షాక్.. లెజండరీ డైరెక్టర్ మృతి.. అమితాబ్ బచ్చన్ డాన్ మూవీతో సెన్సేషన్.. సెలబ్రిటీల నివాళి

Best Web Hosting Provider In India 2024

షాక్.. లెజండరీ డైరెక్టర్ మృతి.. అమితాబ్ బచ్చన్ డాన్ మూవీతో సెన్సేషన్.. సెలబ్రిటీల నివాళి

బాలీవుడ్ లెజెండరీ డైరెక్టర్ చంద్ర బరోత్ కన్నుమూశారు. అమితాబ్ బచ్చన్ తో ఆయన చేసిన డాన్ సినిమా క్లాసిక్ మూవీస్ లో ఒకటిగా నిలిచిన సంగతి తెలిసిందే. చంద్ర బరోత్ మరణంపై బాలీవుడ్ సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేశారు.

అమితాబ్ బచ్చన్ తో చంద్ర బరోట్ (ఫైల్ ఫొటో)

డాన్ మూవీతో బాలీవుడ్ లో గతంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన డైరెక్టర్ చంద్ర బరోత్ మరణించారు. 86 ఏళ్ల ఆయన అనారోగ్యంతో కన్నుమూశారు. అమితాబ్ బచ్చన్ నటించిన డాన్ సినిమాతో చంద్ర పేరు మార్మోగింది. గత ఏడేళ్లుగా చంద్ర బరోట్ పల్మనరీ ఫైబ్రోసిస్ తో బాధపడుతున్నట్లు ఆయన సతీమణి దీప తెలిపారు. ఆయనను గురునానక్ ఆసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ మరణించారు.

ఫర్హాన్ అక్తర్ నివాళి

చంద్ర బరోత్ మృతి పట్ల బాలీవుడ్ సెలబ్రిటీలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ‘ఓజీ డాన్ డైరెక్టర్ ఇక లేరనే వార్త విని బాధపడ్డాను. మీ ఆత్మకు శాంతి చేకూరాలి చంద్ర బరోత్జీ . ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను’ అని డాన్ మూడో భాగానికి దర్శకత్వం వహిస్తున్న ఫర్హాన్ అక్తర్ పేర్కొన్నారు.

కాలేజీకి బంక్ కొట్టి

దర్శకుడు కునాల్ కోహ్లీ ఎక్స్ లో.. “చంద్ర జీ మీ ఆత్మకు శాంతి చేకూరాలి. నేను అసిస్టెంట్ గా పని చేసిన ఏకైక దర్శకుడు ఆయన. అయితే డాన్ సినిమా కోసం కాదు. వినోద్ ఖన్నాతో తీసిన ‘బాస్’ అనే సినిమా. అదెప్పుడూ వెలుగు చూడలేదు. కానీ ఆయనతో కలిసి పనిచేసిన అనుభవం గొప్పది. డాన్ గురించి చాలా కథలు విన్నా. నేను కాలేజీకి బంక్ కొట్టి చంద్రాజీకి సహాయం చేశాను. చాలా తెలివైన వ్యక్తి. ఇండియన్ సినిమాల్లో మోస్ట్ స్టైలిష్ మూవీస్ ను అందించినందుకు ధన్యవాదాలు సర్’’ అని పోస్టు చేశాడు.

చంద్ర బరోత్ ఎవరు?

చంద్ర బరోతో టాంజానియాలో పుట్టి పెరిగారు. నటుడు కమ్ దర్శకుడు మనోజ్ కుమార్ మార్గదర్శకత్వంలో సినిమాల్లో కెరీర్ ప్రారంభించడానికి భారతదేశానికి రాకముందు ఒక బ్యాంకులో పనిచేస్తూ తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు. బెంగాలీ చిత్రాలైన ఆశ్రిత (1989), ప్యార్ భారా దిల్ (1991)లకు బరోత్ దర్శకత్వం వహించారు.

హాంగ్ కాంగ్ వాలీ స్క్రిప్ట్, నీల్ కో పకడ్నా వంటి చిత్రాల్లో ఆయన నటించారు. ఆయన 1970 లో పురాబ్ ఔర్ పచిమ్, యాద్గర్, 1972 లో షోర్, 1974 లో రోటీ కప్డా ఔర్ మకాన్ లకు అసిస్టెంట్ డైరెక్టర్ గా ఫిలోగ్రఫీని ప్రారంభించారు.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024