




Best Web Hosting Provider In India 2024

టీజీ ఈసెట్ కౌన్సెలింగ్ – 2025 : ఫైనల్ ఫేజ్ సీట్ల కేటాయింపు – మీ అలాట్ మెంట్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి
టీజీ ఈసెట్ – 2025 ఫైనల్ ఫేజ్ సీట్లను కేటాయించారు. వెబ్ ఆప్షన్లు ఎంచుకున్న అభ్యర్థులు https://tgecet.nic.in/ వెబ్ సైట్ నుంచి అలాట్ మెంట్ కాపీని పొందవచ్చు. ఈనెల 22వ తేదీలోపు సీట్లు పొందిన విద్యార్థులు ఆయా కళాశాలల్లో రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
బీటెక్, బీఫార్మసీ రెండో సంవత్సరంలో చేరేందుకు(లేటరల్ ఎంట్రీ) ఈసెట్ – 2025 ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా చివరి విడత సీట్లను కేటాయించారు. ఈ ఫేజ్ కింద సీట్లు పొందిన విద్యార్థులు….వెబ్ సైట్ ద్వారా రిపోర్టింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇవాళ ఆ ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. ఇక జూలై 22లోపు సీటు పొందిన కాలేజీల్లో రిపోర్టింగ్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
టీజీ ఈసెట్ – 2025 ద్వారా ఇంజినీరింగ్‌లో 12,618, బీఫార్మసీలో 1,287 సీట్లు భర్తీ అయ్యాయి. ఇంకా బీటెక్‌లో 2,489, బీఫార్మసీలో 1,230 సీట్లు మిగిలిపోయినట్లు అధికారులు ప్రకటించారు. సీట్లు పొందిన విద్యార్థులు https://tgecet.nic.in/ వెబ్ సైట్ నుంచి అలాట్ మెంట్ కాపీని పొందవచ్చు.
అలాట్ మెంట్ ఇలా డౌన్లోడ్ చేసుకోండి
- విద్యార్థులు https://tgecet.nic.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని క్యాండెట్ లాగిన్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ లాగిన్ ఐడీ, హాల్ టికెట్ నెంబర్, పాస్ వర్డ్, పుట్టిన తేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
- సబ్మిట్ చేస్తే మీ అలాట్ మెంట్ కాపీ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
తెలంగాణ ఈసెట్ 2025 స్పాట్ అడ్మిషన్లకు సంబంధించి జులై 22వ తేదీన మార్గదర్శకాలను జారీ చేస్తారు. జూలై 29వ తేదీలోపు సీట్ల అలాట్ మెంట్ ప్రక్రియ పూర్తవుతుంది.
టీజీ ఈసెట్ ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి:
- ముందుగా అధికారిక వెబ్ సైట్ https://ecet.tgche.ac.in/ పై క్లిక్ చేయండి.
- హోంపేజీలో కనించే ర్యాంక్ కార్డు ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- ఇక్కడ విద్యార్థి హాల్ టికెట్ నెంబర్, రిజిస్ట్రేషన్ నెంబర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
- సబ్మిట్ బటన్ పై నొక్కితే ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ పై నొక్కి కాపీని పొందవచ్చు.
టాపిక్