




Best Web Hosting Provider In India 2024
అలర్ట్! తెలంగాణలో నేడు బ్యాంకులకు సెలవు- ఇదీ కారణం..
బోనాల నేపథ్యంలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించడంతో, తెలంగాణవ్యాప్తంగా బ్యాంకులు మూతపడి ఉంటాయి. ఈ నెలలో మరో రెండు రోజులు సెలవులు ఉన్నాయి. పూర్తి వివరాలను ఇక్కడ చూడండి..
బ్యాంకు పనుల కోసం తిరిగే వారికి అలర్ట్! తెలంగాణలో నేడు, జులై 21 అన్ని బ్యాంకులకు సెలవు. బోనాల నేపథ్యంలో జులై 21ని ప్రభుత్వం సెలవు దినంగా ప్రకటించడం ఇందుకు కారణం. ఈ రోజు బ్యాంకులతో పాటు స్కూళ్లు, కాలేజీలు సైతం మూతపడి ఉంటాయి.
బోనాల వేళ తెలంగాణలో నేడు బ్యాంకులకు సెలవు..
దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకులకు సంబంధించిన సెలవుల జాబితాను ఆర్బీఐ (రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా) జారీ చేస్తుంది. అయితే వీటిల్లో ప్రాంతీయ పండుగల వేళ ఆయా ప్రాంతాల్లో బ్యాంకులు మూతపడి ఉంటాయి. ఇందులో భాగంగానే ఈరోజు, జులై 21న బోనాల కారణంగా తెలంగాణలో బ్యాంకులకు సెలవు ప్రకటించారు.
ఇక జులై 20 ఆదివారం వచ్చింది. ఆదివారం బ్యాంకులకు సెలవు ఉంటుంది. అంటే, తెలంగాణలో బ్యాంకులకు వరుసగా రెండు రోజులు సెలవులు లభించాయి.
తెలంగాణ వ్యాప్తంగా ఆదివారం బోనాల పండుగ ఘనంగా జరిగింది. ఇక హైదరాబాద్లోని పలు ఆలయాలకు భక్తులు పోటెత్తారు. బోనం సమర్పించి తమ మొక్కులు తీర్చుకున్నారు. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు ఇక్కడ క్లిక్ చేయండి.
తెలంగాణ బ్యాంకు సెలవులు..
ఈ నెలలో తెలంగాణ వ్యాప్తంగా బ్యాంకులు ఇంకో రెండు రోజులు మూతపడి ఉంటాయి. జులై 26 నాలుగో శనివారం వచ్చింది. జులై 27 ఆదివారం వచ్చింది. వారంతంలో బ్యాంకులు మూతపడి ఉంటాయని కస్టమర్లు గమనించాల్సి ఉంటుంది.
ఆన్లైన్ సేవలు యథాతథంగా పనిచేస్తాయి..
బ్యాంకులకు సెలవు ఉన్నప్పటికీ ఆన్లైన్ సేవలు యథాతథంగా పనిచేస్తుంటాయి. నగదు అత్యవసర పరిస్థితుల కోసం, అన్ని బ్యాంకులు వారాంతం లేదా ఇతర హాలీడేలతో ఎలాంటి సంబంధం లేకుండా వారి ఆన్లైన్ వెబ్సైట్లు, మొబైల్ బ్యాంకింగ్ సేవలను అందుబాటులో ఉంచుతాయి. నగదు ఉపసంహరణ కోసం మీరు ఏ బ్యాంకు ఏటీఎంకైనా వెళ్లొచ్చు.
తెలంగాణలో మంగళవారం నుంచి బ్యాంకులు తిరిగి యథాతథంగా పనిచేస్తాయి. మీరు మీ బ్యాంకు పనుల కోసం సంబంధిత బ్రాంచీలకు వెళ్లొచ్చు.
సంబంధిత కథనం
టాపిక్