కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోత్స్న ఎస్కేప్ ప్లాన్ కు కార్తీక్ చెక్..కార్లో మరదలితో సరసాలు..కాళ్లు పట్టుకోవడమే దిక్కు

Best Web Hosting Provider In India 2024

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: జ్యోత్స్న ఎస్కేప్ ప్లాన్ కు కార్తీక్ చెక్..కార్లో మరదలితో సరసాలు..కాళ్లు పట్టుకోవడమే దిక్కు

కార్తీక దీపం 2 సీరియల్ టుడే జులై 21వ తేదీ ఎపిసోడ్ లో ఇంటి నుంచి పారిపోవాలనుకున్న జ్యోత్స్న ప్లాన్ చెడగొడతాడు కార్తీక్. ఎంగేజ్మెంట్ తప్పదు అనుకునే సమయంలో దీప కాళ్లు పట్టుకోమని పారిజాతాన్ని అడుగుతుంది జ్యోత్స్న. ఇంకా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇక్కడ చూసేయండి.

కార్తీక దీపం 2 సీరియల్ టుడే ఎపిసోడ్ (jiohotstar)

కార్తీక దీపం 2 సీరియల్ టుడే జులై 21వ తేదీ ఎపిసోడ్ లో ఎంగేజ్మెంట్ నుంచి తప్పించుకునేందుకు జ్యోత్స్న ఇంటి నుంచి పారిపోతుంది. పెళ్లి కూతురు మిస్సింగ్ అనే న్యూస్ విని జ్యోత్స్న ఇంత ట్విస్ట్ ఇచ్చావ్ అనుకుంటారు అని మనసులో అనుకుంటుంది జ్యో. కారు రైట్ కు తిప్పి శ్రీశైలం వెళ్దామనుకుంటుంది. కానీ ఇంతలో కారు ఎందుకు మేడం రైట్ కు తిప్పారు? అనే కార్తీక్ వాయిస్ వినగానే షాక్ అవుతుంది జ్యోత్స్న. కార్తీక్, దీప కార్లోనే పడుకుంటారు. పెద్ద సారు ఇంట్లో ఉండద్దొన్నారు, బయట చలిగా ఉందని కార్లో పడుకున్నామని కార్తీక్ చెప్తాడు.

కార్తీక్, దీప సరసం

మీరెందుకు ఈ టైమ్ లో బయటకు వచ్చారు? అబద్దాలు ఎందుకు చెబుతున్నారంటూ కార్తీక్, దీప అడుగుతారు. నాకు పారిపోవడానికి కూడా అవకాశం లేకుండా చేశావని అనుకుంటుంది జ్యోత్స్న. పెద్ద సారుకు ఫోన్ చేద్దామని కార్తీక్ అనగానే ఆగు బావా అని కారును వెనక్కి తిప్పుతుంది జ్యో. బ్యాక్ సీట్లు దీప, కార్తీక్ ఒకరిపై మరొకరు పడుతూ ఎంజాయ్ చేస్తుంటే జ్యోకు మరింత మండిపోతుంది. మీరేం చేస్తున్నారు? ఆపండి అంటూ జ్యోత్స్న అరుస్తూనే ఉంటుంది. మీరు హనీమూన్ కు వెళ్తున్నట్లు ఉందని జ్యో అంటుంది.

ఇరుక్కుపోయా

ఇంటికి తిరిగి వచ్చేస్తారు. నువ్వు చెప్పింది నిజమే బావ, నీ మాట వినకపోయి ఉంటే జ్యోత్స్న తప్పించుకునేది. అప్పుడు ఇంకా చెడ్డ పేరు వచ్చేది. ప్లాన్ ఫెయిల్ అయింది కదా ఇప్పుడు ఏం చేస్తుంది అని కార్తీక్ ను దీప అడుగుతుంది. నిశ్చితార్థానికి రెడీ అవడం తప్ప జ్యోత్స్నకు మరో మార్గం లేదని కార్తీక్ చెప్తాడు. మరోవైపు బయటకు వెళ్లి ఆటో ఎక్కి వైజాగ్ వెళ్లిపోతానని అనుకున్న పారిజాతానికి ఎదురుగా వస్తుంది జ్యో. బావ, దీప వెళ్లనివ్వలేదు, ఇంటికి కాపాలా కాస్తూ ఉన్నారు. కార్లో అడ్డంగా దొరికిపోయాను. బావ లైఫ్ లో దీప లేకపోతే నేను అనుకున్నవన్నీ జరుగుతాయిన గౌతమ్ డ్రామా మొదలెట్టాను. కానీ నేను ఇరుక్కుపోయా. ఎలా తప్పించుకోవాలో అర్థం కావడం లేదని జ్యో అంటుంది.

