ది భూత్నీ ఓటీటీ

హిందీలో హారర్ కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కిన సినిమా ది భూత్నీ. బాలీవుడ్ హాట్ బ్యూటి, నాగిని సీరియల్ హీరోయిన్ మౌనీ రాయ్, హీరో సంజయ్ దత్ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాకు కథ, దర్శకత్వం సిద్ధాంత్ సచ్‌దేవ్ అందించారు.

ది భూత్నీ సినిమాలో మౌనీ రాయ్, సంజయ్ దత్‌తోపాటు ఆది పురుష్ ఫేమ్ సన్నీ సింగ్, పలక్ తివారి, ఆసిఫ్ ఖాన్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషించారు. అయితే, మే 1న థియేటర్లలో విడుదలైన ఈ సినిమాకు అంతగా కలెక్షన్స్ రాలేదు. అలాగే, ఐఎమ్‌డీబీ నుంచి కూడా పదికి 4.6 రేటింగ్ సాధించుకుంది.

కామెడీ, హారర్, లవ్ అంశాలతో తెరకెక్కిన ది భూత్నీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. హిందీ, ఇంగ్లీష్ రెండు భాషల్లో జూలై 18న ది భూత్నీ ఓటీటీ రిలీజ్ అయింది. రెండు గంటల 10 నిమిషాల రన్ టైమ్ ఉన్న ది భూత్నీ టాక్ పరంగా పర్వాలేదనిపించుకుంది.

వాల్ టు వాల్ ఓటీటీ

ఈ ఏడాది కొరియన్‌లో విడుదలైన హారర్ థ్రిల్లర్ మూవీ వాల్ టు వాల్. ఈ హారర్ థ్రిల్లర్‌కు సైకలాజికల్ డ్రామాను యాడ్ చేశారు. ఓ ఇంట్లో ఉన్న హీరోకు గోడల నుంచి విచిత్రమైన శబ్ధాలు వినిపిస్తుంటాయి. ఆ శబ్ధాలు ఏంటీ, వాటి వెనుక ఉన్న మర్మం ఏంటీ అనేదే వాల్ టు వాల్ మూవీ.

నెట్‌ఫ్లిక్స్‌లో వాల్ టు వాల్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. కొరియన్, ఇంగ్లీష్, తమిళం వంటి ఇతర భాషల్లో నెట్‌ఫ్లిక్స్‌లో జూలై 18న వాల్ టు వాల్ ఓటీటీ రిలీజ్ అయింది.

డెలిరియమ్ ఓటీటీ

స్పానిష్ భాషలో తెరకెక్కిన హారర్ థ్రిల్లర్ సిరీస్ డెలిరియమ్. సస్పెన్స్ అంశాలతో తెరకెక్కిన హారర్ థ్రిల్లరే ఈ డెలిరియమ్. ఇంగ్లీష్, స్పానిష్ తదితర భాషల్లో జూలై 18 నుంచి డెలిరియమ్ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో డెలిరియమ్ ఓటీటీ రిలీజ్ అయింది.

ది కర్స్‌డ్ ఓటీటీ

ఇవాళ (జూలై 19) ఓటీటీ స్ట్రీమింగ్‌కు వచ్చిన హారర్ థ్రిల్లర్ ది కర్స్‌డ్. వణుకుపుట్టించే హారర్ సీన్లతో తెరకెక్కిన ది కర్స్‌డ్ నెట్‌ఫ్లిక్స్‌లో ఓటీటీ రిలీజ్ అయింది. హారర్ థ్రిల్లర్‌లో అడ్వెంచర్ ఎలిమెంట్స్ ఇష్టపడేవారికి ది కర్స్‌డ్ బెస్ట్ ఆప్షన్.

సంజీవ్ కుమార్ హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియ‌ర్ కంటెంట్ ప్రొడ్యూస‌ర్‌గా ప‌నిచేస్తున్నారు. ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్‌, ఆస్ట్రాలజీ, హెల్త్‌కు సంబంధించిన కథనాలు, మూవీ రివ్యూలు అందిస్తుంటారు. గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. డిజిటల్ జర్నలిజంలో 7 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. తెలంగాణ యూనివర్సిటీలో మాస్ క‌మ్యూనికేష‌న్ అండ్ జ‌ర్న‌లిజంలో పీజీ చేశారు. 2023 ఆగస్టులో హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో చేరారు.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024