




Best Web Hosting Provider In India 2024

నిన్ను కోరి జులై 21 ఎపిసోడ్: చంద్రకు సారీ చెప్పిన బిజినెస్ మ్యాన్.. డీల్ కు ఓకే.. విరాట్ కు అమ్మవారు కావడంతో కంగారు
నిన్ను కోరి సీరియల్ టుడే జులై 21వ తేదీ ఎపిసోడ్ లో విరాట్ తో అంతకుముందు డీల్ క్యాన్సిల్ చేసుకున్న బిజినెస్ మ్యాన్ చంద్రకు సారీ చెప్తాడు. డీల్ ఓకే చేస్తాడు. విరాట్ కు అమ్మవారు కావడంతో ఇంట్లో అందరూ కంగారు పడతారు.
నిన్ను కోరి సీరియల్ జులై 21వ తేదీ ఎపిసోడ్ లో చంద్రకళ రోడ్డు మీద యాక్సిడెంట్ నుంచి ఓ బాబును కాపాడుతుంది. ఆ బాబు నా ఒక్కగానొక్క కొడుకు అని విరాట్ తో డీల్ క్యాన్సిల్ చేసుకున్న బిజినెస్ మ్యాన్ అంటాడు. వాణ్ని చాలా అపురూపంగా పెంచుకుంటున్నాం. సమయానికి వచ్చి కాపాడావు. నా ఇంటిని నిలబెట్టిన దేవతవమ్మా అని అంటాడు. ఈ కాలంలో సొంత వాళ్లనే లెక్క చేయని మనుషులు, పరిచయం లేని వాళ్లకు కూడా సాయం చేయడానికి ముందుకు వచ్చావు. ఆ రోజు ముసలి వాళ్ల విషయంలో ఈగోకు వెళ్లి తప్పుడుగా మాట్లాడా. నన్ను క్షమించమ్మా అని అడుగుతాడు.
డీల్ ఓకే
నీ మీద కోపంతో డీల్ క్యాన్సిల్ చేశా. విరాట్ తో బిజినెస్ డీల్ ను ఒకే చేస్తున్నాను అని ఆ బిజినెస్ మ్యాన్ చెప్పడంతో అందరూ సంతోషపడతారు. నా వల్ల మీరు కూడా మీ వైఫ్ ను అపార్థం చేసుకున్నట్లు ఉన్నారు అని ఆ బిజినెస్ మ్యాన్ వెళ్లిపోతాడు. ఈ ఊహించని షాక్ తో శాలిని కంగు తింటుంది. కట్టుకునే భర్తను చంద్ర మోసం చేస్తుందా? ఎంత అపార్థం చేసుకున్నావ్ రా, ఎంత అసహ్యించుకున్నావ్? చేయని తప్పునకు తాను ఎంత బాధపడాల్సి వచ్చిందో అని విరాట్ తో శ్యామల అంటుంది. నా ప్రాణం ఉన్నంతవరకూ ఈ ఇంటి పేరు నిలబెట్టే పనులే చేస్తానని చంద్రకళ చెప్పి వెళ్లిపోతుంది.
విరాట్ థ్యాంక్యూ
బెడ్ రూమ్ లో బట్టలు మడతపెడుతున్న చంద్రకళ దగ్గరకు విరాట్ వెళ్తాడు. తాను అన్న మాటలకు ఎలా సారీ చెప్పాలో అని తికమక పడతాడు. నా భర్తే మాటలు అన్నాడు కదా అని ఎప్పుడో మర్చిపోయాను అని చంద్ర అంటే.. థ్యాంక్యూ వెరీ మచ్ అని విరాట్ అంటాడు. థ్యాంక్యూ చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఈ మధ్య ఓపిక నశిస్తుందోయ్ శ్రీవారు. వెనకా ముందు ఆలోచించకుండా తిట్టేస్తున్నారని చంద్ర అంటుంది. కోపంతో కొట్టాను ఇప్పుడు థ్యాంక్యూ చెప్పానని విరాట్ అంటాడు.
ఇంట్లోనే క్రాంతి తాగుడు
క్రాంతి రాత్రి ఇంట్లోనే మందు తాగుతుంటాడు. ఎవరికీ చెప్పుకోలేని బాధ ఉంటే ఇలా మందు తాగి మర్చిపోవాలని చూస్తున్నానని క్రాంతి అంటాడు. ఇంకోసారి బాటిల్ ను టచ్ చేస్తే బాగుండదని వార్నింగ్ ఇస్తాడు. మరోవైపు జ్వరం వస్తుందేమోనని విరాట్ ముందే టాబ్లెట్ వేసుకుంటాడు. అది చూసి శ్రుతి పాలు తీసుకొస్తానని అంటుంది. అప్పుడే వచ్చిన చంద్రకళ.. నేను చూసుకుంటాను అని శ్రుతితో అంటుంది. పెళ్లాం చూసుకుంటుందిలే, నా కాళ్లు పడుదువ్ లే రా అని శ్రుతిని తీసుకెళ్తుంది శ్యామల.
పొద్దున విరాట్ కు ఎలా ఉందో చూడమని పూజ చేస్తున్న చంద్రకళను పంపిస్తారు శ్యామల, జగదీశ్వరి. బెడ్ పై విరాట్ ను చూసి అందరూ షాక్ అవుతారు. విరాట్ కు అమ్మవారు అయినట్లు కనిపిస్తోందని శ్యామల అంటుంది. బయటకు వద్దు ఇంట్లోనే పద్ధతిగా చూసుకుద్దామంటుంది. చంద్రకళ గుడికి వెళ్లి పూజారిని ఏం చేయాలో అడుగుతుంది. దీంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్