కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: పారు డ్యాన్స్.. మాయలో పడొద్దన్న కార్తీక్.. ఒట్టు వేయించుకున్న సుమిత్ర.. దీప నిజం చెప్తుందా?

Best Web Hosting Provider In India 2024

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్: పారు డ్యాన్స్.. మాయలో పడొద్దన్న కార్తీక్.. ఒట్టు వేయించుకున్న సుమిత్ర.. దీప నిజం చెప్తుందా?

కార్తీక దీపం 2 సీరియల్ టుడే జులై 22వ తేదీ ఎపిసోడ్ లో నిశ్చితార్థం ఆపాలని దీప దగ్గర డ్రామా ఆడుతుంది పారిజాతం. వాళ్ల మాయలో పడొద్దని కార్తీక్ హెచ్చరిస్తాడు. దీపకు కొత్త చీర కానుకగా ఇచ్చిన సుమిత్ర.. పూజ గది ముందు ఒట్టు వేయించుకుంటుంది. ఇంకా ఈ రోజు ఎపిసోడ్ లో ఏం జరిగిందో ఇక్కడ చూసేయండి.

కార్తీక దీపం 2 టుడే ఎపిసోడ్ (jiohotstar)

కార్తీక దీపం 2 టుడే జులై 22వ తేదీ ఎపిసోడ్ లో జ్యోత్స్న ఎంగేజ్మెంట్ ఆగిపోవాలని దీప దగ్గర మొసలి కన్నీరు కారుస్తుంది పారిజాతం. ఈ నిశ్చితార్థం జరిగి జ్యోత్స్న జీవితానికి ఏదైనా అన్యాయం జరిగితే సుమిత్ర బతుకుతుందా? దశరథ బతుకుతాడా? పరువు కోసం బతికే ఆ పెద్దాయన బతుకుతాడా? అంతా బాగుంటే నాకూ సంతోషమే. ఏదైనా తేడా జరిగితే ఇంటిల్లిపాది ఉరేసుకుని చావాలి. ఎవరు ఎలా పోతే నాకెందుకు అనుకోవచ్చు? కానీ జ్యోత్స్న స్వయానా నీ అత్త కాంచన మేనకోడలు. అన్న కూతురుకు ప్రమాదం వస్తే ఆవిడ ప్రశాంతంగా ఉండగలదా? ఆమెకు ఏమైనా అయితే? నిశ్చితార్థాన్ని ఆపాలి దీప అని చేతులు పట్టుకుని బతిమిలాడుతుంది పారు.

నిశ్చితార్థం ఆపాలి

ఎలాగైనా నిశ్చితార్థం ఆపమని దీపను రిక్వెస్ట్ చేస్తుంది పారిజాతం.పెద్దగా టైమ్ లేదు దీప. ఏదైనా నీ వల్ల అవుతుంది. నీ ముందు ఏదైనా అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోలేవు. అన్యాయం జరగనివ్వవు ఆపుతావు. ఆ నమ్మకం నాకుంది అని చెప్పి పారు వెళ్లిపోతుంది. అదంతా చూసిన కార్తీక్.. టెన్షన్ పడాల్సింది నువ్వు కాదు జ్యోత్స్న అని దీపతో అంటాడు. తప్పించుకునేందుకు దారులన్నీ మూసుకుపోయాయి కాబట్టి నాటకాలు ఆడుతున్నారు. నీతోనే నిశ్చితార్థం ఆపించాలని అనుకుంటుంది. ఇలాంటి సెంటిమెంట్ సీన్లకు పడిపోతావని వాళ్ల ప్రగాఢ నమ్మకం అని కార్తీక్ అంటాడు.

మాయలో పడొద్దు

జ్యోత్స్న, పారిజాతం గురించి నాకు తెలుసు. కానీ నిశ్చితార్థం ఆగిపోతే అమ్మానాన్న, తాతయ్య బాధపడటం నిజం కాదా? మా అమ్మ వైపు నుంచి ఆలోచించు. తన కూతురుకు ఇది మూడో నిశ్చితార్థం. ఏదో ఒకటి చేసి ఈ నిశ్చితార్థం ఆపాలి అని దీప అంటుంది. కానీ వాళ్లు అనుకున్నట్లే చేయొద్దు దీప, వాళ్ల మాయలో పడొద్దు అని కార్తీక్ హెచ్చరిస్తాడు. ఈ నిశ్చితార్థాన్ని జ్యోత్స్ననే ఆపుతుందని కార్తీక్ అంటాడు. నిన్ను గౌతమ్ తో చంపించాలనుకుంది కూడా జ్యోత్స్ననే అని మనసులో అనుకుంటాడు.

నా మీద ఒట్టు

ఇంతలో దశరథ్ వచ్చి.. కార్తీక్ మీ అత్త నిశ్చితార్థం దగ్గరకు రానంటుంది. ఓ సారి దీపతో మాట్లాడాలని అనుకుంటుంది. ఓ సారి దీపను రమ్మంటుందని చెప్పి వెళ్లిపోతాడు దశరథ్. అక్కడ మీ అమ్మ ఎంత రెచ్చిగొట్టినా నువ్వు ఏం మాట్లాడకూడదు, నువ్వు మాట్లాడితే నా మీద ఒట్టే అని కార్తీక్ అంటాడు. కార్తీక్ ను దాటి దీప ఏ పని చేయదు అని వంటలక్క చెప్తుంది. నా మాట అదుపులోనే ఉంచుకుంటా, కానీ నిశ్చితార్థం ఎలా ఆపుతావో ఆపు అని దీప వెళ్లిపోతుంది.

