





Best Web Hosting Provider In India 2024

సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్, ఇప్పుడు ప్రెస్ మీట్.. నాకు పొగరో, అహంకారమో కారణం కాదు.. హరి హర వీరమల్లుపై పవన్ కల్యాణ్
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ హరి హర వీరమల్లు. తాజాగా హరి హర వీరమల్లు సినిమా గురించి మాట్లాడేందుకు ఇవాళ (జూలై 21) నిర్వహించిన ప్రెస్ మీట్‌లో పవన్ కల్యాణ్ ఇంట్రెస్టింగ్ విశేషాలు చెప్పారు. అలా చేయడానికి తనకు పొగరు, అహంకారం కారణం కాదన్నారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ చిత్రం హరి హర వీరమల్లు. ఈ సినిమాకు సంబంధించిన విశేషాలను తాజాగా ఇవాళ (జూలై 21) నిర్వహించిన ప్రెస్ మీట్‌లో పవన్ కల్యాణ్ వెల్లడించారు.
ప్రెస్ మీట్‌లో పవన్ కల్యాణ్
ఈ సందర్భంగా పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. “మీడియా మిత్రులతో రాజకీయాల పరంగా చర్చించాను. కానీ, ఇలా ఒక సినిమా కోసం పెద్దగా మాట్లాడలేదు. సినిమాకి సంబంధించి మాట్లాడటానికి నేను మొహమాట పడతాను. సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో నాకు తెలియదు” అని అన్నారు.
“పని చేయడం తెలుసు తప్ప.. ఇంత చేశాను, అంత చేశాను అని చెప్పుకోవడం నాకు ఇబ్బందిగా ఉంటుంది. నేను అనుకోకుండా నటుడిని, సాంకేతిక నిపుణుడిని అయ్యాను. సినిమా గురించి మీడియాతో మాట్లాడక పోవడానికి నాకు పొగరో, అహంకారమో కారణం కాదు. సినిమా గురించి చెప్పుకోవడానికి నాకు ఇబ్బందిగా ఉంటుంది” అని పవన్ కల్యాణ్ చెప్పారు.
సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్
“కానీ, ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టానంటే.. ఏఎం రత్నం గారి కోసం పెట్టాను. సినిమా బతకాలి. సాయంత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ పెట్టుకొని ఇప్పుడు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టామంటే.. ఈవెంట్ తర్వాత మళ్లీ మీడియా మిత్రులతో మాట్లాడే అవకాశం రాదేమో అనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది” అని పవన్ కల్యాణ్ వివరించారు.
“అజ్ఞాతవాసి సినిమాలో త్రివిక్రమ్ గారు ఒక మాట రాశారు. “ఒక చిన్నపాటి సౌకర్యం కోసం ఒక యుద్ధమే చేయాల్సి వస్తుంది”. అలాంటిది ఒక సినిమా చేయడమంటే ఎన్ని యుద్ధాలు చేయాలి. ఆర్థికంగా కావచ్చు, సృజనాత్మకంగా కావచ్చు” అని పవన్ కల్యాణ్ తెలిపారు.
జాతీయ స్థాయికి
“నేను సినిమాల్లోకి రాకముందు ఏఎం రత్నం గారి లాంటి వ్యక్తి నా నిర్మాత అయితే బాగుండు అనుకునేవాడిని. ప్రాంతీయ సినిమాని జాతీయ స్థాయికి తీసుకెళ్లిన వ్యక్తి ఆయన. తమిళ సినిమాలను తెలుగులో విడుదల చేసి, స్ట్రయిట్ సినిమాల స్థాయిలో ఆడించి సత్తా చూపించిన వ్యక్తి. ఫిల్మ్ ఇండస్ట్రీ క్రియేటివ్ పొటెన్షియాలిటీ పెంచిన వ్యక్తి” అని పవన్ కల్యాణ్ వెల్లడించారు.
“ఈ సినిమా చాలా ఒడిదుడుకులు ఎదుర్కొంది. రెండు కరోనా పరిస్థితులు ఎదుర్కొంది. క్రియేటివ్‌గా కొంత ఇబ్బంది ఎదుర్కొంది. ఏం చేసినా, ఎన్ని ఎదురైనా సినిమా బాగా రావాలని అనుకుంటాం. ఈ సినిమాకి ప్రత్యేకించి ఏఎం రత్నం గారి తపన చూశాను” అని పవన్ కల్యాణ్ అన్నారు
57 రోజులు క్లైమాక్స్‌కే
“ముఖ్యంగా నేను రాజకీయాల్లోకి వెళ్లిపోయి.. దర్శకత్వానికి, క్రియేటివ్ పార్ట్‌కి దూరమైన తర్వాత.. నా ప్రధాన దృష్టి రాజకీయాలపై ఉన్న సమయంలో.. నా దగ్గరకు వచ్చి మళ్లీ మీరు సినిమా చేయాలని అడిగినప్పుడు నా బెస్ట్ ఇచ్చాను నేను” అని పవన్ కల్యాణ్ తెలిపారు.
“ప్రస్తుతం నేను టైం ఇవ్వలేను. అలాంటిది నేను ఒక్క క్లైమాక్స్‌కే దాదాపు 57 రోజులు షూట్ చేయాల్సి వచ్చింది. మే నెలలో మండుటెండలో షూట్ చేశాము. నేను ఎప్పుడో దేశ విదేశాల్లో నేర్చుకున్న మార్షల్ ఆర్ట్స్ ఇప్పుడు నాకు ఈ సినిమాకి పనికొచ్చాయి. కొరియోగ్రాఫర్స్‌తో కూర్చొని క్లైమాక్స్‌ను ప్రత్యేకంగా రూపొందించాము. సినిమాకి ఇదే ఆయువుపట్టు” అని పవన్ కల్యాణ్ చెప్పుకొచ్చారు.
సంబంధిత కథనం