2025లో ఇప్పటివరకూ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఏదో తెలుసా? ఈ ఓటీటీలో చూడొచ్చు.. సంక్రాంతికి వస్తున్నాం సెకండ్ ప్లేస్

Best Web Hosting Provider In India 2024

2025లో ఇప్పటివరకూ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా ఏదో తెలుసా? ఈ ఓటీటీలో చూడొచ్చు.. సంక్రాంతికి వస్తున్నాం సెకండ్ ప్లేస్

2025లో ఇప్పటివరకూ ఇండియాలోనే హయ్యస్ట్ గ్రాసర్ గా నిలిచిన సినిమా ఏదో మీకు తెలుసా? హిందీలో అదరగొట్టిన ఈ మూవీ తెలుగులోకి కూడా డబ్ అయింది. ఇక విక్టరీ వెంకటేష్ నటించిన సంక్రాంతికి వస్తున్నాం మూవీ సెకండ్ ప్లేస్ లో ఉంది. ఓ సారి టాప్-10 మూవీస్ లిస్ట్ పై ఓ లుక్కేయండి.

2025లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమా (Mint)

సల్మాన్ ఖాన్, కమల్ హాసన్, రామ్ చరణ్, కంగనా రనౌత్, షాహిద్ కపూర్ వంటి స్టార్ల సినిమాలు 2025లో థియేటర్లకు వచ్చాయి. కానీ ఇవి ఆడియన్స్ ను పెద్దగా ఆకట్టుకోలేకపోయాయి. అయితే అనూహ్యంగా పెద్దగా అంచనాలు లేని ఓ హిందీ మూవీ బాక్సాఫీస్ ను షేక్ చేసింది. కలెక్షన్ల దుమ్ము దులిపింది. అదే ‘ఛావా’. ఇండియాలో 2025లో ఇప్పటివరకూ అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా ఛావా కొనసాగుతోంది.

రెండు నెలల పాటు

2025లో అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా ఛావా నిలిచింది, వివాదాల్లో చిక్కుకున్నప్పటికీ ఈ చిత్రం దాదాపు రెండు నెలల పాటు థియేట్రికల్ రన్ ను కొనసాగించింది. దాని విజయం ఎంత పెద్దదంటే, హిందీ సినిమాను చివరికి తెలుగులో కూడా డబ్ చేసి విడుదల చేశారు. ప్రేక్షకుల్లో డిమాండ్ ఉండటంతో 24 గంటల రన్నింగ్ షోలు కూడా వేశారు. ఛత్రపతి శంభాజీ మహరాజ్ పాత్రలో విక్కీ కౌశల్ నటించాడు. ఇందులో రష్మిక మందన్న, అక్షయ్ ఖన్నా కూడా కీలక పాత్రలు పోషించారు. మరాఠా సామ్రాజ్య రెండో పాలకుడు శంభాజీ మహరాజ్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది.

ఎన్ని కోట్లంటే?

ఆర్మాక్స్ మీడియా విడుదల చేసిన తాజా ఇండియా బాక్సాఫీస్ రిపోర్ట్ ప్రకారం ఛావా రూ .693 కోట్లు సంపాదించింది. 2025లో ఇప్పటి వరకూ ఇండియాలో టాప్ గ్రాసర్ గా నిలిచింది. ఈ ఏడాది జనవరి నుంచి జూన్ మధ్య మొత్తం 17 సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ వద్ద రూ.100 కోట్ల మార్కును దాటాయి. అయితే ఈ టైమ్ లైన్ లో రూ.250 కోట్ల మార్కును దాటిన ఏకైక చిత్రంగా ఛావా నిలిచింది.

తెలుగు సినిమా

దగ్గుబాటి వెంకటేష్ హీరోగా తెరకెక్కిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా దేశవ్యాప్తంగా రూ.222 కోట్ల వసూళ్లు సాధించి ఈ జాబితాలో రెండో స్థానంలో ఉంది. సితారే జమీన్ పర్ (రూ.201 కోట్లు), హౌస్ ఫుల్ 5 (రూ.200 కోట్లు), రైడ్ 2 (రూ.199 కోట్లు), గుడ్ బ్యాడ్ అగ్లీ (రూ.183 కోట్లు), గేమ్ ఛేంజర్ (రూ.153 కోట్లు), తుడరుమ్ (రూ.144 కోట్లు), స్కై ఫోర్స్ (రూ.130 కోట్లు), ఎల్ 2: ఎంపురాన్ (రూ.126 కోట్లు)లు వరుసగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

జనవరి-జూన్ విడుదలైన సినిమాల క్యుములేటివ్ బాక్సాఫీస్ రూ .5,723 కోట్లు. ఇది 2024 లో ఇదే కాలంతో పోలిస్తే 14 శాతం ఎక్కువ. 2022 రికార్డు కంటే కేవలం రూ .12 కోట్లు తక్కువ అని నివేదిక పేర్కొంది.

ఓటీటీలోకి

2025 ఫిబ్రవరి 14న విడుదలైన విక్కీ కౌశల్ చిత్రం ఛావా అదరగొట్టింది. మార్చి 21, 2025 వరకు ఈ చిత్రం థియేటర్లలో ప్రదర్శితమై 36వ రోజుకు చేరుకుంది. ఈ చిత్రానికి మహారాష్ట్రలో డిమాండ్ ఎక్కువగా ఉండటంతో 24 గంటల పాటు ప్రదర్శనలు నిర్వహించారు. విడుదలైన వెంటనే ఉదయం 6 గంటల నుంచి మిడ్ నైట్ షోలు వేసి 97 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసినట్లు సమాచారం. విడుదలైన నెల రోజుల్లోనే డిమాండ్ కు తగ్గట్టుగా తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను కూడా థియేటర్లలో విడుదల చేశారు. ఏప్రిల్ 11న నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలో ఈ సినిమా విడుదలైంది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024