కాళ్లు పట్టుకో

ఉదయం నిశ్చితార్థం ఏర్పాట్లు చేస్తారు. ఈ నిశ్చితార్థాన్ని జ్యోత్స్న ఆపాలను దేవుడికి దండం పెట్టుకున్నా. కానీ అమ్మానాన్న కూడా బాధపడొద్దని మొక్కుకున్నా. ఎవరూ కన్నీళ్లు పెట్టుకోవద్దని కార్తీక్ తో దీప అంటుంది. ఇక ఎంగేజ్మెంట్ కోసం రెడీ అయిన జ్యోత్స్న.. నాకు రెండే అవకాశాలుంటాయి. ఒకటి గౌతమ్ గాడితో పెళ్లి కుదుర్చుకోవడం. ఇంకోటి గౌతమ్ గురించి అందరికీ చెప్పడం. పెళ్లి జరిగితే నా జీవితం నాశనమవుతుంది. రెండోది జరిగితే నా పేరు నాశనమవుతుంది. ఏది జరిగినా నాకే నష్టం గ్రానీ. కానీ ఆఖరిగా మరో ప్రయత్నానికి అవకాశం ఉంది. వెళ్లి దీప కాళ్లు పట్టుకో అని పారిజాతానికి చెప్తుంది జ్యోత్స్న.

లాస్ట్ ఛాన్స్

దీపలో నిజాయతీ ఉంది. గౌతమ్ ఎలాంటి వాడో దానికి తెలుసు. బావ చెప్పడం వల్లే గౌతమ్ మంచివాడని చెప్పింది. ఇప్పుడు నువ్వు వెళ్లి కాళ్లు పట్టుకుని నా మనవరాలి జీవితం నువ్వే కాపాడాలని గుండెలు బాదుకుంటూ భోరున ఏడ్చావనుకో దాని మనసు కరుగుతుంది. అప్పుడు నిప్పులా వెలిగి, గౌతమ్ తుప్పు వదలగొడుతుందని పారిజాతంతో అంటుంది జ్యోత్స్న. అప్పుడు నిశ్చితార్థం ఆగిపోతుంది, మళ్లీ దీపే చెడ్డది అవుతుంది. కానీ నేను దీప కాళ్లు పట్టుకోనే అని పారు అంటుంది. మన దగ్గర టైమ్ లేదు గ్రానీ, ఉన్న అవకాశాన్ని కూడా నాశనం చేయకు త్వరగా వెళ్లు అని పారును ఫోర్స్ చేస్తుంది.

అమ్మ రాదు

మీ అమ్మ ఎక్కడా? అని కార్తీక్ ను సుమిత్ర అడుగుతుంది. మీ చెల్లి ఎక్కడ? అని దశరథ్ తో శివన్నారాయణ అంటాడు. కారుతో పాటు నువ్వు కూడా వెళ్లి తీసుకురా అని శివన్నారాయణ అంటే, నువ్వు వెళ్తే అని దశరథ్ అంటాడు. కానీ శివన్నారాయణ తప్పించుకుంటాడు. నేను కారేసుకెళ్లి నా చెల్లెలిని తీసుకొస్తాను అని దశరథ్ అంటే, రాదు మావయ్య అని కార్తీక్ చెప్తాడు. అత్తను వెళ్లి నీ కోడలు, నీ అక్క, నీ మనవరాలు, నీ కొడుకు అందరూ రండి అని పిలవమనండి అప్పుడు వస్తుందని కార్తీక్ చెప్తాడు. వదిన కోసం అడ్డమైన వాళ్లను పిలవలేనని సుమిత్ర చెప్తుంది. డ్రైవర్ తల్లి రానంత మాత్రాన ఓనర్ ఇంట్లో నిశ్చితార్థం ఆగదు సారు అనుకుంటూ కార్తీక్ వెళ్లిపోతాడు.

పారు డ్రామా

వంట గదిలో పని చేస్తున్న దీప దగ్గరకు పారిజాతం వస్తుంది. ఒకప్పుడు సుమిత్ర నిన్ను కన్న కూతురిలా చూసుకుంది. నువ్వు సుమిత్రకు రుణపడిందే ఎక్కువ. మరి ఆ రుణాన్ని తీర్చుకోవాలనిపించలేదా? ఇప్పుడు అవకాశం వచ్చింది. గౌతమ్ గురించి నిజం చెప్పి రుణం తీర్చుకోవచ్చు. గతంలో గౌతమ్ గురించి నిజం చెప్పావు. కానీ నిన్ను దోషిగా నిలబెట్టారు. కానీ గౌతమ్ మంచివాడని క్లీన్ చీట్ ఇచ్చావు. నీ మాట నమ్మి నిశ్చితార్థం పెట్టుకున్నాం. కానీ సుమిత్ర, దశరథ్ మనసులో భయం మాత్రం పోలేదు. నువ్వు ఈ నిశ్చితార్థాన్ని ఆపాలి. లేదంటే నా మనవరాలి జీవితం అల్లరిపాలైపోతుంది. సుమిత్ర కూతురి భవిష్యత్ ఎలా ఉండబోతుందేమోనని భయంగా ఉంది అని పారు మొసలి కన్నీళ్లు పెట్టుకోవడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024