





Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి ఇవాళ వచ్చేసిన మెడికల్ క్రైమ్ థ్రిల్లర్.. పురిటిలోనే బిడ్డను మార్చే స్కామ్.. 7.9 రేటింగ్.. ఐదు భాషల్లో!
ఓటీటీలోకి ఇవాళ మెడికల్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ డీఎన్ఏ. ఐఎమ్‌డీబీ నుంచి 7.9 రేటింగ్ సాధించుకున్న ఈ తమిళ థ్రిల్లర్ మూవీని నిన్ననే (జూలై 18) థియేటర్లలో తెలుగులో మై బేబీ టైటిల్‌తో విడుదల చేశారు. దీంతో ఇవాళ ఐదు భాషల్లో డీఎన్ఏ ఓటీటీ స్ట్రీమింగ్ అవడం ఇంట్రెస్టింగ్‌గా మారింది.
ఓటీటీలో ఎన్నో రకాల సినిమాలు ప్రతి వారం డిజిటల్ స్ట్రీమింగ్ అవుతూనే ఉంటాయి. అయితే, థియేటర్లలో విడుదలైన సినిమాలు నెల లేదా 20 ఇలా కొన్ని రోజుల్లో ఓటీటీ రిలీజ్ అవుతుంటాయి. కానీ, థియేటర్లలో విడుదలైన మరుసటి రోజే ఓటీటీలోకి రావడం చాలా అరుదైన విషయం. అలాంటిదే తాజాగా ఈ సినిమాకు జరిగింది.
మెడికల్ క్రైమ్ థ్రిల్లర్
ఆ సినిమానే డీఎన్ఏ. తమిళంలో మెడికల్ క్రైమ్ థ్రిల్లర్‌గా తెరెక్కిన సినిమా డీఎన్ఏ. అథర్వ మురళి (గద్దలకొండ గణేష్ ఫేమ్), నిమిషా సజయన్ హీరో హీరోయిన్స్‌గా నటించగా.. రమేష్ తైలాక్ (టూరిస్ట్ ఫ్యామిలీ ఫేమ్), మొహమ్మద్ జీషన్ అయూబ్, రిత్విక, విజి చంద్రశేఖర్, బోస్ వెంకట్, బాలాజీ శక్తివేల్ తదతరులు ఇతర కీలక పాత్రలు పోషించారు.
నెల్సన్ వెంకటేశన్ దర్శకత్వం వహించిన డీఎన్ఏ తమిళంలో జూన్ 20న థియేటర్లలో విడుదలై మంచి ప్రశంసలు దక్కించుకుంది. సూపర్ హిట్ థ్రిల్లర్‌గాపేరు తెచ్చుకున్న డీఎన్ఏ సినిమాకు ఐఎమ్‌డీబీ నుంచి పదికి 7.9 రేటింగ్ సాధించుకుంది. ఈ సినిమాకు ప్రశంసలు రావడంతో తెలుగులో థియేటర్లలో రిలీజ్ చేశారు.
ఇవాళ ఓటీటీలోకి
డీఎన్ఏ సినిమాను మై బేబీగా జూలై 18న థియేటర్లలో విడుదల చేశారు. కానీ, థియేటర్లలో విడుదలైన మరుసటి రోజే అంటే ఇవాళ (జూలై 19) డీఎన్ఏ ఓటీటీలోకి వచ్చేసింది. అది కూడా తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళం వంటి ఐదు భాషల్లో మై బేబీ ఓటీటీ స్ట్రీమింగ్ అవుతోంది.
జియో హాట్‌స్టార్‌లో డీఎన్ఏ, మే బేబీ అనే రెండు టైటిల్స్‌తో ఈ సినిమా డిజిటల్ ప్రీమియర్ అవుతోంది. నిన్న థియేటర్లలో విడుదలై ఇవాళ ఓటీటీ రిలీజ్ కావడంతో డీఎన్ఏ సినిమా ఇంట్రెస్టింగ్‌గా మారింది. ఇకపోతే డీఎన్ఏ సినిమా ఒక మెడికల్ క్రైమ్ థ్రిల్లర్. సైకలాజికల్, యాక్షన్ అంశాలను కూడా కాస్తా టచ్ చేశారు.
పురిటిలోనే బిడ్డను మార్చే స్కామ్
హాస్పిటల్‌లో పుట్టిన బిడ్డలను పురిటిలో మార్చే స్కామ్ గురించి ఈ సినిమా సాగుతుంది. ఆనంద్ బ్రేకప్ కావడంతో తాగుడుకు బానిస అవుతాడు. కుటుంబ సభ్యుల బలవంతంతో రిహాబిలిటేషన్ సెంటర్‌కు వెళ్లి చికిత్స తీసుకుంటాడు. పెళ్లి చేస్తే దారిలోకి వస్తాడని దివ్యను ఆనంద్‌కు ఇచ్చి పెళ్లి చేస్తారు.
అయితే, దివ్య ఓ మానసిక సమస్యతో దివ్య బాధపడుతుందని తెలిసిన ఆనంద్ పెళ్లి చేసుకుంటాడు. ఇద్దరికి కొన్ని నెలలకు బాబు పుడతాడు. ఇంక్యుబేటర్‌లో బాబును పెట్టి తీసుకొచ్చేసరికి తనకు పుట్టిన బాబు కాదని దివ్య గొడవ చేస్తుంది. ఆ తర్వాత ఏమైందనేదే డీఎన్ఏ తెలుగులో మై బేబీ కథ.
సంబంధిత కథనం
టాపిక్