సుమిత్ర కానుక

నేను సంతోషంగా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావా? అడిగేది నిన్నే దీప అని అంటుంది సుమిత్ర. అవునని దీప అనగానే.. నా నుంచి నీకు ఓ కానుకు ఇవ్వాలని అనుకుంటున్నా అని సుమిత్ర చీరను అందిస్తుంది. మరోవైపు జ్యోత్స్న దగ్గరకు వెళ్లి డ్యాన్స్ చేస్తుంది పారు. ముసలోడు ఆగిపోయే నిశ్చితార్థానికి తెగ ఆరాటపడుతున్నాడు. నా యాక్టింగ్ కు మీ తాతే పడిపోతాడు, ఇక దీప ఉంటుందా? లేడీస్ సెంటిమెంట్ తో కొట్టాను. నాలుగు కన్నీటి చుక్కలూ కార్చాను అని పారు చెప్తుంది.

పారు డ్యాన్స్

దీప సెంటిమెంటల్ ఫూల్ అని నాకు తెలుసు. గౌతమ్ రాగానే నాలుగు పీకి వాడు ఓ వెధవ అని అందరి ముందు కొట్టి చెబుతుంది. పెళ్లి క్యాన్సిల్ అవుతుంది. నింద దీప మీద పడుతుంది. మనం సేఫ్ గా ఎస్కేప్ అవుతామని జ్యో అంటుంది. ప్లాన్ సక్సెస్ అవుతుందని జ్యో, పారు హగ్ చేసుకుని సంబరపడతారు. సుమిత్ర ఇచ్చిన చీర కట్టుకుని దీప సంతోషపడుతుంది. కార్తీక్ కు చూపించి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. చాలా కొత్తగా కనపడుతున్నావ్ దీప, నీ చుట్టూ ఏం జరుగుతుందో కూడా మర్చిపోయావని కార్తీక్ అంటాడు.

చీరలో సంబరం

నిజంగా నువ్వే కూతురు అని తెలిసి ప్రేమగా హత్తుకుంటే ఏమైపోతావో అని కార్తీక్ అంటే.. లేదు బావ మా అమ్మానాన్న బాగుండాలని కోరుకుంటున్నానే తప్పా నిజం తెలియాలని నాకేదో మేలు జరగాలని కోరుకోవడం లేదు బావ. వాళ్లు ప్రమాదంలో ఉన్నారు. ఇంత దగ్గరగా ఉంటూ వాళ్లను కాపాడుకోవడం నాకు ముఖ్యం అని దీప చెప్తుంది. ఒకప్పుడు మా అమ్మ ఆనందం, సహనం చూసి ఈర్ష్య పడేవాడిని. నువ్వు మా అమ్మనే దాటేశావు దీప. నిజంగా భూదేవికి ఎంత సహనం ఉందో నాకు తెలియదు దీప. కానీ ఒక్కసారి కూడా మీ అమ్మ నీ కోపాన్ని చూడలేదు. అన్నీ మౌనంగా మోస్తూనే ఉన్నావని కార్తీక్ అంటాడు.

దేవుడి సాక్షిగా

దీపను తీసుకుని పూజ గదికి వెళ్తుంది సుమిత్ర. దేవుడి సాక్షిగా అడుగుతున్నా సమాధానం చెప్పు. ఈ నిశ్చితార్థం జరుగుతుందా? ఇంతకుముందు నీ ముఖంలో ఏదైతే ఆనందం కనబడిందో అది నా కూతురు ముఖం మీద కూడా ఉంటుందా? ఈ ప్రశ్న ఎందుకు అడుగుతున్నానంటే నీ మీద నాకు నమ్మకం లేదు దీప. నిశ్చితార్థానికి నువ్వు ఇంట్లో ఉండటం పెళ్లి కొడుకు తల్లికి ఇష్టం లేదు. ఎప్పుడైతే నా ఇంటి ఆడ పడుచు నా ఇంటికి రావడానికి ఇష్టపడలేదో అప్పుడే ఈ నిశ్చితార్థాన్ని ఆపడానికి నువ్వేదో చేయబోతున్నావని అర్థమైంది. ఈ దేవుడి మీద ఒట్టు వేసి నిశ్చితార్థం జరుగుతుంది అని చెప్పు.లేదంటే నీ మీద ఒట్టేసి చెప్పు అని సుమిత్ర అనడంతో నేటి కార్తీక దీపం 2 సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.

చందు శనిగారపు హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా పని చేస్తున్నారు. ఈయనకు మీడియా రంగంలో ఏడేళ్లకు పైగా అనుభవం ఉంది. ఈనాడు లాంటి ప్రముఖ దినపత్రికలో పని చేశారు. ఫిబ్రవరి 6, 2025 నుంచి ఇక్కడ స్పోర్ట్స్, ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ వార్తలు రాస్తున్నారు. వివిధ ర‌కాల క్రీడ‌ల‌పై అవ‌గాహ‌న ఉంది.

సంబంధిత కథనం

Best Web Hosting Provider In India 2024

Source / Credits

Best Web Hosting Provider In India 2024