





Best Web Hosting Provider In India 2024

హీరో రామ్ రాసిన లవ్ మెలోడీ.. అనిరుధ్ వాయిస్ మ్యాజిక్.. ఆంధ్ర కింగ్ తాలూకా మూవీ నుంచి నువ్వుంటే చాలే సాంగ్ లిరిక్స్
టాలీవుడ్ ఎనర్జిటిక్ స్టార్ పోతినేని రామ్ లిరిసిస్ట్ గా మారాడు. మనసును తాకే లవ్ మెలోడీ సాంగ్ రాశాడు. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా నుంచి నువ్వుంటే చాలే అంటూ సాగే పాట ఇప్పుడు తెగ ట్రెండ్ అవుతోంది. ఈ సాంగ్ లిరిక్స్ మీకోసం.
నువ్వుంటే చాలే.. ఇప్పుడు యూట్యూబ్ లో, సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న పాట ఇది. ఈ లవ్ మెలోడీ సాంగ్ ఇంటర్నెట్ ను ఊపేస్తోంది. పోతినేని రామ్ హీరోగా యాక్ట్ చేస్తున్న ‘ఆంధ్ర కింగ్ తాలూకా’ మూవీ నుంచి రిలీజైన ఈ సాంగ్ ఒక్క రోజులోనే తెగ హల్ చల్ చేస్తోంది. యూట్యూబ్ లో ట్రెండింగ్ అవుతోంది. ఈ సాంగ్ లిరిక్స్ ఇక్కడ చూసేయండి.
హీరో రాసిన పాట
ఆంధ్ర కింగ్ తాలూకా నుంచి శుక్రవారం (జులై 18) రిలీజైన ‘నువ్వుంటే చాలే’ సాంగ్ అదరగొడుతోంది. ఈ పాటను స్వయంగా హీరో పోతినేని రామ్ రాయడం విశేషం. లిరిసిస్ట్ గా రామ్ డెబ్యూ చేశాడు. అతను రాసిన పదాలు మనసులను హత్తుకుంటున్నాయి. ఈ సాహిత్యానికి అనిరుధ్ రవిచందర్ మ్యాజిక్ వాయిస్ తోడవడంతో పాట్ మరో లెవెల్ కు వెళ్లిపోయింది.
మహేష్ బాబు.పి డైరెక్షన్ లో వస్తున్న ఆంధ్ర కింగ్ తాలూకా సినిమాలో పోతినేని రామ్, భాగ్యశ్రీ బోర్సే నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ యెర్నేని, రవి శంకర్ నిర్మిస్తున్నారు. వివేక్, మెర్విన్ డ్యుయో మ్యూజిక్ అందిస్తున్నారు.
నువ్వుంటే చాలే సాంగ్ లిరిక్స్
ఒక చూపుతో నాలోనే పుట్టిందే…
ఏదో వింతగా గుండెలో చేరిందే…
నువ్వెవ్వరు నాలో అని అడిగానే…
తానేగా ప్రేమని తెలిపిందే…
పరిచయం లేదని అడిగా ప్రేమంటే..
కలిసామ్ గా ఇకపై మనమేగా అందే
వెతికిన దొరకని అర్థం ప్రేమదే
అది నీకేంటో ఒక మాటలో చెప్పాలే..
నువ్వుంటే చాలే…
నువ్వుంటే చాలే…
నువ్వుంటే చాలే…
మాటలతో చెప్పమంటే చెప్పలేనే
భావమేదో భాషలకే అందనందే
అదేమిటో కుదురుగా ఉండలేనే నువ్వు ఉంటే..
అడిగితే అదేమిటో అర్ధంకాదే
నిన్న మొన్న నాలో ఉన్నా నేనే కాదే
పుట్టిందంటే నీతో పోనే పోదే ప్రేమంతే..
దారేలేని ఊరినే అడిగానుగా
నువ్వేగా దారని నాకు చూపుతుంది
కమ్ముకున్న మబ్బులో వెతికానుగా
అరె గాలి వానై నన్ను తాకుతుంది
నాకే తెలియని నాలో యుద్ధమా.. లోలోన సంద్రమా..
లేదే పొంగుతున్నదే ఇంకేదో…
పేరు లేదుగా ఇంతే మాట రాదుగా
అంతే ఒప్పుకోమరి వింతేలే…
నువ్వుంటే చాలే…
మాటలతో చెప్పమంటే చెప్పలేనే
భావమేదో భాషలకే అందనందే
అదేమిటో కుదురుగా ఉండలేనే నువ్వు ఉంటే
అడిగితే అదేమిటో అర్ధంకాదే
నిన్న మొన్న నాలో ఉన్నా నేనే కాదే
పుట్టిందంటే నీతో పోనే పోదే ప్రేమంతే..
ఓ.. ఓ.. ఓ.. ఓ.. (నువ్వుంటే చాలే)…
ఓ.. ఓ.. ఓ.. ఓ.. (నువ్వుంటే చాలే)…
సంబంధిత కథనం
