





Best Web Hosting Provider In India 2024

ఓటీటీలోకి వచ్చేసిన సూపర్ హిట్ మలయాళం థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. రాత్రి గస్తీకి వెళ్లిన పోలీసుల కథ
ఒక రాత్రి గస్తీకి వెళ్లిన ఇద్దరు పోలీసులకు ఎదురైన సంఘటనలతో థ్రిల్లర్ గా రూపొందిన మలయాళం మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. బాక్సాఫీస్ దగ్గర అదరగొట్టిన ఈ సినిమా.. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ లోనూ ఆకట్టుకునే ఛాన్స్ ఉంది.
మరో మలయాళం థ్రిల్లర్ మూవీ ఓటీటీలోకి దూసుకొచ్చింది. థియేటర్లలో అదరగొట్టిన ‘రోంత్’ (Ronth) సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. ఈ రోజు (జులై 22) నుంచే ఓటీటీలో ప్రసారమవుతోంది ఈ సినిమా. తెలుగులోనూ అందుబాటులో ఉంది. ఒక రాత్రి గస్తీకి వెళ్లిన ఇద్దరు పోలీసు అధికారులకు ఎదురయ్యే సంఘటనలతో ఈ సినిమా తెరకెక్కించారు.
ఏ ఓటీటీలో?
మలయాళం సూపర్ హిట్ థ్రిల్లర్ రోంత్ మూవీ ఇవాళ ఓటీటీలో అడుగుపెట్టింది. జియోహాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. ఒరిజినల్ మలయాళంతో పాటు తెలుగు, కన్నడ, హిందీ, తమిళం భాషల్లోనూ ఈ మూవీ అందుబాటులో ఉంది. మంచి మలయాళం థ్రిల్లర్ మూవీ చూడాలనుకున్న వాళ్లకు ఇది బెస్ట్ ఆప్షన్.
నెల రోజుల తర్వాత
థియేటర్లలో రిలీజైన నెల రోజుల తర్వాత రోంత్ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. జూన్ 13, 2025న ఈ మలయాళం థ్రిల్లర్ మూవీ థియేటర్లలో విడుదలైంది. పాజిటివ్ టాక్ తో సాగిపోయింది ఈ సినిమా. ఈ ఫిల్మ్ కు షాహి కబీర్ డైరెక్టర్. కథ కూడా ఆయనే రాశారు. జంగ్లీ పిక్సర్స్ ఫెస్టివల్ సినిమాస్ బ్యానర్ పై వినీత్ జైన్, రతీష్, రెంజిత్, జోజో నిర్మించారు. ప్రముఖ మలయాళ నటుడు రోషన్ మాథ్యూ, దిలీష్ పోతన్ ఈ సినిమాలో లీడ్ రోల్స్ ప్లే చేశారు.
కథ ఏమిటంటే?
రోంత్ అంటే గస్తీ అని అర్థం. నైట్ ప్యాట్రోలింగ్ చేసే ఇద్దరు పోలీసుల కథ ఇది. సీనియర్ పోలీస్ అధికారి యోహన్నన్ (దిలీప్ పోతన్)తో కలిసి సీపీవో దిన్నాతన్ (రోషన్ మాథ్యూ) రాత్రి ప్యాట్రోలింగ్ కు వెళ్లాడు. అలా ప్యాట్రోలింగ్ వెళ్లిన వాళ్లకు కొన్ని డిఫరెంట్ సంఘటనలు ఎదురవుతాయి. సిటీలో కొన్ని విషయాలు అబ్ నార్మల్ గా ఉన్నట్లు కనిపిస్తాయి.
రాత్రి గస్తీకి వెళ్లిన ఇద్దరు పోలీసు అధికారులు చుట్టూ తిరిగే కథనే రోంత్. జియోహాట్‌స్టార్ ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమాలో నైట్ ప్యాట్రోలింగ్ చేసే ఇద్దరు పోలీసులకు ఎదురయ్యే సంఘటనలు థ్రిల్ ను పంచుతాయి. చివరకు అది హత్య కేసును ఛేదించే వరకూ వెళ్తుంది. ఈ మూవీలో థ్రిల్ తో పాటు ఎమోషన్ డ్రామా కూడా ఉంది.
థ్రిల్లర్ కోసం
మలయాళం థ్రిల్లర్ సినిమాలకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. ఆ మూవీ ఆడియన్స్ ను ఎంగేజ్ చేస్తాయి. ఈ రోంత్ ఫిల్మ్ కూడా అలాంటిదే. మంచి మలయాళం థ్రిల్లర్ కోసం వెతుకుతున్న ప్రేక్షకులు ఈ మూవీపై ఓ లుక్కేయండి. తెలుగులోనూ ఈ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.
సంబంధిత కథనం