





Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి నిన్న రిలీజైన జూనియర్.. గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడి తొలి సినిమాకు మిక్స్‌డ్ టాక్.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
ఓటీటీలోకి జూనియర్ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ప్రముఖ వ్యాపారవేత్త గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అయిన తొలి సినిమా జూనియర్ నిన్న థియేటర్లలో విడుదలై మిక్స్‌డ్ టాక్ తెచ్చుకుంటోంది. శ్రీలీల హీరోయిన్‌గా చేసిన జూనియర్ ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్ ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఓటీటీలోకి ఎలాంటి సమయాల్లో సినిమాలు స్ట్రీమింగ్ అవుతున్నాయో తెలియడం లేదు. ఇటీవల కాలంలో సూపర్, బ్లాక్ బస్టర్ హిట్, ఫ్లాప్, డిజాస్టర్ అంటూ తేడాలు లేకుండా ఇన్ని రోజుల సమయం అనే బేధం లేకుండా సినిమాలు ఓటీటీ రిలీజ్ అవుతున్నాయి.
కర్ణాటక మాజీ మంత్రి కుమారుడు
అందుకే కొత్తగా థియేటర్లలో విడుదలైన ప్రతి సినిమా ఓటీటీ స్ట్రీమింగ్‌పై ఆసక్తి నెలకొంటుంది. ఈ క్రమంలోనే ఓటీటీ రిలీజ్‌పై ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్న సినిమా జూనియర్. ప్రముఖ వ్యాపారవేత్త, కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్ రెడ్డి కుమారుడు కిరీటి రెడ్డి హీరోగా పరిచయం అయిన తొలి సినిమానే జూనియర్.
వైరల్ వయ్యారి సాంగ్‌తో
జూనియర్ సినిమాలో కిరీటి రెడ్డికి జోడీగా హీరోయిన్ శ్రీలీల చేసింది. అంతేకాకుండా కిరీటి, శ్రీలీల డ్యాన్స్‌తో ఇరగదీసిన వైరల్ వయ్యారి సాంగ్ సూపర్ హిట్ అయింది. దీంతో జూనియర్ మూవీపై అంచనాలు పెరిగాయి. భారీ అంచనాల నేపథ్యంలోనే నిన్న అంటే జులై 18న థియేటర్లలో గ్రాండ్‌గా రిలీజ్ అయింది జూనియర్ మూవీ.
రొటీన్ కమర్షియల్ హంగులు
కానీ, జూనియర్ సినిమాకు ఆడియెన్స్ నుంచి మిక్స్‌డ్ టాక్ వచ్చింది. రొటీన్ టెంప్లేట్‌లో తెరకెక్కిన పక్కా రెగ్యులర్ కమర్షియల్ మూవీ జూనియర్ అని ప్రేక్షకులు భావించారు. కామెడీ, యాక్షన్ సీన్స్, ఎమోషన్స్, సెంటిమెంట్, లవ్ వంటి పక్కా కమర్షియల్ హంగులతో జూనియర్‌ను డైరెక్టర్ రాధా కృష్ణ రెడ్డి తెరకెక్కించారని రివ్యూలు వచ్చాయి.
కిరీటి రెడ్డికి ప్రశంసలు
అయితే, హీరోగా కిరీటి రెడ్డి చాలా ఇంప్రెస్ చేశాడని ప్రశంసలు వచ్చాయి. డ్యాన్స్, యాక్టింగ్, యాక్షన్, ఎమోషనల్ సీన్స్‌లో చాలా వరకు మెప్పించాడని కామెంట్స్ వినిపించాయి. ఈ నేపథ్యంలో జూనియర్ ఓటీటీ స్ట్రీమింగ్‌పై క్యూరియాసిటీ నెలకొంది. ఓటీటీలోకి జూనియర్ రానుందని టాక్ నడుస్తోంది.
అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో
జూనియర్ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ భారీ ధర వెచ్చించి కొనుగోలు చేసిందని సమాచారం. అయితే, అది ఎంత మొత్తం అనే విషయం బయటకు రాలేదు. కానీ, జూనియర్ ఓటీటీ రిలీజ్ ప్లాట్‌ఫామ్ మాత్రం అమెజాన్ ప్రైమ్ వీడియో అని తెలుస్తోంది. థియేట్రికల్ రన్ ముగిసిన తర్వాత జూనియర్ ఓటీటీలోకి వచ్చేయనుంది.
కలెక్షన్స్ పరంగా
అంతేకాకుండా సినిమాకు వచ్చే కలెక్షన్స్, టాక్ పరంగా కూడా జూనియర్ ఓటీటీ రిలీజ్ డేట్‌లో మార్పులు జరిగే అవకాశం ఉంది. ట్రేడ్ అనిలిస్ట్‌ల అంచనా ప్రకారం ఆగస్ట్ నెలలోనే జూనియర్ ఓటీటీ స్ట్రీమింగ్ కానుందని సమాచారం.
సంబంధిత కథనం
టాపిక్