



Best Web Hosting Provider In India 2024
యూజీసీ నెట్ ఫలితాలు విడుదల.. ఇలా మీ రిజల్ట్ చెక్ చేసుకోండి!
యూజీసీ నెట్ జూన్ 2025 ఫలితాలు జూలై 21న విడుదలయ్యాయి. గత నెల 25 నుంచి 29 వరకు పరీక్ష నిర్వహించారు.
నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) సోమవారం యూజీసీ నెట్ జూన్ 2025 పరీక్ష ఫలితాలను అధికారికంగా విడుదల చేసింది. పరీక్షకు హాజరైన అభ్యర్థులు ugcnet.nta.ac.in అధికారిక వెబ్‌సైట్ నుంచి తమ స్కోర్ కార్డులను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
దేశవ్యాప్తంగా విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్, జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్ (జేఆర్ఎఫ్) అర్హత కోసం ఈ పరీక్షను నిర్వహిస్తారు. యూజీసీ నెట్ జూన్ రిజల్ట్స్ 2025 ఫలితాలను చెక్ చేసుకోవడానికి అభ్యర్థులు ugcnet.nta.ac.in వెబ్‌సైట్ వెళ్లి యూజీసీ నెట్ జూన్ 2025 రిజల్ట్ లింక్ మీద క్లిక్ చేయాలి. అప్లికేషన్ నెంబర్, పుట్టిన తేదీ, సెక్యూరిటీ పిన్ నింపిన తర్వాత రిజల్ట్ స్క్రీన్‌పై కనిపిస్తుంది. దీన్ని డౌన్లోడ్ చేసుకోవాలి.
అభ్యర్థులు పొందే స్కోర్‌కార్డులో మొత్తం మార్కులు, పర్సంటైల్ స్కోరు, జేఆర్ఎఫ్ లేదా అసిస్టెంట్ ప్రొఫెసర్ అర్హత హోదా ఉంటాయి. మొత్తం 10,19,751 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా 7,52,007 మంది పరీక్షకు హాజరయ్యారు. ఈ పరీక్షలో మొత్తం 1,28,179 మంది అభ్యర్థులు ఉత్తీర్ణత సాధించారు. వీరిలో 5,269 మంది జేఆర్ఎఫ్, అసిస్టెంట్ ప్రొఫెసర్ రెండింటిలోనూ ఉత్తీర్ణత సాధించగా.. 54,885 మంది అభ్యర్థులు అసిస్టెంట్ ప్రొఫెసర్, పీహెచ్డీ ప్రవేశాలకు అర్హులుగా గుర్తించారు.
జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్(జేఆర్ఎఫ్), విశ్వవిద్యాలయాల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులకు పోటీకి అర్హత కోసం ఈ పరీక్షను ఏటా రెండుసార్లు నిర్వహిస్తారు. జూన్‌లో 85 సబ్జెక్టులకు కంప్యూటర్ ఆధారిత పరీక్షకు దేశవ్యాప్తంగా నిర్వహించారు.
ఎలా చెక్ చేయాలి?
ugcnet.nta.nic.in యూజీసీ నెట్ అధికారిక వెబ్‌సైట్ సందర్శించండి.
హోమ్ పేజీలో అందుబాటులో ఉన్న యూజీసీ నెట్ రిజల్ట్ 2025 లింక్‌పై క్లిక్ చేయండి.
అభ్యర్థులు లాగిన్ వివరాలను నమోదు చేయాల్సిన కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
సబ్మిట్ మీద క్లిక్ చేస్తే రిజల్ట్ కనిపిస్తుంది.
రిజల్ట్ చెక్ చేసి పేజీని డౌన్లోడ్ చేసుకోవాలి.
Best Web Hosting Provider In India 2024
Source link