





Best Web Hosting Provider In India 2024

నగలు వేసుకున్న మలయాళ సూపర్ స్టార్.. రియల్ మ్యాన్ అంటున్న ఫ్యాన్స్.. వైరల్ అవుతున్న యాడ్
మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ తాజాగా ఓ జ్యువెలరీ యాడ్‌లో నటించాడు. ‘విన్స్‌మెరా జ్యువెలరీస్’ అనే యూట్యూబ్ ఛానెల్ విడుదల చేసిన ఈ యాడ్ ఇప్పుడు ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోంది. అతడో రియల్ మ్యాన్ అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రముఖ నటుడు మోహన్‌లాల్ తాజాగా ఒక జ్యువెలరీ యాడ్‌లో తన అద్భుతమైన నటనతో ఇంటర్నెట్‌ను ఆకట్టుకున్నాడు. విన్స్‌మెరా జ్యువెలరీస్ తమ యూట్యూబ్ ఛానెల్‌లో విడుదల చేసిన ఈ కొత్త యాడ్‌లో.. మోహన్‌లాల్ నగలు ధరించి, డ్యాన్స్ చేస్తూ డిఫరెంట్ గా కనిపించాడు. ఇప్పుడీ వీడియో ఇంటర్నెట్ లో సెన్సేషనల్ గా మారింది.
మోహన్‌లాల్ నగలు, డ్యాన్స్
మలయాళ స్టార్ హీరో మోహన్‌లాల్ ఏం చేసినా ప్రత్యేకమే. అంత పెద్ద సూపర్ స్టార్ స్టేటస్ ఉండి కూడా తాజాగా తాను చేసిన ఓ జువెలరీ యాడ్ సంచలనం రేపుతోంది. ఈ యాడ్ మొదట్లో అందరూ పరిచయాలతో బిజీగా ఉండగా, మోహన్‌లాల్ ఒక జ్యువెలరీ సెట్‌ను చూసి ముచ్చటపడి.. దానిని తీసుకొని రహస్యంగా తన వానిటీ వ్యాన్‌లోకి వెళ్తాడు. ఆ జ్యువెలరీ సెట్ కనిపించకపోవడంతో, చిత్రబృందం దాని కోసం అన్ని చోట్లా వెతుకుతుంది.
మోహన్‌లాల్ తన షర్ట్ ప్యాంటుకు తగినట్లుగా ఆభరణాలు – నెక్లెస్, బ్రేస్‌లెట్, ఉంగరం – ధరించి కనిపిస్తాడు. అతను సాంప్రదాయ సంగీతానికి నృత్యం చేస్తుండగా, డైరెక్టర్ షాక్ అయి అతని వ్యాన్‌లోకి దూసుకువస్తాడు. ఆ సమయంలో మోహన్‌లాల్ సరదాగా నవ్వుతూ కనిపిస్తాడు.
మోహన్‌లాల్ యాడ్‌పై ఇంటర్నెట్ స్పందన
ఈ వీడియోలోని కామెంట్ సెక్షన్‌లోకి వెళితే, ఒక అభిమాని ఇలా అన్నారు.. “ఖచ్చితంగా అద్భుతం. అతనిలా ఫెమినిటీ, మస్కులినిటీని అంత అందంగా మరెవరూ చూపలేరు” అని అనడం విశేషం. మరో కామెంట్ ఇలా ఉంది. “మోహన్‌లాల్… మరోసారి జ్యువెలరీ ప్రకటనల సాంప్రదాయ కాన్సెప్ట్‌లన్నింటినీ బద్దలు కొట్టారు” అని అన్నారు.
ఒక వ్యక్తి ఇలా రాశారు. “ఎంత గొప్ప నటుడు! ఎంత సొగసు. అతను నిజంగా దీనిని అద్భుతంగా ప్రదర్శించాడు” “అతను తన స్త్రీ గుణాలను అందంగా ఆలింగనం చేసుకున్నాడు. ఆ చేతి కదలికలు!” అని మరొకరు అన్నారు. “ఇలాంటి అసాధారణమైన సన్నివేశాన్ని తెరపై చేసే ధైర్యం ఒక నిజమైన మగాడికి మాత్రమే ఉంటుంది. అన్ని సంప్రదాయ నమ్మకాలను బద్దలు కొట్టినందుకు మోహన్‌లాల్ సర్, ధన్యవాదాలు! మీకు అభినందనలు!” అని మరో అభిమాని కామెంట్ చేశారు.
“మోలీవుడ్‌లో తానెందుకు సుప్రీం అని మోహన్‌లాల్ అందరికీ గుర్తు చేస్తున్నారు. ఒక స్త్రీ పాత్రను కూడా తాను చేయగలనని మోహన్‌లాల్ నిరూపించారు” అని మరొక వ్యక్తి అన్నారు. మరో అభిమాని ఇలా అన్నారు.. “నాకు చాలా నచ్చింది. ఈ మనిషి నిజంగానే GOAT (గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్). ఎంతో అందంగా చేసారు, నా జీవితంలో ఒక యాడ్‌ను ఇన్నిసార్లు చూడటం ఇదే మొదటిసారి” “అసలు ఊహించలేదు. చాలా నచ్చింది” అని మరొక కామెంట్ ఉంది.
మోహన్‌లాల్ గురించి..
నటుడు మోహన్‌లాల్ చివరిసారిగా తరుణ్ మూర్తి దర్శకత్వం వహించిన ‘తుడరుమ్‘ చిత్రంలో కనిపించారు. ‘కన్నప్ప’లో కూడా ఆయన అతిథి పాత్ర పోషించారు. మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ‘దృశ్యం 3’లో ఆయన కనిపించనున్నారు. ఈ చిత్రం ఈ సంవత్సరం అక్టోబర్‌లో థియేటర్లలోకి రానుంది. అలాగే, నంద కిషోర్ దర్శకత్వం వహించిన ‘వృషభ’లో కూడా నటించారు. ఇది అక్టోబర్ 16న విడుదల కానుంది.
సంబంధిత కథనం