




Best Web Hosting Provider In India 2024

అన్యమత ఉద్యోగులపై సస్పెన్షన్ వేటు – టీటీడీ ప్రకటన
టీటీడీ సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీలో పనిచేస్తున్న నలుగురు అన్యమత ఉద్యోగులను సస్పెండ్ చేసింది. విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదిక ఆధారంగా చర్యలు తీసుకున్నట్లు ప్రకటన విడుదల చేసింది.
తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు సంచలన నిర్ణయం తీసుకుంది. టీటీడీలో పనిచేస్తున్న నలుగురు అన్యమత ఉద్యోగస్తులను సస్పెండ్ చేసింది. ఈ మేరకు ప్రకటనను విడుదల చేసింది.
నలుగురిపై వేటు…
సస్పెండ్ అయిన వారిలో బి.ఎలిజర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (క్వాలిటీ కంట్రోల్), ఎస్. రోసి (స్టాప్ నర్స్) బర్డ్ ఆసుపత్రి, ఎం.ప్రేమావతి, (గ్రేడ్ -1 ఫార్మసిస్ట్ బర్డ్ ఆసుపత్రి), అదేవిధంగా డా.జి.అసుంత (ఎస్వీ ఆయుర్వేద) ఉన్నారు.
సదరు నలుగురు ఉద్యోగులు క్రిస్టియన్ మతాన్ని అనుసరిస్తున్నారని అందుకు సంబంధించిన ఆధారాలు ,వచ్చిన ఆరోపణల నేపథ్యంలో వారిని సస్పెండ్ చేయడం జరిగిందని టీటీడీ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.
సదరు ఆరోపణల నేపథ్యంలో టీటీడీ ఉద్యోగులు పనిచేస్తూ సంస్థ ప్రవర్తనా నియమావళిని పాటించలేదని గుర్తించామని టీటీడీ వివరించింది. హిందూ ధార్మిక సంస్థకు ప్రాతినిధ్యం వహించే ఉద్యోగులుగా విధులు నిర్వర్తిస్తూ భాద్యతా రహితంగా వ్యవహరించడం జరిగిందని పేర్కొంది.
ఈ క్రమంలో టీటీడీ విజిలెన్స్ విభాగం సమర్పించిన నివేదికను, ఇతర ఆధారాలను పరిశీలించిన అనంతరం నిబంధనల ప్రకారం వారిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నట్లు టీటీడీ తెలిపింది. ఇందులో భాగంగానే సదరు నలుగురు ఉద్యోగులను తక్షణమే సస్పెండ్ చేయడం జరిగిందని చెప్పింది.
ఫేక్ అకౌంట్ – ఖండించిన టీటీడీ:
టీటీడీ ఈవో జె. శ్యామలరావు పేరుతో సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్ అయిన ఫేస్‌బుక్‌లో గుర్తుతెలియని వ్యక్తులు నకిలీ ఖాతాను సృష్టించారని టీటీడీ ఓ ప్రకటన ద్వారా తెలిపింది. భక్తులకు సందేశాలు పంపుతూ డబ్బులు కావాలని కోరుతున్నట్లు తమ దృష్టికి వచ్చినట్లు పేర్కొంది. ఇది పూర్తిగా మోసగాళ్ల నకిలీ చర్యగా గుర్తించడం జరిగిందని వివరించింది.
భక్తులు ఇటువంటి నకిలీ అకౌంట్లకు దూరంగా ఉండాలని కోరింది. ఎవరికైనా ఇలాంటి సందేహాస్పద సందేశాలు వస్తే వెంటనే టీటీడీ విజిలెన్స్ విభాగానికి చెందిన సెల్ నెం: 9866898630, లేదా టీటీడీ టోల్ ఫ్రీ నెం 18004254141 కు ఫోన్ చేసి సమాచారం తెలియజేయాలని విజ్ఞప్తి చేసింది..
భక్తులు కేవలం టీటీడీ అధికారిక వెబ్‌సైట్ www.tirumala.org లేదా సోషల్ మీడియా అధికారిక ఖాతాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని విజ్ఞప్తి చేసింది.
టాపిక్