




Best Web Hosting Provider In India 2024

నిన్ను కోరి టుడే జులై 22 ఎపిసోడ్:విరాట్ కు చంద్ర సేవలు..అమ్మవారు తగ్గిపోవాలని మొక్కు..బోనంలో బొగ్గుపొడి కలిపిన కామాక్షి
నిన్ను కోరి సీరియల్ టుడే జులై 22వ తేదీ ఎపిసోడ్ లో విరాట్ కు చంద్రకళ సేవలు చేస్తుంది. అమ్మవారు తగ్గిపోవాలని బోనమెత్తుతాని చంద్ర మొక్కుకుంటుంది. కానీ ఆ మొక్కు తీర్చకుండా చంద్రను దెబ్బ కొట్టాలని కామాక్షి, శ్రుతి, శాలిని ప్లాన్ వేస్తారు.
నిన్ను కోరి సీరియల్ టుడే జులై 22వ తేదీ ఎపిసోడ్ లో అమ్మవారు పోసిన విరాట్ ను ఎలా చూసుకోవాలో పూజారిని అడిగి తెలుసుకుంటుంది చంద్రకళ. ఇది ఆషాడ మాసం కాబట్టి అమ్మవారికి బోనం సమర్పించుకుంటే మంచిది. కానీ ఏదైనా తప్పు జరిగితే అమ్మవారు ఆగ్రహిస్తుంది. మధ్యలో బోనం నేలపాలు అయితే అరిష్టం అని చంద్రతో పూజారి చెప్తాడు.
చంద్ర సేవలు
క్రాంతి వేప కొమ్ములు, తెల్లని వస్త్రం తెచ్చి నేలపై పరుస్తాడు. విరాట్ ను లేపి పడుకోబెడతారు. పక్కనే కూర్చుని వేప కొమ్మలతో విసురుతూ ఉంటుంది చంద్రకళ. ఓ వైపు బాధపడుతూనే విరాట్ కు అన్ని సేవలు చేస్తుంది చంద్రకళ. అలా రెండు మూడు రోజులు గడుస్తుంది. చంద్రకళ రాత్రి పగలు కంటి మీద కునుకు లేకుండా చూసుకుంటూ ఉంటుంది.
క్రాంతి కోపం
ప్రతి రోజు నిష్ఠగా పూజలు చేస్తుంది. విరాట్ కు సేవలు చేస్తుంది. విరాట్ నేల మీద పడుకున్నాడని తాను కూడా నేల మీదే పడుకుంటుంది. ఇదంతా చూస్తుంటే విరాట్ అంటే తనకెంత ప్రేమో అర్థమవుతోంది అని శ్యామల అంటుంది. అప్పుడే శాలినిని వైపు కోపంగా చూసి క్రాంతి బయటకు వెళ్లిపోతాడు. క్రాంతి వెనకాలే వెళ్లిన శాలిని ఇలా ఇంకెన్ని రోజులు అని అడుగుతుంది. వదిన లాంటి భార్య దొరికినందుకు మా అన్నయ్య అదృష్టవంతుడు అని క్రాంతి అనడంతో శాలినికి మండిపోతుంది.
చెడగొట్టే ప్లాన్
చంద్రకళను ఎలా దెబ్బకొట్టాలోనని ఆలోచిస్తున్న శాలిని దగ్గరకు కామాక్షి, శ్రుతి వస్తారు. చంద్రకళ బోనం అమ్మవారి దగ్గరకు చేరకుండా చేయాలని ప్లాన్ చేసుకుంటారు. శాలిని కూడా బోనం ఎత్తాలని అనుకుంటుంది. క్రాంతి తన మాట వినేలా అమ్మవారిని కోరుకుంటానని అనుకుంటుంది. చంద్ర వెనుకాల నార్మల్ గా వెళ్తే డౌట్ వస్తుందని, అందుకే బోనాలు ఎత్తుకుంటామని శాలిని, శ్రుతి అనుకుంటారు. ముగ్గురం కలిసికట్టుగా ప్లాన్ అమలు చేద్దామని అనుకుంటారు.
బోనాల కోసం
పొద్దున అందరూ కలిసి గుడికి వెళ్తారు. మీరెందుకు వచ్చారని కామాక్షిని అడుగుతుంది శ్యామల. క్రాంతి బిజినెస్ సక్సెస్ కావాలని బోనమెత్తుతా అని మొక్కుకున్నానని శాలిని చెప్తుంది. నా మనసుకు నచ్చినవాడు జీవితంలోకి రావాలని బోనమెత్తుతా అని శ్రుతి అంటుంది. అందరూ బోనం వండుతారు. చంద్రకళ బోనంలో బొగ్గు పొడి కలపాలని కామాక్షి, శ్రుతి ప్లాన్ చేస్తారు.
చంద్రకళ, శ్యామల దగ్గరకు వెళ్లి శ్రుతి మాట్లాడుతుంది. అదే సమయంలో కామాక్షి వెళ్లి బోనంలో బొగ్గు పొడి కలిపేస్తుంది. దీంతో నేటి నిన్ను కోరి సీరియల్ ఎపిసోడ్ ముగుస్తుంది.
సంబంధిత కథనం
టాపిక్