




Best Web Hosting Provider In India 2024

హరి హర వీరమల్లు టికెట్ల ధరల పెంపు.. ఏపీలో ఒక్కో టికెట్‌పై ఎంత పెంచారంటే?
హరి హర వీరమల్లు టికెట్ల ధరలు భారీగా పెరిగాయి. తెలంగాణలో అనుమతి లేకపోవడంతో ఏపీలో ధరలు పెంచారు. గతంలోనే దీనికోసం ప్రభుత్వాన్ని అనుమతి కోరినట్లు మేకర్స్ వెల్లడించగా.. ఇప్పుడు అధికారికంగా ధరలు పెంచుతూ నిర్ణయం వెలువడింది.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన మూవీ హరి హర వీరమల్లు. ఈ సినిమా జులై 24న థియేటర్లలో రిలీజ్ కానుంది. పవన్ ఏపీ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇదే తొలి మూవీ కావడం విశేషం. ఈ సినిమా కోసం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో టికెట్ ధరలు పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
హరి హర వీరమల్లు టికెట్ల ధరలు ఇలా..
పవన్ కల్యాణ్ లీడ్ రోల్లో నటించిన మూవీ హరి హర వీరమల్లు సినిమా జులై 24న థియేటర్లలో రిలీజ్ కానుండగా.. ఐదు రోజుల ముందు టికెట్ల పెంపుపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ల ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో లోయర్ క్లాస్ కు రూ.100, అప్పర్ క్లాస్ కు రూ.150 వరకు పెంచుకోవచ్చని తెలిపింది.
ఇక మల్టీప్లెక్స్ లలో రూ.200 వరకు పెంచుకునే అవకాశం కల్పించింది. దీంతో సింగిల్ స్క్రీన్లలో గరిష్ఠంగా రూ.297, మల్టీప్లెక్స్ లలో రూ.377 వరకు టికెట్లు ధరలు పెరిగే అవకాశం కనిపిస్తోంది. పది రోజుల పాటు మాత్రమే పెరిగిన ధరలు అమల్లో ఉంటాయి. ఈ సినిమా ప్రీమియర్స్ తోపాటు టికెట్ల ధరలు పెంచుకునే అవకాశం కల్పించారు.
హరి హర వీరమల్లు రన్ టైమ్
ఇక హరి హర వీరమల్లు మూవీకి యూ/ఏ సర్టిఫికెట్ జారీ చేసినట్లు గతంలోనే మేకర్స్ వెల్లడించారు. పార్ట్ 1 స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ పేరుతో వస్తున్న ఈ సినిమా జులై 24న థియేటర్లలో రిలీజ్ కానున్న విషయం తెలిసిందే. 2 గంటల 42 నిమిషాల భారీ నిడివితో వస్తున్న ఈ సినిమా 17వ శతాబ్దపు మొఘల్ సామ్రాజ్య నేపథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ, క్రిష్ జాగర్లమూడి దర్శకులు.
చారిత్రక యోధుడు వీరమల్లు పాత్రలో పవన్ కల్యాణ్ కనువిందు చేయనున్నాడు. నిరంకుశత్వానికి వ్యతిరేకంగా.. న్యాయం, ధర్మం కోసం పోరాడిన వీరుడి ప్రయాణాన్ని ఈ చిత్రంలో చూడబోతున్నాం. బాబీ డియోల్ విలన్ గా కనిపించనున్న ఈ సినిమాలో నిధి అగర్వాల్, నర్గీస్ ఫఖ్రీ, నోరా ఫతేహి వంటి వాళ్లు నటించారు. ఆస్కార్ విజేత ఎం.ఎం. కీరవాణి సంగీతం సమకూర్చారు.
హరి హర వీరమల్లు ప్రీరిలీజ్ ఈవెంట్
హరి హర వీరమల్లు ప్రీరిలీజ్ ఈవెంట్ జులై 20న వైజాగ్ లో జరగనుంది. దీనికోసం మేకర్స్ భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. పెద్ద సంఖ్యలో పవన్ అభిమానులు ఈ ఈవెంట్ కు తరలి రానున్నారు. తిరుపతి, విజయవాడలలో ఈ ఈవెంట్ జరగనున్నట్లు మొదట వార్తలు వచ్చినా.. తర్వాత విశాఖపట్నానికి మార్చారు.
రెండేళ్ల తర్వాత పవన్ మూవీ వస్తుండటం, అందులోనూ ఇప్పుడు అతడు ఏపీకి డిప్యూటీ సీఎంగా ఉండటంతో ఈ హరి హర వీరమల్లు మూవీ చాలా ప్రత్యేకంగా నిలవనుంది. ఈ నేపథ్యంలో ప్రీరిలీజ్ ఈవెంట్ ఓ రేంజ్ లో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది.
పవన్ కెరీర్లోనే అత్యధిక బిజినెస్
హరి హర వీరమల్లు మూవీపై ఉన్న అంచనాల నేపథ్యంలో ఈ సినిమా భారీగా ప్రీరిలీజ్ బిజినెస్ చేసింది. పవన్ కల్యాణ్ కెరీర్లో అత్యధికంగా తెలుగు రాష్ట్రాల్లో ఏకంగా రూ.150 కోట్ల బిజినెస్ చేయడం విశేషం. దీంతో మూవీ హిట్ గా నిలవాలంటే అదే స్థాయిలో వసూళ్లు కూడా చేయాల్సి ఉంది. పవన్ చరిష్మాతో భారీ ఓపెనింగ్స్ ఖాయం.
అయితే తొలి షో నుంచే కాస్త పాజిటివ్ టాక్ వచ్చినా.. ఆ మార్క్ ను అందుకుంటుందన్న నమ్మకంతో మేకర్స్ ఉన్నారు. ఇక ఇప్పటికే ప్రైమ్ వీడియో ఈ మూవీ డిజిటల్ హక్కులను భారీ మొత్తానికి సొంతం చేసుకుంది. అటు ‘హరి హర వీరమల్లు’ మూవీకి ఇప్పటికే సెన్సార్ బోర్డు సభ్యుల నుంచి కూడా ప్రశంసలు దక్కాయి. దీంతో ఈ సినిమా ప్రేక్షకులను కచ్చితంగా ఆకట్టుకుందన్న నమ్మకంతో మేకర్స్ ఉన్నారు.
సంబంధిత కథనం