




Best Web Hosting Provider In India 2024
ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ 2025 ‘ఆన్సర్ కీ’ని ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి..
ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ 2025 ఆన్సర్‌కి విడుదల కావాల్సి ఉంది. ఆన్సర్‌కి ఎక్కడ, ఎలా చెక్ చేసుకోవాలి? పూర్తి వివరాలను ఇక్కడ చూసేయండి..
ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ 2025 రాత పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీ కోసం అభ్యర్థులు ఎదురుచూస్తున్నారు. కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాసిన అభ్యర్థులు, ఆన్సర్ కీ విడుదలైన తర్వాత ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్ joinindianarmy.nic.inలో చూడవచ్చు.
ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ 2025 పరీక్ష జూన్ 30 నుంచి జులై 10, 2025 వరకు జరిగింది. కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ 13 భాషల్లో (అంటే ఇంగ్లీష్, హిందీ, మలయాళం, కన్నడ, తమిళం, తెలుగు, పంజాబీ, ఒడియా, బెంగాలీ, ఉర్దూ, గుజరాతీ, మరాఠీ, అస్సామీ) నిర్వహించారు. ఆన్‌లైన్ టెస్ట్ ఆబ్జెక్టివ్ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్ పద్ధతిలో జరిగింది. దరఖాస్తు చేసిన కేటగిరీని బట్టి, అభ్యర్థులు ఒక గంటలో 50 ప్రశ్నలకు లేదా రెండు గంటల్లో 100 ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.
ఇండియన్ ఆర్మీ అగ్నివీర్ ఆన్సర్ కీ 2025: ఎలా డౌన్‌లోడ్ చేయాలి?
ప్రొవిజనల్ ఆన్సర్ కీని డౌన్‌లోడ్ చేసుకోవడానికి అభ్యర్థులు కింద ఇచ్చిన స్టెప్స్‌ని అనుసరించవచ్చు:
స్టెప్ 1- ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్ joinindianarmy.nic.in ని సందర్శించండి.
స్టెప్ 2- హోమ్ పేజీలో కనిపించే “Indian Army Agniveer Answer Key 2025” లింక్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 3- కొత్త పేజీ ఓపెన్ అవుతుంది. అక్కడ అభ్యర్థులు తమ లాగిన్ వివరాలను నమోదు చేయాలి.
స్టెప్ 4- సబ్‌మిట్ అనే బటన్‌పై క్లిక్ చేయండి. అప్పుడు మీ ఆన్సర్ కీ డిస్‌ప్లే అవుతుంది.
స్టెప్ 5- ఆన్సర్ కీని చెక్ చేసుకుని, డౌన్‌లోడ్ చేసుకోండి.
స్టెప్ 6- భవిష్యత్ అవసరాల కోసం దాని హార్డ్ కాపీని మీ వద్ద ఉంచుకోండి.
మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఇండియన్ ఆర్మీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.
ఆన్సర్ కీ వెలువడిన అనంతరం అగ్నివీర్ ఫలితాలను ప్రకటిస్తారు. ఫలితాల తేదీపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఏఐఎఫ్ అగ్నివీర్ వాయు రిక్రూట్మెంట్ 2025 వివరాలు..
అగ్నివీర్ వాయు 2025 పోస్టుల భర్తీకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతంది. అర్హులైన అభ్యర్థులు ఐఏఎఫ్ అగ్నిపథ్‌వాయు అధికారిక వెబ్‌సైట్ agnipathvayu.cdac.in ద్వారా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జులై 31, 2025గా ఉంది. ఎంపిక పరీక్షలు సెప్టెంబర్ 25, 2025 నుంచి నిర్వహిస్తారు.
ఐఏఎఫ్ అగ్నివీర్ వాయు 2025 పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థి జులై 2, 2005- జనవరి 2, 2009 (రెండు తేదీలు కలిపి) మధ్య జన్మించి ఉండాలి. ఒకవేళ అభ్యర్థి ఎంపిక ప్రక్రియలోని అన్ని దశలను పూర్తి చేసినట్టైతే, నమోదు చేసుకునే తేదీ నాటికి గరిష్ట వయోపరిమితి 21 సంవత్సరాలు ఉండాలి.
ఐఏఎఫ్ అగ్నివీర్ వాయు రిక్రూట్మెంట్ 2025 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
సంబంధిత కథనం
Best Web Hosting Provider In India 2024
Source link
